27, మార్చి 2012, మంగళవారం

మరో బలిదానం !


తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో జాప్యాన్ని నిరసిస్తూ మరో యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా తుఫ్రాన్ మండలం ఇమాంపూర్ వద్ద ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రంగారెడ్డి జిల్లా మేడ్చెల్ మండలం రాయలపూర్‌కు చెందిన యాదగిరిగా పోలీసులు గుర్తించారు.

తాను తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు యాదగిరి సెల్‌ఫోన్‌లో వాయిస్ రికార్డు చేసి చనిపోయాడు. దీంతో పాటు ఫోన్ లో తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మెసేజ్ టైప్ చేశాడు. విషయం తెలుసుకున్న తెలంగాణ వాదులు పెద్దఎత్తున్న సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.

25, మార్చి 2012, ఆదివారం

ఓరుగల్లులో మరో ఆత్మహత్య


తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లాలో మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లాకు చెందిన భోజ్యానాయక్ ఆత్మహత్య చేసుకుని అంత్యక్రియలు పూర్తయి 24 గంటలు గడువక ముందే మరో ఆత్మహత్య సంఘటన జరగడం సంచలనం రేపుతోంది. వరంగల్ లోని హన్మకొండలో కొద్దిసేపటి క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది.
హన్మకొండ సమీపంలోని పబ్లిక్ గార్డెన్ వద్ద రాజమొగిలి అనే యువకుడు వంటిపై పెట్రోలు పోసుకుని జై తెలంగాణ నినాదాలు చేస్తూ నిప్పంటించుకున్నాడు. స్థానికులు గమనించి స్పందించేలోపే ఎక్కువభాగం కాలిపోయాడు. రాజమొగిలి జఫర్ ఘడ్ మండలం తిమ్మంపల్లికి  చెందిన వ్యక్తి. ఆయన భౌతికఖాయాన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యలు జరుగుతున్నా ప్రభుత్వంలో స్పందనలేదని నిరసన వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ శాసనసభ్యలు సభ వాయిదా పడినా సభలోనే నిరసన తెలుపుతున్నారు. తెలంగాణ గురించి తెల్చేవరకు సభను విడిచిపెట్టమని వారు తేల్చిచెప్పారు.

24, మార్చి 2012, శనివారం

తెలంగాణ కోసం మరో ఆత్మహత్య


తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు కోరుతూ వరంగల్ జిల్లాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ లోని ఆర్ట్ కళాశాల దగ్గర జై తెలంగాణ అంటూ బొజ్జా నాయక్ అనే విద్యార్థి  వంటికి నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బొజ్జా నాయక్ న్యూసైన్స్ కళాశాలలో ఎంబీఎ చదువుతున్నాడు. రఘునాథపల్లి మండలం అశ్వారావు పల్లి పక్కన బీరానాయక్ తండా ఆయన స్వగ్రామం.
కాంగ్రెస్, టీడీపీ నాయకుల దొంగనాటకాల వల్లనే తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు ఆలస్య మవుతుందని బొజ్జానాయక్ విమర్శించాడు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కోర్టులో పోరాడుతామని, విద్యార్థి ఆత్మహత్య బాధాకరమని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సంఘటితంగా పోరాడి తెలంగాణ సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థుల ఆత్మహత్యలకు సోనియా సహా రాష్ట్ర మంత్రి డీకె అరుణ, గండ్ర వెంకటరమణా రెడ్డి తదితరులు బాధ్యత వహించాలని,చ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని న్యాయవాది అరుణ్ కుమార్ కోరారు.

21, మార్చి 2012, బుధవారం

గెలిచిన గుర్రాలివే !


Nagam Janardhan27,325  మెజార్టీ  
నాగం జనార్ధన్ రెడ్డి (నాగర్ కర్నూలు)


JUPALLI Krishna Rao15,043 ఓట్ల మెజార్టీ
జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్)


Gampa Gpvardhan44,465 ఓట్లతో ఘనవిజయం (కామారెడ్డి)
గంప గోవర్ధన్ (టీఆర్ఎస్)

JoguRamanna33 వేల ఓట్లు మెజార్టీ
జోగురామన్న (ఆదిలాబాద్)

1897 మెజార్టీ
ఎన్నం శ్రీనివాస్ రెడ్డి (బీజేపీ)
SRINIVAS

                                           
Rajaiah32,830 మెజార్టీతో గెలుపు
తాటి కొండ రాజయ్య (స్టేషన్ ఘన్ పూర్)

20, మార్చి 2012, మంగళవారం

కారు జోరు..టీడీపీ, కాంగ్రెస్ బేజారు


నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్, స్టేషన్ ఘనపూర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్య ఘనవిజయం సాధించారు. కామారెడ్డిలో టీడీపీకి  డిపాజిట్ దక్కలేదు. స్టేషన్ ఘనపూర్ లో టీడీపీ అభ్యర్థి కడియం శ్రీహరి రెండో స్థానంలో నిలిచారు.
గంప గోవర్ధన్ అనూహ్యంగా 44 వేల ఓట్ల అధిక్యంతో విజయం సాధించగా, రాజయ్య 26 వేల ఓట్ల అధిక్యంతో విజయం సాధించారు. కామారెడ్డిలో అభ్యర్థిపై వ్యతిరేకత ఉందని, గెలుపు కష్టమని వార్తలు వచ్చాయి. అయితే ఓటింగ్ సరళిలో ఆ విషయం ఎక్కడా కనిపించలేదు. పూర్తిగా ప్రజలు ఏకపక్షంగా ఓట్లు వేసినట్లు కనిపిస్తోంది.

పాలమూరులో ముందుకెళ్లిన ’కారు‘

మహబూబ్ నగర్ అసేంబ్లీ నియోజకవర్గంలో రౌండ్ రౌండ్ కు ఫలితాల్లో తేడా వస్తోంది. ఆరు రౌండ్ల వరకు కాంగ్రెస్ అభ్యర్థి స్వల్ప ముందంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఎన్నం శ్రీనివాస్ రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి నాలుగో స్థానంలో ఉన్నారు. అయితే అనూహ్యంగా టీఆర్ఎస్ అభ్యర్థి సయ్యద్ ఇబ్రహీం పుంజుకున్నారు.
ఎనిమిదో రౌండ్ పూర్తయ్యే సరికి 479 ఓట్ల అధిక్యంలోకి దూసుకెళ్లారు. బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో నిలిచారు. టీఆర్ఎస్ కు 15,470 ఓట్లు రాగా, బీజేపీకి 14,900 ఓట్లు, కాంగ్రెస్ కు 13,700 ఓట్లు, టీడీపీకి  9900 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ ఇక్కడ వెనకబడి పోగా బీజేపీ, టీఆర్ఎస్ ల మద్య ప్రధాన పోటీ నెలకొంది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం సయ్యద్ ఇబ్రహీం 2317 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. మహబూబ్ నగర్ లో ముస్లింల ప్రాబల్యం అభ్యర్థికి కలిసివచ్చినట్లు గా తెలిసి పోతుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయం అనుకోవచ్చు. టీఆర్ఎస్ అభ్యర్థికి 23 వేల 564 ఓట్లు రాగా, బీజేపీకి 21,560 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ 16 వేల ఓట్లు, టీడీపీకి 11 వేల ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు 11 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. మరో ఏడు రౌండ్ల ఓట్లు లెక్కించాల్సి ఉంది.

15, మార్చి 2012, గురువారం

కృష్ణవేణి...తెలంగాణ విరిబోణి

‘కంఠమే తెగుతున్నా కంట నీరు వద్దని ఓరుగల్లు కోటకే పోరు పాఠం నేర్పినట్టి..కత్తులకు పదును బెట్టి కదనరంగమున దూకిన సమక్క సారలమ్మ రణభూమికి వందనం’

                 సీమాంధ్ర నేతల గుండెలదిరేటట్లు..సమైక్య వాదుల చెంప పగిలేటట్టు..ఇంటి దొంగ వీపు వాచేటట్లు తెలంగాణ ముద్దు బిడ్డ, పాలమూరు ఆడబిడ్డ కృష్ణవేణి ఇచ్చిన షాక్ ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డలకు గొప్ప ఊపిరినిచ్చింది. రెండు కళ్ల చంద్రబాబు పార్టీ తరపున నాగర్ కర్నూలు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న మర్రి జనార్ధన్ రెడ్డికి కృష్ణవేణి ఇచ్చిన షాక్, చెప్పిన మాటలు ఆయన తల ఎక్కడ పెట్టుకోవాలో తెలీకుండా చేసింది.

సీమాంధ్ర డబ్బు సంచులను ఎర వేసి తెలంగాణ ఓట్లు కొల్లగొట్టాలను కున్న మర్రికి తిక్క తిరిగేలా మొహం మీదే సమాధానం చెప్పింది కృష్ణవేణి. నాగర్ కర్నూలు తాలూకా తెలకపల్లికి చెందిన కృష్ణవేణి టీఆర్ఎస్ కార్యకర్త సూర్య వెంకటేష్ గౌడ్ కుమార్తె. గత 11 తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తగా పనిచేస్తున్న వెంకటేష్ నిఖార్సయిన తెలంగాణ వాది. ప్లంబర్ పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో అన్ని కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నాడు. ఈ ఉప ఎన్నికలో తన సహచరులంతా మర్రి డబ్బులకు లొంగినా  తాను మాత్రం తెలంగాణ జెండా విడవలేదు.


                        దీంతో బిడ్డ పెళ్లిని సాకుగా చూపి తెలుగుదేశం పార్టీలోకి రావాలని, డబ్బులిస్తానని మర్రి జనార్ధన్ రెడ్డి ఏకంగా ఇంటికే ఫోన్ చేశాడు. ’’ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా‘‘ వెంకటేష్ కుమార్తె కృష్ణవేణి నీ డబ్బు వద్దు..నీ సోపతి వద్దు. అవసరమయితే పొలం అమ్మి పెళ్లి చేసుకుంటా..లేకపోతే ఇలాగే ఉంటా...నాయినా నీవు పార్టీ మారొద్దని తేల్చి చెప్పింది. దీంతో సీమాంధ్రుల సంక చేరిన మర్రికి తిక్క కుదిరింది. చావులకు, పెళ్లిళ్లకు డబ్బులని, వాటర్ ప్లాంట్లు అని ఓ ట్రస్టు పేరుతో రాజకీయాలకు దిగిన మర్రికి బుర్ర తిరిగేలా చెప్పిన సమాధానం మామూలుది కాదు. అది తెలంగాణ గుండె చప్పుడు. అందుకే కృష్ణవేణిని అభినందిద్దాం...ఆయన తండ్రికి అండగా నిలుద్దాం. కాల్ 9948698519

12, మార్చి 2012, సోమవారం

సీమాంధ్ర డబ్బొద్దన్న తెలంగాణ పులిబిడ్డ

ఈ అమ్మాయిది మా ఊరే, వీళ్ల నాన్న మా మిత్రుడు. 11 ఏళ్లుగా టీఆర్ఎస్ లో పనిచేస్తున్నాడు. నిఖార్సయిన తెలంగాణ వాది. తెలంగాణ, తన పని తప్ప మరో లోకం తెలియదు. అభినందించ దలుచుకున్న వారు krushnaveni తండ్రి వెంకటయ్య గౌడ్ కు కాల్ చేయండి. 9948698519

11, మార్చి 2012, ఆదివారం

చంద్రబాబు శకుని..కిరణ్ శని


‘దమ్ముంటే కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి రాజీనామా చేసి పోటీ చేయాలి’ అన్న టీడీపీ చంద్రబాబు నాయుడు సవాల్ ను టీఆర్ ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ స్వీకరించారు. రాజీనామా చేసి పోటీ చేసేందుకు సిద్దమని, దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేయించి తనతో పోటీకి రావాలని సవాల్ విసిరారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కొల్లాపూర్ లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు.

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు దక్కకుండా చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని ఏ నియోజకవర్గం నుండి అయినా పోటీ చేసి చంద్రబాబు డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ చేశారు.  తెలంగాణ ఇచ్చేది కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అని , తెలంగాణ రాకపోవడానికి నాకు ఏం సంబంధం అంటున్న చంద్ర బాబు, డిసెంబర్ 9 నాడు రాత్రి వచ్చిన తెలంగాణ ప్రకటనను అడ్డుకున్నది నీవు కాదా ? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ భవన్ నుండే దొంగ రాజీనామాలు చేసేలా సీమాంధ్ర ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారని విమర్శించారు. తెలంగాణకు చంద్రబాబునాయుడు శకుని అయితే, ముఖ్యమంత్రి  కిరణ్‌కుమార్‌రెడ్డి శని  అని అన్నారు.