16, ఆగస్టు 2011, మంగళవారం

పదవి లేకుండా బతకలేo

పదవి లేకుండా బతకలేమని  తెలంగాణ మంత్రులు నిరూపించారు. ప్రజల ఆకాంక్షలకన్నా తమకు పదవులే ముఖ్యమని చాటుకున్నారు. లగడపాటి, కావూరి చెప్పిన మాటలను తెలంగాణ మంత్రులు  నిజం చేసి చూపించారు. కాంగ్రెస్  స్టీరింగ్ కమిటీలో తాము తీసుకున్న నిర్ణయాన్ని తామే అతిక్రమించారు.
తెలంగాణ ప్రాంత మంత్రులు.. మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు.  ఒక కోమటిడ్డి వెంకట్‌ రెడ్డి మినహా మిగతా అందరూ హాజరయ్యారు.  మరో మంత్రి శంకర్‌రావు తాను అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నానంటూ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అనుమతి తీసుకున్నారు. మొత్తంగా ముఖ్యమంత్రి సూచన మేరకు మంత్త్రులు పదవులు అనుభవించేందుకే కట్టుబడ్డారు.  తెలంగాణ కోసం పదవులు త్యాగం చేస్తామని బీరాలు పలికిన మంత్రులు ఉద్యమం తీవ్ర దశలో ఉన్న తరుణంలో మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేశారని తెలంగాణ వాదులు భగ్గుమంటున్నారు.
మరోవైపు   స్టీరింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న మంత్రి  జానాడ్డి కూడా కేబినెట్ సమావేశంలో ఉత్సాహంగా పాల్గొనటం తెలంగాణవాదుల్లో ఆగ్రహాం కలిగిస్తోంది. తెలంగాణ విషయంలో మంత్రులకు మొదటి నుంచి చిత్తశుద్ధి లేదు. ప్రజలు గ్రామాలలో తిరగనిచ్చే పరిస్థతిలేకనే పదవులకు దూరమని ప్రకటించినా  ఇళ్లకు ఫైళ్లు తెప్పించుకుని విధులు నిర్వహించారు. ప్రస్తుతం సోనియా అనారోగ్య కారణాలను చూపి తిరిగి విధుల్లో చేరారు. దీనిపై భగ్గుమంటున్న తెలంగాణ వాదులు కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా ఓట్లు వేసేది తెలంగాణ ప్రజలు అన్నది గుర్తుంచుకోవాలని తెలంగాణకు ద్రోహం చేసిన మంత్రులకు భవిష్యత్ లో మిగిలేది రాజకీయ సన్యాసమేనని అన్నారు.

1 కామెంట్‌: