28, ఆగస్టు 2011, ఆదివారం

రోశయ్య ఆడిన ‘దొంగాట’కేంద్రం ప్రకటించిన తెలంగాణను అప్పుడు ముఖ్యమంత్రిగా  ఉన్న రోశయ్య అడ్డుకున్నాడా ? తెలంగాణ కొరకు రాష్ట్ర అసేంబ్లీలో తీర్మానం చేసి పంపాలన్న అధిష్టానం సూచనలను పక్కకు పెట్టి తీర్మానం చేయించలేనని తన వ్యూహంలో భాగంగానే అడ్డుకున్నాడా ?  ఒకసారి అసేంబ్లీలో తీర్మానం చేస్తే తెలంగాణ ఏర్పాటు అవుతుందని సుధీర్ఘ రాజకీయ అనుభవం  ఉన్న రోశయ్య గ్రహించాడా ?  అప్పటికి కేవలం అఖిలపక్ష తీర్మానం చేయించి ఢిల్లీకి పంపిన రోశయ్య డిసెంబరు 9న కేంద్రం తెలంగాణను ప్రకటించగానే సీమాంధ్రలో మొదలయిన ఉద్యమంపై కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపి తిరిగి డిసెంబరు 23న తెలంగాణపై కేంద్రం యూ టర్న్ తీసుకునేలా పథకం వేశాడా ?
అవును ..పైన అనుమానించిన ప్రశ్నలన్నీ అక్షరాల నిజం. కావాలని చెప్పాడా ? లేక తనను అసమర్ధునిగా భావించిన రాష్ట్ర ప్రజలకు తాను అపర చాణక్యుడిని అని చాటుకునేందుకు చెప్పాడా ? సీమాంధ్రలో తన ఇమేజ్ ను పెంచేందుకు చెప్పాడా ? అన్న విషయం పక్కన పెడితే తెలంగాణ రాకుండా రోశయ్య వేసిన పాచిక మాత్రం చాలా గట్టిదే. దీనికి తెరవెనుక చంద్రబాబు సహకారం ఉండి ఉంటుందన్న దానిలోనూ  ఎలాంటి అనుమానాలు ఉండనక్కర లేదు. అయితే ఇన్ని రోజులకు అప్పుడు జరిగిన విషయాన్ని రోశయ్య ఆంధ్రజ్యోతి ఛానల్  ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో వెల్లడించాడు.
తెలంగాణ ప్రత్యేకరాష్ట్రం కోసం 11 రోజులుగా కేసీఆర్ నిరసన దీక్ష చేపట్టడంతో ఎప్పటి నుండో తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. అందుకే దీనిని సోనియాగాంధీ జన్మదిన కానుకగా ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్యను తీర్మానం చేసి పంపాలని సూచించింది. అయితే అసేంబ్లీలో తీర్మానం ఒక్కసారి చేస్తే ఎప్పటికయినా ముప్పేనని గ్రహించిన రోశయ్య కేవలం అఖిలపక్ష తీర్మానంతో సరిపెట్టారు. తరువాత తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకునేలా చేశారు.
రాష్ట్రాన్ని విడగొట్టిన ముఖ్యమంత్రిగా, రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా జీవితకాలంలో తనకు సీమాంధ్రలో మచ్చ వస్తుందని, భవిష్యత్ తరాలు తనను ఎలా గౌరవిస్తాయోనని భావించిన రోశయ్య మొత్తానికి గొప్పగానే చక్రం తిప్పాడు. మెల్లగా తాను ఆడిన ‘దొంగాట’ను బయటపెట్టాడు.
 తెలంగాణ ప్రజలను మోసంచేసిన రోశయ్య తెలంగాణలో వందలమంది విద్యార్థల  ఆత్మహత్యలకు కారకుడయ్యాడు. అప్పట్లో కాసు బ్రహ్మానందరెడ్డి కాల్పులు జరిపించి తెలంగాణ విద్యార్థులను పొట్టన పెట్టుకుంటే రోశయ్య వెన్నుపోటు పొడిచి తన పని కానిచ్చాడు. మోసం చేసేవాన్ని నమ్మొచ్చు కాని నమ్మించి మోసం చేసేవాన్ని అసలు నమ్మొద్దు జాగ్రత్త మిత్రులారా ? తెలంగాణ  ఉద్యమంలో రాళ్లుంటాయ్..సీమాంధ్ర ముళ్లుంటాయ్. జై తెలంగాణ జై జై తెలంగాణ

27, ఆగస్టు 2011, శనివారం

గర్జించిన ‘గద్వాల’: మార్మోగిన తెలంగాణం


సీమాంధ్ర ముఖ్యమంత్రి పర్యటన తమకు అవసరం లేదని గద్వాలలో తెలంగాణ వాదులు, విద్యార్థులు భారీగా ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా పోలీసులు అడ్డంకులు పెట్టినా, కళాశాలలకు తాళాలు వేసినా, తెలంగాణ వాదులను అరెస్టు చేసినా, మంత్రి డీకే అరుణ హెచ్చరించినా  అన్నింటినీ దాటుకుని విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి సభలో యువకులకు ఉద్యోగాలు ప్రకటించగానే మా ఉద్యోగాలు మేము చేసుకుంటామని, సీమాంధ్ర పాలన అక్కరలేదని నినాదాలు చేశారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలమూరు జిల్లాకు యువ కిరణాలు పథకం కింద రాబోయే మూడేళ్లలో 70 వేల ఉద్యోగాల వస్తాయని చెప్పడంతో  సభలో ఒక్కసారిగ విద్యార్థులు జై తెలంగాణ మా తెలంగాణలో మా ఉద్యోగాలు మేము చేసుకుంటాం అంటు ముఖ్యమంత్రి ప్రసంగానికి అడ్డుతగలడంతో వారిని పక్కకు తప్పించండి వారికి ఈ జిల్లాకు ఉద్యోగాలు రావడం ఇష్టం లేనట్టుంది అంటు నిరసనల మద్యనే తన ప్రసంగాన్ని కొనసాగించారు.
అంతకుముందు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటనకు వ్యతిరేకంగా  గద్వాల్‌లో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం గోబ్యాక్ అంటు నినాదాలు చేశారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 15మంది విద్యార్థులు కిరోసిన్ డబ్బాలతో వాటర్ ట్యాంక్ ఎక్కారు. ఉద్రిక్తల నడుమనే ముఖ్యమంత్రి గద్వాల్ చేరుకున్నారు.
తెలంగాణవాదులు సీఎం పర్యటనను వ్యతిరేకిస్తుండటంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ముందస్తుగా విద్యార్థులను, తెలంగాణవాదులను అదుపులోనికి తీసుకున్నారు. విద్యార్థులు బయటకు రాకుండా కళాశాల గేట్లకు తాళాలు వేసారు. 

25, ఆగస్టు 2011, గురువారం

తెలంగాణ ప్రెస్ క్లబ్ ప్రారంభం

తెలంగాణ జిల్లాలలో మొదటి సారిగా మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ తాలూకా  తెలకపల్లి మండలంలో  పత్రికా విలేకరులం అందరం  తమ ప్రెస్ క్లబ్ కు ‘తెలంగాణ ప్రెస్ క్లబ్’ అని నామకరణం చేసి ప్రారంభించాం. బుధవారం దీనిని జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ప్రారంభించారు. స్థానిక ఆర్డీఓ మధుసూధన్ నాయక్, డీ ఎస్ పీ జోగు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బాబయ్య, పత్రికా మిత్రులు భరత్, విజయ్, శ్రీరాములు ,బాలరాజు, శంకర్, చిలుక శేఖర్ రెడ్డి, రమేష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.    జై తెలంగాణ జై జై తెలంగాణ 21, ఆగస్టు 2011, ఆదివారం

తెలంగాణ ఎమ్మెల్యేలు సిగ్గు తెచ్చుకోవాలి


ఒక వ్యక్తి కోసం రాజీనామా చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చూసి తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు సిగ్గు తెచ్చుకోవాలని తెలంగాణ ఉద్యోగుల సంఘాల నేతలు విఠల్, పాపారావులు అన్నారు. తెలంగాణ కోసం చనిపోయిన 600 మంది అమరవీరుల ఆశయ సాధన కోసం తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్లీ రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.
ఒక వ్యక్తి కోసం 27 మంది రాజీనామాలు చేస్తుంటే, నాలుగున్నర కోట్ల ప్రజల కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎందుకు రాజీనామా చేయటం లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ బిడ్డలైతే సెప్టెంబర్ 17న తెలంగాణ జెండాలు ఎగురవేయాలని సవాల్ చేశారు. చంద్రబాబు నాయుడు అత్యంత అవినీతి పరుడని, ధనవంతుడని తెహల్కా ఏనాడో చెప్పిందని గుర్తు చేశారు.
జగన్‌పై సీబీఐ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆయన కోసం 27 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తుంటే, తెలంగాణ కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయకపోవడం సిగ్గుచేటని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్ మండిపడ్డారు.

సీమాంధ్ర పత్రికల విష ప్రచారం షురూ

తెలంగాణ ఉద్యమం చల్లబడిందని సీమాంధ్ర పత్రికలు తమ విష ప్రచారాన్ని మళ్లీ ప్రారంభించాయి. ఆదివారం సాక్షి దినపత్రిక ఈ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కొద్ది సేపటికే అదే వార్తను కాపీ చేసిన సూర్య దినపత్రిక తన నెట్ ఎడిషన్ లో ఉన్నది ఉన్నట్లుగా అచ్చుకొట్టింది. 
                     తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా రాజీనామా చేయాలని తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలను నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు బతిమాలుతుంటే కాంగ్రెస్, టీడీపీ నేతలు సిగ్గుతప్పి జారుకుంటున్నారు. 15౧౫ రోజులు పదవులకు దూరంగా ఉన్న మంత్రులు అదేదో జీవిత సర్వస్వం కోల్పోయినట్లు 14౧౪ఎఫ్ రద్దు చేయగానే చంకలు గుద్దుకుంటూ విధుల్లో చేరిపోయారు. తెలంగాణ ప్రజలరా తిరగబడండి. నేతలను తరిమికొడితేనే సిగ్గొస్తుంది. ఇంటి దొంగలతోనే మనకు ఇక్కట్లు తస్మాత్ జాగ్రత్త.16, ఆగస్టు 2011, మంగళవారం

పదవి లేకుండా బతకలేo

పదవి లేకుండా బతకలేమని  తెలంగాణ మంత్రులు నిరూపించారు. ప్రజల ఆకాంక్షలకన్నా తమకు పదవులే ముఖ్యమని చాటుకున్నారు. లగడపాటి, కావూరి చెప్పిన మాటలను తెలంగాణ మంత్రులు  నిజం చేసి చూపించారు. కాంగ్రెస్  స్టీరింగ్ కమిటీలో తాము తీసుకున్న నిర్ణయాన్ని తామే అతిక్రమించారు.
తెలంగాణ ప్రాంత మంత్రులు.. మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు.  ఒక కోమటిడ్డి వెంకట్‌ రెడ్డి మినహా మిగతా అందరూ హాజరయ్యారు.  మరో మంత్రి శంకర్‌రావు తాను అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నానంటూ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అనుమతి తీసుకున్నారు. మొత్తంగా ముఖ్యమంత్రి సూచన మేరకు మంత్త్రులు పదవులు అనుభవించేందుకే కట్టుబడ్డారు.  తెలంగాణ కోసం పదవులు త్యాగం చేస్తామని బీరాలు పలికిన మంత్రులు ఉద్యమం తీవ్ర దశలో ఉన్న తరుణంలో మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేశారని తెలంగాణ వాదులు భగ్గుమంటున్నారు.
మరోవైపు   స్టీరింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న మంత్రి  జానాడ్డి కూడా కేబినెట్ సమావేశంలో ఉత్సాహంగా పాల్గొనటం తెలంగాణవాదుల్లో ఆగ్రహాం కలిగిస్తోంది. తెలంగాణ విషయంలో మంత్రులకు మొదటి నుంచి చిత్తశుద్ధి లేదు. ప్రజలు గ్రామాలలో తిరగనిచ్చే పరిస్థతిలేకనే పదవులకు దూరమని ప్రకటించినా  ఇళ్లకు ఫైళ్లు తెప్పించుకుని విధులు నిర్వహించారు. ప్రస్తుతం సోనియా అనారోగ్య కారణాలను చూపి తిరిగి విధుల్లో చేరారు. దీనిపై భగ్గుమంటున్న తెలంగాణ వాదులు కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా ఓట్లు వేసేది తెలంగాణ ప్రజలు అన్నది గుర్తుంచుకోవాలని తెలంగాణకు ద్రోహం చేసిన మంత్రులకు భవిష్యత్ లో మిగిలేది రాజకీయ సన్యాసమేనని అన్నారు.

12, ఆగస్టు 2011, శుక్రవారం

14ఎఫ్‌ను తొలగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు


14ఎఫ్‌ను తొలగిస్తూ శుక్రవారం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా  విడుదలైంది. 14 ఎఫ్ రద్దుతో ఇక హైదరాబాద్ ఫ్రీజోన్ కాకుండా ఆరో జోన్ పరిధిలోకి రానుంది. ఆరో జోన్‌లో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఎస్‌ఐ రాతపరీక్షలకు ముందు రోజే కేంద్రం 14ఎఫ్‌పై కీలక నిర్ణయం తీసుకుంది.  సీఎం కార్యాలయంకు సమాచారం అందినట్లు అధికారులు ప్రకటించారు.
14ఎఫ్‌ రద్దుకోసం గత కొన్నేళ్లుగా తెలంగాణలో  ఆందోళనలు సాగుతున్నాయి. గత కొంతకాలంగా అవి తీవ్ర రూపం దాల్చాయి. దీంతో కేంద్రం దీన్ని సీరియస్ గా తీసుకుంది.  ఈ నెల 13, 14న రాష్ట్రంలో ఎస్సై రాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే  14ఎఫ్‌ రద్దు చేయనిదే పరీక్షలు  రాసేది లేదని తెలంగాణ వాదులు పట్టుబట్టారు.  ఈ నేపథ్యంలో కేంద్రం తొందరగా స్పందించి పరీక్షలకు ముందే ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనే అసేంబ్లీ తీర్మానం చేయడంతో నిర్ణయం తొందరగా వెలువడింది.
తెలంగాణ ప్రజల చారిత్రక విజయం
14ఎఫ్ తొలగింపు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదల చేయటం తెలంగాణ ప్రజలు సాధించిన చారిత్రక విజయం అని తెలంగాణ విద్యార్థి, రాజకీయ, ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది. ఇదే స్ఫూర్తితో తెలంగాణను కూడా సాధించుకుంటామని టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు, రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం తెలిపారు. ఇది తెలంగాణ ప్రజల, నాయకుల ఐక్యతకు నిదర్శనమని అని నాగం జనార్ధనరెడ్డి అన్నారు.  తెలంగాణ సాధించేవరకు ఈపోరాటం కొనసాగుతుందని తెలిపారు.

6, ఆగస్టు 2011, శనివారం

వురి కొయ్యకు వేలాడిన వీరుడా
వుద్యఃమం సంగతి మరిచావా ?
చావే సమస్యకు పరిష్కారమనుకుంటే
నాలుగున్నర కోట్ల వురితాళ్ళు వొకే చోట పెనవేద్దాం
నేతలు చస్తే తెలంగాణ వస్తుందనుకుంటే
తెలంగాణ నేతలందర్ని పాతరేద్దాం
కానీ యిది సమస్యకు పరిష్కారం కాదని నీకు తెలుసు
m tech చదివిన నీవే చావు పరిష్కారమనుకుంటే
తెలంగాణ ప్రజలు యేమై పోవాలి
నిన్ను నమ్ముకున్న తల్లిదండ్రులు యేం కావాలి
తెలంగాణ తల్లికి గర్భశోకం మిగిలిస్తావా
తెలంగాణ సాయుధ పోరాటంలో
ఖాశీం రజ్వీలు వున్నారు
షోయబుల్లాఖాన్ లు వున్నారు
పోరాటం మన పుట్టుక..పోరాటం మన వూపిరి
జైపాల్ రెడ్డిని తరమడానికి
దానం, ముఖేష్ లాంటి ద్రోహులను గెంటడానికి
దామోదర రాజనర్సింహ, యెర్రబెల్లి, దేవేందర్ గౌడ్ లను దునుమాడేందుకు,
తెలంగాణను యెచ్చిడి చేస్తున్న చిదంబరంలను దించేందుకు
వోటు అనే వజ్రాయుధం మనకు వుంది
తెలంగాణ పోరులో నువ్వు కోరుకున్నట్లు
aaKhari అమరుడివి నువ్వేకావాలి
మరే వీరుడు నేలకు వొరగొద్దు

మిత్రులరా తెలంగాణ మన జన్మహక్కు
దాన్ని పోరాడి సాధించుకుందాం జై తెలంగాణ జై జై తెలంగాణ
.....సందీప్ రెడ్డి కొత్తపల్లి @telangana jai www.thovva.blogspot.com