12, ఆగస్టు 2014, మంగళవారం

దుష్ప్రచారాలు నమ్మొద్దు ..సమగ్ర సర్వే సకల జన హితం కోసమే ..


ఎన్యూమరేటర్ మీ ఇంటి కొస్తాడు ..మీ నట్టింటి కొస్తాడు ..మీ బెడ్ రూమ్ కొస్తాడు .మీ వంట రూమ్ కు వస్తాడు ..మీ రేషన్ కార్డు ఆపేస్తారు ..మీ ఫించను లాగేస్తారు.. మీ ఆస్తులు గుంజుకుంటారు అంటూ సీమాంధ్ర మీడియా ..తెలంగాణలో ఉన్న సీమాంధ్ర పార్టీల తొత్తు నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు ఏ మాత్రం నమ్మవద్దు. ఇది తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఓ బృహత్తర కార్యక్రమం.
అక్రమార్కులను దూరం పెట్టి నిజమయిన లబ్దిదారుడు ప్రభుత్వ అండతో పైకి రావాలన్న ఆకాంక్షతో చేస్తున్న నిఖార్సయిన కార్యక్రమం.

అయితే ప్రజల్లో ఈ సర్వే విషయంలో నెలకొన్న సందేహాలు కూడా చాలానే ఉన్నాయి. 60 ఏళ్ల నుండి నెలకు ఓసారి ఇచ్చే రేషన్ కార్డు కోసమో, ఫించను కోసమో ..ఆరోగ్యశ్రీ కార్డు కోసమో ..లీటరు కిరసనాయిలు ..అద్దకిల చక్కెర, పావుకిల పప్పు ..కిల ఉప్పు ..అద్దకిల చింతపండు ..వంటి తాత్కాలిక అవసరాలకు మనల్ని బానిసలను చేసి ..మన కాళ్ల మీద మనం నిలబడే అవకాశం ఇవ్వకుండా ..కేవలం ఓట్లేసే యంత్రాలుగా చేసిన సీమాంధ్ర కుట్రలకు కాలం చెల్లింది.

తెలంగాణ జెండా ఎగిరింది. తెలంగాణ ఉద్యమపార్టీ గద్దెనెక్కింది ఇప్పుడు మన రాష్ట్రం ...మన ప్రభుత్వం. బిడ్డ ఎదిగితే తల్లికి ఎంత సంతోషమో ..ఈ రాష్ట్రంలోని పౌరుడు తన కాళ్ల మీద తాను ఎవరిమీదా ఆధారపడకుండా జీవిస్తే ఈ ప్రభుత్వానికి అంత సంతోషం. ఎదిగిన బిడ్డ ఎంతసేపూ తల్లిదండ్రుల మీద ఆధారపడి బతుకుంటే ఆ తల్లిదండ్రులకు ఎంత మానసిక ఆందోళన ఉంటుందో ..తెలంగాణ ప్రభుత్వానిది కూడా అదే ఆందోళన. అందుకే తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి అసలు ప్రజల వద్ద ఉన్నది ఏంటి ? మనం వారికి ఇవ్వాల్సింది ? ఏం చేస్తే వాళ్లు వారి కాళ్ల మీద నిలబడ గలుగుతారు ?

ఉద్యోగం ? వ్యవసాయం ? పరిశ్రమలు ? సంక్షేమ కార్యక్రమాలు ? ఏవి అందిస్తే వారికి  ఉపయోగకరంగా ఉంటుంది ? అన్నదే తెలంగాణ ప్రభుత్వం తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ ఎవరి భూములు గుంజుకోవడానికో ? మరెవరి ఆస్తులో ఆక్రమించుకోవడానికో తెలంగాణ ప్రభుత్వం ఈ సర్వేను ఉపయోగించుకోవాలనే ఆలోచనలో లేదు. కేవలం తెలంగాణ బిడ్డల అభ్యున్నతి లక్ష్యంగానే ఈ సర్వేను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. నిజంగా అక్రమంగా ఉన్న ఆస్తులు, భూములు లాగాలనుకుంటే హైదరాబాద్ లో అవి చాలా ఉన్నాయి. ఆ దిశగా ప్రభుత్వం ఇప్పటికే ముందడుగు వేసింది. కేవలం తెలంగాణ ప్రభుత్వ వ్యతిరేక మీడియా, సీమాంధ్ర నాయకుల అడుగులకు మడుగులొత్తే కొందరు స్వార్ధ రాజకీయ నాయకులు ప్రజల్లో అనవసర గందరగోళానికి తెరలేపుతున్నారు.

ఈ విషయంలో తెలంగాణ ప్రజలు ఎవరూ ఆపోహా పడాల్సిన పనిలేదు. ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు భేషుగ్గా అక్కడే ఉండొచ్చు. ఇంటి వద్ద ఉన్న మీ వాళ్లతో మీ సమాచారం ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్లకు చెప్పించండి. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది. సొంత ఇల్లు ఉందా ? లేదా ? మీ ఇంట్లో ఉన్న కుటుంబాలు ఎన్ని ? మీ బ్యాంకు ఖాతా వివరాలు ? వంటి ఇంటి స్థితిగతులను తెలియజేసే సమాచారమే తప్ప అంతకుమించింది ఏమీ లేదు. దీనిని బట్టి ప్రభుత్వానికి ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాల మీద, ఇక ఇతర రంగాలలో అందించాల్సిన సేవల మీద పూర్తి అవగాహన వస్తుంది.

అందుకే ఈ నెల 19న ప్రభుత్వం చేపట్టే సర్వేకు ప్రజలు స్వచ్చంధంగా సహకరించండి. మీ సమాచారాన్ని నిర్భయంగా వెల్లడించండి. మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది తప్పితే ..ఎలాంటి హానీ చేయదు. ఇది మన ప్రభుత్వం ..మనందరి ప్రభుత్వం. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. సమగ్ర సర్వే తెలంగాణ పునర్నిర్మాణంలో ఓ మైలురాయిగా నిలిచిపోవాలి. రేపటి బంగారు తెలంగాణకు ఇది నాంది కావాలి.

జై తెలంగాణ

sandeepreddy kothapally 

10, ఆగస్టు 2014, ఆదివారం

రాధాకృష్ణ ..ఉత్త పలుకు ..తొత్తు పలుకు !


చింత చచ్చినా పులుపు చావలేదు. ఎకిలి రాతలతోని తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే కుట్రపూరిత కథనం.
తెలంగాణ ప్రభుత్వం మీద ప్రజలలో అనుమానాలను పెంచే కుతంత్రం. తెలంగాణ ప్రభుత్వ చర్యలు తెలంగాణ ప్రజలకు నష్టం అని చెప్పాలని పించే విద్రోహపూరిత యత్నం. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆదివారం కొత్తపలుకు శీర్షికలో అద్యంతం తెలంగాణ మీద విషంకక్కారు.

కేసీఆర్ మీద వ్యతిరేకతను ప్రదర్శించే ప్రయత్నంలో తెలంగాణ మీద ఉన్న  వ్యతిరేకతను కూడా బయటపెట్టుకున్నాడు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఉన్న స్వామిభక్తిని చాటుకున్నాడు. 'ఉల్టా చోర్ కొత్వాల్ కు డాంటే' అన్నట్లు తెలంగాణ విద్యుత్ కోటాను అడ్డుకుంటూ తెలంగాణలో విద్యుత్ కష్టాలకు కారణం అవుతున్న చంద్రబాబును పొగిడేసి కేసీఆర్ ను దోషిగా నిలబెట్టే సాహసం చేశాడు.

కేసీఆర్ కు వివిధ అంశాల మీద ఉన్న అవగాహన చూసి సమీక్షా సమావేశాలలో ఐఎఎస్ అధికారులు ఆశ్చర్యపోతుంటే వారు ఆయన తీరు మీద గుర్రుగా ఉన్నారని, సమావేశాలలో ఆయన మాట్లాడనివ్వడం లేదని వాపోతున్నారని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఇటీవల కేసీఆర్ ను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కలిశారు. ఆయనతో పాటు ఓ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా ఉన్నారు. ఎంపీ నిధులను విడుదల చేయొద్దని, తెలంగాణ ఎంపీలం అందరం కలిసి ఓ ప్రణాళికి సిద్దం చేసుకుంటామని, ఆ తరువాత దాని ప్రకారం వాటిని వినియోగించుకుంటామని కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారట. ఎందుకు నిధులు ఆపమని లేఖ రాశారు అన్నవిషయం తెలుసుకునేందుకు వెళ్లిన ఎంపీ, కాంగ్రెస్ నేతలు చిన్న అంశం మీద కూడా కేసీఆర్ కు ఉన్న అవగాహన చూసి అచ్చెరువొందారు. కానీ రాధాకృష్ణ లాంటి వ్యక్తులు మాత్రం కేసీఆర్ ను బద్ నాం చేసే ప్రయత్నంలో ఉన్నారు.

కేసీఆర్ ఒకరి వద్దకు నేను వెళ్లడం ఏంటి ? అందరూ నా వద్దకే రావాలి అన్న ధీమాతో ఉన్నారని కేసీఆర్ ఉన్నారని ఆయన నడతను తప్పుపట్టే ప్రయత్నం చేశారు రాధాకృష్ణ. తెలంగాణ ఉద్యమం జరిగినన్ని రోజులు కేసీఆర్ ను తాగుబోతుగా చిత్రించే ప్రయత్నం చేసి తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు. ఫాంహౌజ్ లో వ్యవసాయం చేస్తుంటే తప్పుడు ప్రచారం చేసి సంకలు గుద్దుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆయన వ్యక్తిత్వాన్ని, హుందాతనాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఈ కథనంలో కనిపించింది.

బురదలో పొర్లే పంది తనతోడిదే లోకం అనుకుంటుందట. రాధాకృష్ణ కూడా ఇప్పుడు అదే స్థానంలో ఉన్నట్లు కనిపిస్తోంది. తప్పులను వెనకేసుకు రావడం, దోపిడీ దారులకు కొమ్ముకాయడం, అప్పనంగా భూములు కొట్టేయడానికి మద్దతుగా నిలుస్తూ వచ్చిన వ్యక్తికి ఎదుటి వారి ఒప్పులు కూడా తప్పులుగానే కనిపిస్తాయి. కేసీఆర్ అంటే ..తెలంగాణ అంటే నరనరాన వ్యతిరేక భావన నింపుకున్న రాధాకృష్ణకు తెలంగాణ వారి భక్తిపాటలు కూడా బూతుపురాణం లాగే వినిపిస్తుంది. ఇప్పటికి ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి మాత్రమే తెలంగాణలో ఆగిపోయింది. భవిష్యత్ లో ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా అవశేషంగా మిగిలిపోవడం ఖాయం.

sandeepreddy kothapally

26, జులై 2014, శనివారం

కేసీఆర్ మీద ఏడిస్తే ఏమొస్తుంది ?!!


ఎన్కంగ ఏనుగులు వొయ్యినా పర్వలేదు గాని ముందలంగ ఎల్కలను గుడ పోనిస్తలేరు భజనసేనకు చెందిన
స్వయంప్రకటిత అపర దేశభక్తులు. తెలంగాణలో తెలుగుదేశం - బీజేపీ పొత్తును జనం ఛీకొట్టడంతో మతి చెడ్డ ఈ ఫేస్ బుక్ యోధులు ఇక టీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద, కేసీఆర్ నిర్ణయాల మీద పడి ఏడుస్తున్నారు. తాజాగా కేసీఆర్ సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ ను చేసి రూ.కోటి నగదు పారితోషికం ప్రకటించడంతో ఈ మేధావులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ప్రజల సొమ్మంతా కేసీఆర్ దోచిపెడుతున్నాడు తెగ ఊగి పోతున్నారు.

కూట్లరాయి తియ్యలేనోడు ఏట్ల రాయి తీస్తనన్నట్లు ..సానియా మీర్జాను వివాదాల్లోకి లాగి హీరోలయిపోయినట్లు ఫీలయ్యారు. తీరా జాతీయ బీజేపీ పార్టీ కాస్త సానియాకు మద్దతు పలకడంతో రాష్ట్ర బీజేపీ నాయకులు తమ వ్యాఖ్యలను ఎలా వెనక్కు తీసుకోవాలో తెలియక తికమకపడ్డారు. బీజేపీ నేత లక్ష్మణ్ సానియామీర్జాను తప్పుపడితే ..పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రంగంలోకి దిగి ఆంధ్రా విద్యార్థులకు కేసీఆర్ ఫీజు రీ ఎంబర్ప్ మెంట్ ఇవ్వడానికి 1956 స్థానికతను తెరమీదకు తెచ్చాడని, పిల్లలకు ఫీజులు కట్టడు గాని సానియాకు మాత్రం కోటి ఇచ్చాడని చెప్పడమే తమ పార్టీ ఎమ్మెల్యే లక్ష్మణ్ ఉద్దేశమని సర్ధి చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ విషయంలో బీజేపీ పార్టీకి ఓ స్పష్టత లేదని, ఈ విషయంలో తాము తొందరపడి అనవసరంగా ఎంటరయ్యామని కాస్త లేటుగా తెలుసుకున్నారు.

ప్రజాధనం మీద ఇంత బాధ్యత ఉన్న ఈ భజనపరులు కేంద్రంలో మోడీ ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడానికి మాత్రం ముందుకురారు. కోటిరూపాయలు సానియామీర్జాకు ఇస్తే నెత్తీ నోరు బాదుకున్న వీరు మరి రిలయన్స్ అంబానీలకు లబ్ది చేకూర్చే పనిలో ఉన్న మోడీని ఎందుకు ప్రశ్నించరు అన్నది వారికే తెలియాలి. కేజీ బేసిన్ లో రిలయన్స్ ఉత్పత్తి చేస్తున్న గ్యాస్ ధరను యూనిట్ కు 4.1 డాలర్ల నుండి 8.2 డాలర్లకు పెంచేందుకు కేంద్రం రంగం సిద్దం చేసింది. ఈ నిర్ణయంతో లక్షల కోట్ల ప్రజాధనం రిలయెన్స్ కు దోచిపెట్టే కుట్ర ఉంది. యూపీఏ హయాంలో కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిని తప్పించి మరీ గ్యాస్ ధరను పెంచుకునేందుకు సిద్దమయి విశ్వప్రయత్నాలు చేసి ఆగిపోయింది. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికే మూడింటి ధరలు పెంచి ..ఇక రిలయెన్స్ గ్యాస్ ధర కూడా పెంచి వాళ్ల సేవలో తరించేందుకు సిద్దమవుతోంది.

కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే తన నిర్ణయాలతో ప్రజల మనసులు గెలుచుకున్నాడు. తొమ్మిదేళ్ల అనుభవం అంటూ మీడియా ముందు మీసాలు తిప్పుతున్న చంద్రబాబుకు తన చర్యలతో కేసీఆర్ అనుభవానికి - ఆచరణకు చాలా వ్యత్యాసం ఉంటుందని చాటుతున్నాడు. కేసీఆర్ నిర్ణయాలతో మోడీ భక్తులకు బుగులు రేగుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ను బద్ నాం చేయడానికి దొరికే ప్రతి అవకాశాన్ని వీళ్లు వదులుకోవడానికి సిద్దపడడంలేదు. రైలు ప్రమాదంలో పిల్లలు చనిపోతే వేగంగా స్పందించిన తెలంగాణ సర్కారు క్షతగాత్రులను ఆసుపత్రికి చేర్చి నాణ్యమైన వైద్యం అందేలా చూసింది. స్వయంగా మంత్రి పద్మారావు ఏకంగా సంఘటనా స్థలం నుండి అంబులెన్సులోనే ఆసుపత్రికి వచ్చారు. కేసీఆర్ మంత్రులను అప్రమత్తం చేసి తను యశోద ఆసుపత్రిలో పిల్లల పరిస్థితిని పరిశీలించారు.

కానీ ఈ అపర మేధావులు మాత్రం కేసీఆర్ సంఘటనా స్థలానికి వెళ్లలేదని, ఆయన నియోజకవర్గంలో అంతపెద్ద ప్రమాదం జరిగితే ఇంత నిర్లక్ష్యమా అని ప్రశ్నలు మొదలుపెట్టింది. గాయపడిన విద్యార్థులకు తక్షణ సహాయం అందిందా ? లేదా ? చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఏమయినా నిర్లక్ష్యం చేసిందా ? అన్న ప్రశ్నలు రావాల్సిన సమయంలో కేసీఆర్ రాలేదని ఓ రాయి విసిరి ఆనందపడ్డారు. ఇక వీరికి పచ్చమీడియా జేజేలు పలికి జెండాలు ఊపింది. ఎంతసేపూ కేసీఆర్ ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నాలు తప్పితే ఒక్కటి కూడా తెలంగాణకు పనికివచ్చే సూచన మాత్రం రాదు. అబద్దాలు ఒక్కోసారి ఎక్కువ ప్రచారంలోకి రావచ్చు ..అవి తాత్కాలిక ఆనందాన్ని కలిగించవచ్చు కానీ ..నిజాలు ఎప్పుడూ జనానికి గుర్తుండిపోతాయి. ఇప్పటికయినా ఈ చర్యలు మానుకోకుండా 'గోడమీద రాయి యాడనో నూక్కున్నట్లు' జనమే వీరికి తగిన సమాధానం చెబుతారు.

sandeepreddy kothapally22, జులై 2014, మంగళవారం

టీఆర్ఎస్ ఎంపీ కవిత ఏం చెప్పింది ?


పనికిమాలిన పచ్చపత్రిక (పత్రిక అనడానికి సిగ్గేస్తోంది) 'సీమాంధ్రజ్యోతి' పిచ్చిరాతలు పట్టుకుని మోడీ భజనపరులు తెగ రెచ్చిపోతున్నారు. తమను తాము ఈ దేశాన్ని ఉద్దరించేవారిగా ఫీలవుతున్న కుహానా మేధావులు తెగ ఫీలయిపోతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఈ సీమాంధ్రజ్యోతి చేసిన నిర్వాకం ..తెలంగాణ ఉద్యమకారుల మనోస్థైర్యం దెబ్బతినేలా రాసిన కథనాలు ..దీని నిర్వాకం మూలంగా ఎంతమంది ఉద్యమకారులు నేలకొరిగారో అందరికీ తెలిసిందే. ఇలాంటి పనికిమాలిన మీడియా రాసిన రాతలు అక్షర సత్యాలయినట్లు తెగ తొందరపడిపోతున్నారు.

ఓ పత్రిక నిర్వహించిన చర్చలో పాల్గొన్నఎంపీ కవిత "1947 స్వాతంత్రానికి తెలంగాణ, జమ్మూకాశ్మీర్ లు ప్రత్యేక దేశాలని, ఆ తరువాత సైనిక చర్య ద్వారా ఈ ప్రాంతాలను ఈ దేశంలో కలిపారని" తెలిపింది. దీనికి మసిపూసి మారేడుకాయ చేసి ..స్వంతకవిత్వం జోడించి వండి వార్చి ఏదో కలకలం రేపుతాం అన్నంత రీతిలో సీమాంధ్రజ్యోతి లేఖిరాతలతో కథనం ప్రచురించింది. అది పట్టుకుని కుహానా దేశభక్తులు తెగ ఊగిపోతున్నారు.

1947 ఆగస్టు 15న తెలంగాణకు స్వాతంత్రం రాలేదు. ఆ తరువాత సైనిక చర్య ద్వారా తెలంగాణకు విముక్తి లభించింది అన్నది తెలంగాణ ఉద్యమంలో వందలసార్లు చెప్పుకున్నదే. తెలంగాణ వాదులు అందరికీ తెలిసిందే. సెప్టెంబరు 17 విమోచన దినం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఉన్నది ఉన్నట్లు చర్చలో వెల్లడిస్తే ఏదో జరిగిపోయిందని తెగ బాధపడిపోతున్నారు.

వీరి రాతలు ..పూతల్లో ఎంపీ కవిత మాట్లాడిన అంశాల మీద చర్చ చేయాలన్న తపనకంటే ..తెలంగాణ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ అధినేత కూతురిని దోషిగా నిలబెట్టడానికి అవకాశం దొరికింది అన్న ఆనందమే ఎక్కువ కనబడుతోంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి కుహానా దేశభక్తులారా ..తెలంగాణ వాదులను మించిన దేశభక్తుడు ఎవ్వడూ లేడు. అందుకే 60 ఏళ్లు ప్రజాస్వామ్యబద్దంగా పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. మేం ఎన్నుకున్న మా నాయకులే మమ్మల్ని వెన్నుపోటు పొడిచినా బరించి పోరాడాం. వగల ఏడ్పులు మాని బురద జల్లడం మానుకోండి.

sandeepreddy kothapally

www.facebook.com/thovva 

13, జులై 2014, ఆదివారం

కేసీఆర్ కు ప్రజలే ప్రతిపక్షం !

తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారపగ్గాలు చేపట్టడంతో కోస్తాంధ్ర పెట్టుబడిదారి వర్గాల కళ్లు మండుతున్నాయి. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ నలుమూలలకు తీసుకెళ్లి ..సబ్బండ వర్గాలను తెలంగాణ ఉద్యమంలోకి నడిపించి ..తెలంగాణ ఎందుకు కావాలి ? ఎందుకు రావాలి ? అన్నది సూక్ష్మంగా అందరికి వివరించి తెలంగాణ సాధించిన కేసీఆర్ తెలంగాణలో అధికారంలోకి వస్తాడని చంద్రబాబు అనుకూల ..చంద్రబాబు కొమ్ముకాసే సీమాంధ్ర మీడియా మాఫీయా ఏ మాత్రం అంచనా వేయలేదు. కలలో కూడా వారు ఈ విషయాన్ని ఊహించలేదు.

ఎందుకంటే గత 14 ఏళ్లుగా కేసీఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి, తెలంగాణ ఉద్యమాన్ని తెరమరుగు చేయడానికి, తెలంగాణ రాష్ట్ర సమితిని అతలా కుతలం చేయడానికి వారు చేయని ప్రయత్నం లేదు. ఇంకా ముఖ్యంగా కేసీఆర్ 11 రోజుల నిరహార దీక్ష 2009 డిసెంబరు 9న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా యూపీఏ ప్రభుత్వం చేసిన ప్రకటన తరువాత ఈ వర్గంలోని అహంభావం, వికృత స్వభావం, తెలంగాణ వ్యతిరేక భావన జడలు విప్పింది. తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమ నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు, తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు వీరు చేయని ప్రయత్నం ..మొక్కని దేవుడు ..ఎక్కని గడప లేదని చెప్పాలి. 

ఈ కుట్రలను ..ఈ కుతంత్రాలను చేధించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించి పెట్టాడు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చి చూయించాడు. ఇంత చేసిన కేసీఆర్ ను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మరుక్షణమే తెరమరుగు చేసేందుకు ప్రయత్నించారు. తెలంగాణ వచ్చింది ..ఇక కేసీఆర్ తో పని ఏముంది అని ప్రజల్లోకి
విస్తృతంగా తీసుకెళ్లే విఫలయత్నం చేశారు. కాంగ్రెస్ లేదా టీడీపీ - బీజేపీ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే తమ అక్రమవ్యాపారాలకు ..తమ అక్రమ నిర్మాణాలకు సంపూర్ణ భద్రత ఉంటుందని ఈ సాహసానికి ఒడిగట్టారు.

కానీ కేవలం తెలంగాణ ప్రజల మీద నమ్మకం ..తెలంగాణ ప్రజల మీద ఉన్న విశ్వాసంతో కేసీఆర్ ఎన్నికల గోదాలోకి ఒంటరిగా అడుగుపెట్టారు. రోజుకు 10 సభల చొప్పున 100కు పైగా సభల్లో పాల్గొని టీఆర్ఎస్ ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించి ..ఒప్పించి అధికారం చేజిక్కించుకున్నారు. అధికారం వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ మీద బురదజల్లే ప్రయత్నాలు పెట్టింది సీమాంధ్ర మీడియా మాఫియా. జర్నలిజం విలువలను నడిబజార్లో వదిలేసి నగ్నంగా తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది. తెలంగాణ ప్రభుత్వాన్ని చిన్నతనం చేసేందుకు ప్రయత్నించి తన కురచబుద్దిని చాటుకుంది. కేసీఆర్ వ్యతిరేక వర్గాలను ప్రభుత్వం మీదకు ఉసిగొలిపే ప్రయత్నం చేసింది. కానీ ఈ మీడియా మాఫియాకు కేసీఆర్ పెట్టాల్సిన మందే పెట్టారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ తన దారిన తాను సాగిపోతున్నాడు.

కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ...మహమూద్ అలీ, రాజయ్య, ఈటెల రాజేందర్, హరీష్ రావు, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు గౌడ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి జోగు రామన్న తదితరులతో పాటు, ఎంపీలు వినోద్ కుమార్, కవిత, కడియం శ్రీహరి, బూర నర్సయ్యగౌడ్, బాల్క సుమన్, ఎపి జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఇక ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గువ్వల బాల్ రాజు, లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, బొడిగె శోభ, యాదగిరి రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి, జూపల్లి కృష్ణారావు, శ్రీనివాస్ గౌడ్, అంజయ్యయాదవ్, గొంగిడి సునీత, దాస్యం వినయ్ భాస్కర్, స్పీకర్ మధుసూదనా చారి ఇలా కొందరు మినహా అందరూ తెలంగాణ ఉద్యమంలో మమేకమయిన వారే. తెలంగాణ ఉద్యమంలో ఆటు పోట్లు ఎదుర్కొన్నవారే. ప్రభుత్వ అణచివేతను ..పెట్టుబడి దారి వర్గాల హేళనలను తట్టుకుని ఉద్యమంలో నిలబడ్డవారే. తమ ఆస్తులను తెలంగాణ ఉద్యమం కోసం ధారపోసిన వారే.

వీరందరికీ తమ తమ జిల్లాలోని, నియోజకవర్గంలోని ప్రజలతో విస్తృతస్థాయి సంబంధాలు ఉన్నాయి. ఉద్యమంలో ప్రజలతో మమేకమయి గడిపిన నేపథ్యం వీరికి ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలోని తప్పు ఒప్పులను నేరుగా వీరికి చెప్పే సానిహిత్యం తెలంగాణ ఉద్యమకారులకు ఉంది. ఇంతటి సానుకూల అంశం ఇప్పటివరకు దేశంలో ఏర్పడిన ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండకపోవచ్చు అన్నా ఆశ్చర్యం లేదు. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని విశ్లేషణాత్మకంగా ప్రజలు ఈ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోగలుగుతారు. తెలంగాణలోని టీఆర్ఎస్ వ్యతిరేక రాజకీయ పార్టీల కంటే బలంగా ఈ ప్రజలే వారికి ప్రభుత్వ లోపాలను ..అనుకూలతలను చెప్పగలిగే అవకాశం స్పష్టంగా ఉంది. ఇక గత 14 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమంలో ఉత్తాన పత్తానాలు చూసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ అవసరాలు ..తెలంగాణ ప్రజల ఆకాంక్షల మీద స్పష్టమయిన అవగాహన ఉంది. ఈ నెల రోజుల పాలనలో ఆయన విజన్ ఏమిటి ? అన్నది కూడా అందరికీ తెలిసిపోయింది.  అందుకే తెలంగాణలోని తొలి ప్రభుత్వానికి ప్రజలే ప్రతిపక్షం. ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలే అండా దండా.

Sandeep Reddy Kothapally 

please like & share this page

www.facebook.com/thovva 3, జులై 2014, గురువారం

అమ్మ కరుణించింది ..అన్న కల నెరవేరింది


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నేళ్ల ఉద్యమం ? ఎంతమంది బలిదానాలు ? ఎన్ని కోట్ల మంది ఎదురుచూపులు ? ఎంతమంది ముడుపులు కట్టారు ? ఎంత మంది దేవుళ్లను వేడుకున్నారు. 14 ఏళ్ల క్రితం తెలంగాణ రథసారధి కేసీఆర్ స్వయంగా మోతె గ్రామంలో తెలంగాణ రాష్ట్రం కోసం ముడుపుకట్టారు. మరో గ్రామంలో అఖండజ్యోతిని వెలిగించారు. తెలంగాణ వచ్చేదాకా అరగుండు ..అరమీసంతో ఓ ఉద్యమకారుడు. ఇలా ఎవరికి తోచినట్లు వారు కనిపించిన చెట్టుకు పుట్టకు ..నమ్మిన దైవాలకు మొక్కులు మొక్కుకున్నారు.

ఆ కోవలోనే మన తెలంగాణ ఎక్సయిజ్ శాఖా మంత్రి పద్మారావు గౌడ్ కూడా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మొక్కుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా గుడిలో అడుగుపెట్టనని ప్రతినబూనారు. ఆరేళ్లుగా అమ్మవారి బోనాలకు వెళ్లడం లేదు. ఈ సారి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడంతో పాటు ..తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం రావడం ..మంత్రికావడం జరిగిపోయింది. అందుకే ఎప్పుడు అమ్మవారి బోనాలు వస్తాయా ? తన నాయకుడు కేసీఆర్ తో కలిసి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుందామా ? అని ఎదురు చూస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి తరపున 2004లోనే ఎమ్మెల్యేగా ఎన్నికయిన పద్మారావు కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే పదవికి 2008 లో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు ..ఆ తరువాత 2009 ఎన్నికల్లో ఓడిపోయినా టీఆర్ఎస్ పార్టీని వీడకుండా ..తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడారు. హైదరాబాద్ నగరంలో తెలంగాణ ఉద్యమవ్యాప్తికి టీఆర్ఎస్ నగర్ అధ్యక్షుడిగా  ఎనలేని కృషిచేశారు. ఈ సారి ఎన్నికల్లో గెలిచి సగర్వంగా రాష్ట్ర మంత్రి పదవి చేపట్టారు. తెలంగాణ ఉద్యమంలో నిఖార్సుగా ..నిజాయితీగా పనిచేసిన వారిలో ఒకరు పద్మారావు గౌడ్. అమ్మవారి బోనాలకు కేసీఆర్ తో కలిసి వస్తున్న ఆయనకు ఇవే ఉద్యమాభివందనాలు

sandeepreddy kothapally

18, జూన్ 2014, బుధవారం

రిపోర్టర్ల పొట్టగొట్టి ..ఖజానా నింపుతున్న రాధాకృష్ణ !


రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అని ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చెబుతున్న గురివింద నీతులు చూస్తుంటే
ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఆరునెలలుగా ఆంధ్రజ్యోతి ఆర్సీ ఇంఛార్జులకు జీతాలే గతిలేవు. ఆంధ్రజ్యోతి కంట్రిబ్యూటర్లు లైన్ అకౌంట్ మరిచిపోయి చాలా రోజులయింది. తన అడుగులకు మడుగులొత్తే వారిని బ్రాంచ్ మేనేజర్లుగా పెట్టుకుని రిపోర్టర్ల పొట్టగొట్టి వారి కుటుంబాలను పస్తులుంచుతున్న రాధాకృష్ణ ప్రజాస్వామ్యం ..దాని విలువల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది.

ఆంధ్రజ్యోతిలో దసరాకు యాడ్లు ..దీపావళికి యాడ్లు ..కొత్త సంవత్సరానికి యాడ్లు ..సంక్రాంతికి యాడ్లు ..దీనికి తోడు ప్రతి ఏటా సీమాంధ్ర జ్యోతి వార్షికోత్సవానికి యాడ్లు. రిపోర్టర్లకు టార్గెట్లు నిర్ణయించి ..వారు తీసుకురాకుంటే డేట్ లైన్ ఉండదని హెచ్చరించి ..నలుగురిని బతిమిలాడి యాడ్లను పట్టుకొచ్చిన తరువాత ఆ యాడ్ల డబ్బులు రాలేదని డేట్ లైన్లు నిలిపివేసి రిపోర్టరు జీవితంతో బంతాట ఆడుతున్న రాధాకృష్ణ ఆండ్ కో పత్రికా స్వేచ్చ గురించి ..పత్రికా స్వేచ్చ మీద దాడి గురించి మాట్లాడుతుండడం నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లు ఉంది.

అసలు తన దగ్గర పనిచేసే కంట్రిబ్యూటర్లకు ఎలాంటి స్వేచ్చ ఇవ్వకుండా వారిని నిత్యం వేధింపుల గురించి మాట్లాడుతున్న రాధాకృష్ణకు తన వరకు వచ్చే సరికి ప్రజాస్వామ్యం గుర్తుకు వస్తుంది. ఇటీవల ఎన్నికల్లో అసలు కంట్రిబ్యూటర్లతో సంబంధం లేకుండా బీఎంలతో డబ్బులు దండుకుని ..రిపోర్టర్ల యాడ్స్ కమీషన్ కూడా అందకుండా దండుకు తిన్నారు. ఇలాంటి పత్రికా యాజమాన్యాలు జర్నలిజం విలువల గురించి మాట్లాడుతున్నాయి.

ఈనాడు, సాక్షి ఆఖరుకు ప్రజాశక్తి, ఆంధ్రభూమి దినపత్రికలు కూడా తమ కంట్రిబ్యూటర్లకు తృణమో ..పణమో నెలకింత ముట్టజెబుతున్నాయి. కానీ జిల్లాకు ఇంత టార్గెట్ పెట్టి ముక్కుపిండి వసూలు చేసుకుని తన ఖజానాలో జమ చేసుకుంటున్న రాధాకృష్ణ మాత్రం తన కంట్రిబ్యూటర్లకు ఒక్క పైసా విదిల్చింది లేదు. ఇప్పటికయినా కంట్రిబ్యూటర్ల కడుపు కొట్టకుండా ..ఆర్సీ ఇంఛార్జిల బకాయిలు చెల్లించి మాట్లాడితే కొంత సమంజసంగా ఉంటుంది.

కొత్తపల్లి సందీప్ రెడ్డి

16, జూన్ 2014, సోమవారం

రాధాకృష్ణ ..కళ్లున్న కబోధి ..!!


మొత్తానికి కేసీఆర్ దుష్టతలంపు వచ్చిందే తడవు ఆంధ్రజ్యోతి మీద పడ్డాడు. మేం దేనికీ భయపడం. తప్పుంటే
చర్యలు తీసుకోండి. కేసీఆర్ స్వయంగా ఎంఎస్ఓలకు ఫోన్ చేసి బెదిరించాడు. అయితే తెలంగాణ టీఆర్ఎస్ మోనార్క్ ఏమీ కాదు. ఆ పార్టీకి వచ్చింది 38.5 శాతం ఓట్లే. మిగతా ప్రజల మనోభావాలకు అద్దంపట్టాల్సిన భాధ్యత మీడియాకు లేదా ? నిజామాబాద్ లో పుట్టిన నేను ఆంధ్రోడిని ఎలా అవుతాను. కానీ నన్ను ఆంధ్రోడిని చేయడంలో కేసీఆర్ విజయవంతం అయ్యాడు.

ఆంధ్రజ్యోతి ప్రసారాలను తెలంగాణ ఎంఎస్ఓలు బంద్ చేయడంతో ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ ఈ రోజు తన పత్రికలో రాసుకున్న పలుకులివి. పత్రిక నీది కాబట్టి పలుకులు ఎన్నయినా రాసుకోవచ్చు. నీవు చెప్పిందే నిజమని నీకు నువ్వే భావించుకోవచ్చు. కానీ తెలంగాణ సమాజం నీ కారుకూతలను ..పిచ్చిరాతలను చూసి భ్రమపడిపోదు. తెలంగాణలో 1200 మంది బిడ్డలు బలిదానాలు చేసుకుంటే వారికి అండగా నిలవలేని నీ పాపిష్టి మీడియా ..తెలంగాణ సమాజాన్ని అనుక్షణం గందరగోళంలోకి నెట్టి ..వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి ఆత్మహత్యల పాపాన్ని మూటగట్టుకున్న నీ సీమాంధ్రజ్యోతి ..తెలంగాణ విడిపోగానే సీమాంధ్ర రాజధానికి విరాళాలు సేకరిస్తుందంటే నీవు ముమ్మాటికీ ఆంధ్రోడివే అని చెప్పడానికి నీ మీద ఇంకొకరు బురద జల్లాలా ?

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడాన్ని జీర్ణించుకోలేని నీవు ప్రభుత్వం కొలువుదీరి పది దినాలు గడవక ముందే విషం కక్కుతూ నీ ఆలోచనలను ..అర్ధ సత్యాలను తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలుగా ప్రచురించి తెలంగాణ ప్రజల్లో కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం మీద అపనమ్మకం కలిగించే ప్రయత్నాలు చేయడం నిజం కాదా ? సీమాంధ్ర ప్రజలకు తెలంగాణ ప్రజల మీద విద్వేషం కలిగించేలా ''ఏపీనా వేసెయ్ పన్ను'' అని వార్తలు రాయడం నీ దుర్మార్గపు ఆలోచనలకు ప్రతీకనా ? కాదా ?

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం మోనార్క్ ఏమీ కాదు దానికి వచ్చింది 38.5 శాతం ఓట్లే అని అంటున్న నీకు సీమాంధ్రలో చంద్రబాబుకు వచ్చిన ఓట్ల శాతం ఎంతో తెలీదా ? మరి చంద్రబాబును ప్రశ్నిస్తూ నీవు రాసిన వార్తలెన్ని ? తెలంగాణ ప్రభుత్వం మీద విషం చిమ్ముతూ రాసిన వార్తలు ఎన్ని ? ఈ కొద్ది రోజుల వార్తలు లెక్క తీస్తె నీవు ఆంధ్రోడివా ? తెలంగాణోడివా ? అన్నది తేలిపోతుంది. పత్రిక చేతిలో ఉంది కాబట్టి అప్రజాస్వామిక వార్తలు రాసి ..నీకు పడని ప్రభుత్వం మీద విషం చిమ్మి ..నీవు రాదనుకున్న తెలంగాణ సమాజాన్ని ఆందోళనకు గురి చేసి ఆనందపడదాం అనుకుంటున్న నీ తిర్రి ఆలోచనలను చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటున్నది.

నీవు చంద్రబాబుతో కలిసి ఎన్ని నాటకాలయినా ఆడుకో ..నీ ఆంధ్రప్రదేశ్ మీద ఎంత ప్రేమయినా కురిపించుకో..కానీ తెలంగాణ మీద విషం చిమ్మడం మానుకో. వైఎస్ మూయించిన నీ పవర్ ప్లాంట్ ను కిరణ్ కుమార్ రెడ్డికి వార్తలు రాసి రాసి తెరిపించుకున్న నీవు ప్రజాస్వామ్యం గురించి ..అవినీతి గురించి అప్రజాస్వామిక ఆలోచనల గురించి మాట్లాడడం హస్యాస్పదం. తెలంగాణ సమాజం ఇప్పటికీ ..ఎప్పటికీ చైతన్యవంతమయినదే ..ఇక మలిదశ తెలంగాణ ఉద్యమం మాకు మీలాంటి ముసుగు మీడియా సంస్థలను ఎలా ఎదుర్కోవాలో గుణపాఠాలు నేర్పింది. ఇప్పటికయినా మీ ఆలోచనలు మానుకుని తెలంగాణ ఎదుగుదలకు సహకరించండి. తెలంగాణకు చేసిన పాపాన్ని కొంతయినా కడుక్కోండి.


కొత్తపల్లి సందీప్ రెడ్డి

15, జూన్ 2014, ఆదివారం

మీడియా – తెలంగాణ


వాళ్లకు మన ఉనికి నచ్చదు. వాళ్లకు మన ఉన్నతి నచ్చదు. అరవైఏళ్లుగా జీర్ణించుకుపోయిన ఆంధ్రా ఆధిపత్య అహంకార ధోరణి వారిని ఊరికె ఉండనివ్వదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది అన్న ఆలోచనే వారికి ఇంకా తట్టలేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామికంగా పోరాడి తెలంగాణ ప్రజలు లక్ష్యాన్ని చేరుకోవడాన్ని వారు ఏ మాత్రం జీర్ణించుకోలేరు. అసలు సీమాంధ్ర నేతలకన్నా ఈ మీడియా మొగల్స్ తోనే తెలంగాణ ముందు ముందు పెను ప్రమాదం ముంచుకువస్తోంది. ఇది మొగ్గలోనే తుంచేయకపోతే తెలంగాణకు భవిష్యత్ లో తీరని అన్యాయం జరుగడం ఖాయం.

తెలంగాణ శాసనసభ్యులను హేళన చేస్తూ టీవీ 9, సీమాంధ్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ తెలంగాణ ప్రభుత్వం మీద విషం చిమ్ముతూ ఆంధ్రజ్యోతి దినపత్రిక చేసిన ప్రసారాలు, రాసిన వార్తలు వారిలోని తెలంగాణ వ్యతిరేకతను నగ్నంగా బయటపెట్టుకున్నాయి. స్వయంగా కేసీఆర్ స్పందించడం ..తెలంగాణ శాసనసభ ఆగ్రహం వ్యక్తం చేయడంతో మొక్కుబడి క్షమాపణలు వచ్చినా అవి భవిష్యత్ లో తమ తీరు మార్చుకుంటాయని భావించడం అత్యాశనే అవుతుంది.

అసలు ఈ సీమాంధ్ర మీడియా మూలలను దెబ్బతీస్తేనే తెలంగాణకు భవిష్యత్ ఉంటుంది. సీమాంధ్ర పెట్టుబడిదారుల కొమ్ముకాసే ఈ సీమాంధ్ర మీడియా అవకాశం దొరికితే తెలంగాణ ప్రభుత్వాలను అస్థిర పరిచేందుకు కాచుక్కూర్చుంటాయి. తెలంగాణ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టడం ద్వారా తెలంగాణ ప్రజల్లో అభద్రతా భావాన్ని పెంచి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేయడం వీటి ప్రధాన

లక్ష్యం. భవిష్యత్ లో ఏ రోజు అవకాశం వచ్చినా ఇవి దాన్ని చేజార్చుకోవు.

అసలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడం ..కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ..ఆయన మంత్రివర్గంలో ఎలాంటి లుకలుకలు లేకపోవడం ..తొలి శాసనసభ సమావేశాలు అత్యంత హుందాగా సాగడం ..కేసీఆర్ తన భవిష్యత్ ప్రణాళిక స్పష్టంగా సభ ముందు ఉంచడం ..దానికి ప్రతిపక్షాలు కూడా ప్రశంసలు తెలపడం ఈ మీడియాకు ఏ మాత్రం మింగుడు పడడం లేదు. మీడియా మొగల్స్ పంచవర్ష ప్రణాళికలు అమలు పరిచే సీమాంధ్ర నేతలతో కేసీఆర్ ను పోల్చి చూసుకుని ఈ వర్గాలు కుమిలిపోతున్నాయని చెప్పక తప్పదు. కేసీఆర్ కు తెలంగాణలోని 119 నియోజక వర్గాల మీద పట్టుంది. ఏ నియోజకవర్గానికి ఏ సమస్య ఉంది అన్నది ఆయన దృష్టిలో ఉంది. గత 14 ఏళ్లుగా తెలంగాణ అణువణువూ కేసీఆర్ తిరిగి చూసిందే. అందుకే శాసనసభలో ఏకంగా 2 గంటల 40 నిమిషాలు ఎలాంటి తడబాటు లేకుండా సాగిన తన ప్రసంగంలో నీళ్లు, విద్యుత్, వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్యం వంటి అంశాల మీద స్పష్టమయిన వైఖరిని బయటపెట్టారు. ఈ పరిణామాలు ఏవీ సీమాంధ్ర మీడియాకు రుచించడం లేదు.

ఎంతసేపూ తెలంగాణ నేతలను బలహీన పరచడం ..తెలంగాణ ప్రజల దృష్టిలో వారి మీద అనుమానాలు రేకెత్తించడం ..అసలు వీళ్లు ఏమీ అభివృద్ది చేయలేరని, వీరికి అసలు పరిపాలన రాదని, పరిపాలనకు వీరు పనికేరారని చెప్పడం వారి ప్రధాన ఉద్దేశం. వాస్తవంగా తెలంగాణ జిల్లాలలో సీమాంధ్ర మీడియాను జనం విశ్వసించడం మానేసి చాలా కాలమయింది. కాకపోతే ఇన్నాళ్లు అలవాటు పడిన పత్రికలను, ఛానళ్లను ఒకేసారి మానుకోవడం ..దానికి తగినంత ప్రత్యామ్నాయాలు లేకపోవడం మూలంగా ఆంధ్రా మీడియాకు అవకాశంగా మారింది. అయితే తెలంగాణ ప్రభుత్వం సీమాంధ్ర మీడియాను తలదన్నే ఛానళ్లు, పత్రికలు తెలంగాణ ఔత్సాహికులు ఏర్పాటు చేసేలా తగినంత ప్రోత్సాహం ఇవ్వాలి. తెలంగాణలో ఓ ప్రత్యేకమయిన ప్రణాళికతో ఇది జరగాలి. ఇది ఎంత త్వరగా జరిగితే తెలంగాణ సమాజానికి ..తెలంగాణ ప్రభుత్వానికి ..తెలంగాణ భవిష్యత్ కు అంత లాభదాయకంగా ఉంటుంది.

- సందీప్ రెడ్డి కొత్తపల్లి
http://www.telanganatalkies.com/మీడియా-తెలంగాణ/

14, జూన్ 2014, శనివారం

పచ్చకండ్లు ..పచ్చనోట్లు..పాపిష్టి మీడియా !!


పొద్దున లేస్తె వాడు ఫోర్త్ ఎస్టేట్ గురించి ఫోజులు గొడుతుంటడు. జర్నలిజం విలువల గురించి జనుకులు
విసురుతుంటడు. వాని మైకు నిండా మైకమే గనిపిస్తది. అధికారుల అవినీతి గురించి వాడు అంతెత్తున ఎగిరినట్లు గనిపిస్తడు. మీడియా స్వేచ్చ గురించి వాడు నిప్పులు గురిపిస్తుంటడు. కానీ వానిదంతా ఆధిపత్యపు అహంకార ధోరణే. వాని నిలువెల్ల విషమే. వాని దృష్టిలో మీడియా స్వేచ్చ అంటే వాని ప్రయోజనాలు ..వాని సామాజికవర్గ ప్రయోజనాలు. వాడు నందిని పట్టుకొని పంది అంటడు ..పందిని పట్టుకొని నంది అంటడు. అదే జర్నలిజం విలువ వాని దృష్టిల.

ర్యాగింగ్ జరిగి ఆ పిల్లల తల్లిదండ్రులు నెత్తీ నోరు బాదుకుంటుంటే అవే దృశ్యాలను పదే పదే తన టీవీలో ప్రదర్శించి ఆ కుటుంబానికి తీరని వేదన మిగిలిస్తాడు. ఫ్యాక్షనిస్టుల ఆస్తులు జాతీయం చేయాలని ప్రచారం చేస్తాడు. తనకు అన్ని కోట్లు ఎలా వచ్చాయో మాత్రం చెప్పడు. పచ్చళ్లు అమ్ముకునెటాయిన ప్రపంచాన్ని ఆకర్షించే స్థాయికి వెళ్తాడు.ఆయన కష్టపడి వెళ్లినట్లు. మిగతావాళ్లు ఆయన కనుసన్నలలో పనిచేయాలంటాడు. అసలు జర్నలిజాన్ని ఓ పరిశ్రమలా చేసింది ఈ దుర్మార్గులె. నలుగురికి ఉపయోగపడాల్సిన మీడియాను అంగట్లో సరుకులా మార్చింది ఈ ఆంధ్రా వలస దోపిడీ దారులె. తెలంగాణ సంపదను తేరగా దోచుకుని అది బయట పడకుండా ఉండేందుకు తమ మైకులను అడ్డుగా పెట్టుకున్నారు.

ప్రశ్నించలేని వ్యక్తులను పంచన జేర్చుకుని ..నిలదీయలేని నేతలను తమ గుమ్మాలకు కాపలాగా చేసుకుని మీడియా మొఘల్లుగా చెలామణి అవుతున్నారంటే జర్నలిజం విలువలు ఏ స్థాయికి దిగజారి పోయాయో అర్ధం చేసుకోవచ్చు. సీమాంధ్ర పెట్టుబడిదారులను తమ చుట్టూ చేర్చుకుని ..వారి అండతో తెలంగాణ నేతలను ఇన్నాళ్లు వాడుకున్నారు. ఇప్పటికి తెలంగాణ వచ్చినా ఆంధ్రా పార్టీలకు వంతపాడుతున్నారంటే ఇప్పటిదాకా తయారయిన ఇలాంటి వంధిమాగదులే కారణం. దేశంలోనే ఎక్కడా లేనన్ని పత్రికలు ..ఛానళ్లు రాష్ట్రంలో ఉన్నాయి. నిజంగా మీడియా ఇంత పటిష్టంగా ఉంటే ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలి. రాజకీయ నాయకులు ప్రజల ఆకాంక్షలే ధ్యేయంగా పనిచేయాలి. కానీ ఈ మీడియా వెనుక ఉన్నదే పెత్తందారి వ్యవస్థ. ఇక్కడ వారి ప్రయోజనాలను ప్రజల ప్రయోజనాలను చేసి పరిశ్రమలు, భూములు కొల్లగొట్టారు. ప్రతి వ్యవస్థలోనూ వీరు వేళ్లూనుకున్నారు. వీరిది మీడియా అంటే ..జర్నలిస్టులు సిగ్గుతో తలవంచుకోవాలి. ప్రజల ప్రయోజనాలే జర్నలిస్టు ప్రయోజనాలు తప్పితే ..పెత్తందారి ప్రయోజనాలు ..అవసరాలు ఎన్నటికీ ప్రయోజనాలు కావు. మీడియా స్వేచ్చ కాదు ..కా జాలదు. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి మీడియా వ్యవస్థని బొందపెట్టాలి. ఫోర్త్ ఎస్టేట్ మీద ప్రజల నమ్మకాన్ని పెంచాలి.

జై తెలంగాణ

కొత్తపల్లి సందీప్ రెడ్డి 

కేసీఆర్ ..వ్యక్తి కాదు ..వ్యవస్థ

ఏ రాజకీయ నాయకుడు అయినా చేసేది ఒక్కటే పని. అధికారం చేతికి వస్తే ..మనకేం గిట్టుబాటవుతుంది ..మన
చుట్టుపక్కల వారికి ఏం గిట్టుబాటవు తుంది. ఈ అయిదేళ్లలో ఎంత మాత్రం వెనకేసుకోగలం. ప్రతిపక్షాలను ఎలా ఇరుకున పెట్టగలం. ప్రజల దృష్టిని ఎలా పక్కకు మళ్లించగలం. మన తప్పిదాలను ప్రజలు గుర్తించకుండా ఏం చేయగలం ? ఇలాంటి ఆలోచనలు తప్పితే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమయిన విషయాల మీద కూడా కనీసం స్పష్టమయిన అవగాహన ఉండదు. ఏ విషయం తెలుసుకోవాలన్న కిందిస్థాయి అధికారులు సమాచారం ఇవ్వాల్సిందే. వారు చెప్పిన వివరాలనే చెప్పడం తప్పితే సొంతంగా ఓ అంశం మీద ఎలాంటి అవగాహన ఉండదు. కానీ తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాలు చూసిన రాజకీయ నేతలంతా కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలి. ఆయనను పాఠంగా భావించి చదువుకోవాలి.

కృష్ణ, గోదావరి నదులకు సంబంధించిన వాటా గురించి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా నేనే వాదిస్తాను అని నిండు శాసనసభ సాక్షిగా కేసీఆర్ ప్రకటించడం చూస్తే ఖచ్చితంగా ఇంతవరకూ ఏ నాయకుడూ ఇంత ధైర్యంగా  ప్రకటించిన దాఖలాలు లేవనే చెప్పాలి. కేసీఆర్ కు నదీ జలాల కేటాయింపుల విషయంలో ఎంత అవగాహన లేకుంటే స్వయంగా తానే వాదిస్తానన్న ప్రకటన చేసి ఉంటారు. జల నిపుణులు, తలపండిన ఇంజనీర్లు చేయాల్సిన పనిని తాను చేస్తానని కేసీఆర్ తేల్చేశాడు. కేసీఆర్ ఏం వాదిస్తాడు అని కనీసం ప్రతిపక్షాలు అభ్యంతరం కూడా చెప్పలేకపోయాయి అంటే కేసీఆర్ వారిని ఎంతలా ఒప్పించగలిగారో ..మెప్పించగలిగారో అర్ధం చేసుకోవాలి.

తెలంగాణకు సంబంధించి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో జరుగుతున్న వాద ..ప్రతివాదాలపై కేసీఆర్ కు స్పష్టమయిన అవగాహన ఉంది. కిందిస్థాయిలో జరుగుతున్న ప్రతి విషయం కేసీఆర్ కు తెలుసు.  ఆయనకు ఈ విషయంలో ప్రత్యేకంగా జిల్లాల వారి క్షేత్ర వివరాలు ప్రత్యేకంగా వేగులు ఉంటారని ..వారు ఎవరితోనూ సంబంధం లేకుండా నేరుగా కేసీఆర్ తో టచ్ లో ఉంటారని అంటుంటారు. కానీ ఎంత మంది ఆంధ్రానాయకులకు ఈ విధంగా అవగాహన ఉంది. కేసీఆర్ లా ఎంతమందికి క్షేత్రస్థాయి వివరాలు తెలుసుకుంటుంటారు అంటే అది అనుమానమే.

శాసనసభను ఉద్దేశించి ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్ దాదాపు రెండుగంటలు మాట్లాడితే విద్యుత్, విద్య, వైద్యం, తెలంగాణ ఉద్యమం, అమరులు, వారి కుటుంబాలు, తెలంగాణకు సహకరించిన రాజకీయ పార్టీలు, తెలంగాణ జిల్లాలలో పేదలు, బలహీనవర్గాలు, ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలు ..వాటిని అమలు చేయబోయే విధానం, తమిళనాడు తరహా రిజర్వేషన్, తమిళనాడులో అసలు అలా రిజర్వేషన్లు ఎందుకు డిమాండ్ లోకి వచ్చాయి. వాటిని వారు ఎలా అమలు చేస్తున్నారు. ఆ తరహా రిజర్వేషన్లు తెలంగాణకు ఎందుకు అవసరం. రుణమాఫీ అమలు ఎలా ..తెలంగాణకు భవిష్యత్ లో విద్యుత్ అవసరాలను ఎలా తీర్చుకోవాలి. రాబోయే సంవత్సరాలలో ఎంత విద్యుత్ ఉత్పత్తి స్థాయికి ఎదగాలి. తెలంగాణ నదీ జలాల వాటాలు ..ఏ జిల్లాకు ..ఏ నియోజకవర్గానికి సాగునీరు అవసరాలు ఎలా తీర్చాలి. ఏ ప్రాజెక్టు పూర్తి చేస్తే ..ఏ ప్రాంతానికి సాగునీరు అందుతుంది.

తెలంగాణలోని పది జిల్లాలు ..119 నియోజకవర్గాల మీద కేసీఆర్ కు స్పష్టమయిన అవగాహన ..తెలంగాణలో ఏ జిల్లాలో ఏ పంటలు వేస్తారు ? ఎక్కడ ఏ పంట అధికంగా పండుతుంది. ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా ఎలా ? ఏ జిల్లాలో ఏ పరిశ్రమలు పెట్టవచ్చు. వాటికి నిధులు ఎలా తీసుకురావాలి అంటూ కేసీఆర్ అనర్గళంగా ప్రసంగించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కేసీఆర్ ప్రసంగం విన్న విపక్ష నేతలంతా ఆయనను అభినందించకుండా ఉండలేకపోయారు. ప్రతిపక్ష నేతలు పలు విషయాలలో కేసీఆర్ ను డిఫెన్స్ లోకి నెట్టే ప్రయత్నం చేసినా కేసీఆర్ ఎక్కడా తడబడలేదు. అన్ని సమస్యలకు అఖిలపక్షం వేసి సమిష్టి నిర్ణయాలతో ముందుకు వెళ్తామని చెప్పి ప్రతిపక్షాల ముందరికాళ్లకు బంధం వేశారు. పదే పదే అధికారం దక్కిందన్న గర్వం లేదు. గెలిచాం కాబట్టి మేం చెప్పినట్లే వినాలన్న భేషజం లేదు అని ప్రకటించి ప్రతిపక్షాలనే డిఫెన్స్ లోకి నెట్టేశారు. తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ..వారి కలలు నెరవేర్చేందుకు సహకరించాలని  చెప్పి వారు కలిసి రావాల్సిన పరిస్థితిని కల్పించారు. కేసీఆర్ వ్యవహార శైలి ..సమస్యలపై కేసీఆర్ కు ఉన్న అవగాహన ..క్షేత్రస్థాయి అంశాలపై కేసీఆర్ కు ఉన్న పరిశీలనా దృష్టి ప్రతి నేతకూ అవసరం.  తెలంగాణ అంశాన్ని పక్కన పెడితే కేసీఆర్ కు ఉన్న విషయ పరిజ్ఞానం ..పరిశీలనను నేతలు అలవాటు చేసుకోవాలి. ఈ విషయంలో ప్రాంతాలకు అతీతంగా నేతలు ఆయనను ఫాలో కావాలి. నేతలంతా ఖచ్చితంగా ఓ పాఠంగా స్వీకరించాల్సిన అవసరం ఎంతయినా ఉంది.

sandeepreddy kothapally

31, మే 2014, శనివారం

ఎన్ని నిద్రలేని రాత్రులో ..ఎన్ని లెక్కలేని నిందలో ..!


ఒకడు ఫార్మ్ హౌజ్ పార్టీ అన్నడు ...మరొకడు తాగి తందనాలు అన్నడు ..ఒగడు వసూల్ రాజా అన్నడు ..ఇంకొకడు కుటుంబ పార్టీ అని అన్నడు ..అన్నోడు ఆంధ్రోడయినా ..ఆని పక్కన నిలవడి సంకలు గుద్దింది మన తెలంగాణకు చెందిన బానిస నేతలే. ఊరంత తెలంగాణ వైపు ఉంటే ఈ కుహానా మేథావులు మాత్రం ఆంధ్రోని చెంగువట్టుకోని తిరిగిండ్రు. అవకాశం దొరికిన ప్రతిసారి ఉద్యమనేత మీద ఆధారాలు లేని విమర్శలతో ..ఆమోదించలేని వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. వీరి పైత్యానికి సీమాంధ్ర మీడియా పైశాచికత్వం తోడయింది. 60 ఏళ్ల తెలంగాణ కలను 14 ఏళ్లలో సాకారం చేసిన కేసీఆర్ మీద ఇంకా తెలంగాణలో అనుమానాలు ఉన్నాయంటే ఇలాంటి బానిస మనస్తత్వం ఉన్న నేతలు, తెలంగాణలో పాతుకుపోయిన సీమాంధ్ర మీడియా పుణ్యమే.

2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావానికి ముందే స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ సాన్నిహిత్యం, మార్గదర్శనంతో ..పక్కా ప్రణాళికతో కేసీఆర్ తన పార్టీని స్థాపించారు. 2004 ఎన్నికల తరువాత దేశంలోని 32 రాజకీయ పార్టీలతో తెలంగాణకు అనుకూలంగా లేఖలు సంపాదించి కేంద్రానికి అందించాడు జయశంకర్ సార్, కేసీఆర్ ద్వయం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష కాబట్టే తెలంగాణతో ఎలాంటి సంబంధంలేని, తెలంగాణలో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించని రాజకీయ పార్టీలు ఎన్నో తెలంగాణ డిమాండ్ కు మద్దతు పలికాయి. తెలంగాణ న్యాయమయిన ఆకాంక్ష అని గుర్తించాయి. ఈ క్రమంలో పార్టీలను ఒప్పించేందుకు ..తెలంగాణ ఆకాంక్షను వారికి ఇప్పించేందుకు వారు ఎన్నో నిద్దరలేని రాత్రులు గడిపారు. ఎన్నో ప్రణాళికలు ...కొన్ని వందల గంటల చర్చలు దీనికోసం జరిగాయి. దేశంలోని రాజకీయ పార్టీలన్నీ తెలంగాణకు మద్దతు ఇచ్చినా ..మన రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం 2008 ఎన్నికలకు ముందు మాత్రమే అధికారం కోసం మాత్రమే తెలంగాణకు అనుకూలం అంటూ ఓ లేఖ ఇచ్చింది. 2009 డిసెంబరు 9 ప్రకటన తరువాత మాట మార్చి టీడీపీ అంటే తెలంగాణ ద్రోహుల పార్టీ అని తన నైజాన్ని చాటుకుంది. కాంగ్రెస్ నిర్లక్ష్యం ..టీడీపీ మోసం మూలంగా 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనికి బాధ్యత వహించాల్సింది ఆ రెండు పార్టీలే. ఈ ఆత్మహత్యల పాపం ఆ రెండు పార్టీల పుణ్యమే.

ఒకవైపు కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంటే ..దానికి సహకరించకుండా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలలోని ఎందరో నేతలు, ప్రజాసంఘాలు అని పేరు పెట్టుకుని, తమను తాము నేతలుగా ప్రకటించుకున్న ఎందరో నేతలను సీమాంధ్ర మీడియా మహానేతలను చేసి కేసీఆర్ మీద బురదచల్లించింది. ఆంధ్రబాబులకు గులాంలు అయిన ఎందరో నేతలు కేసీఆర్ మీద అబద్దపు ప్రచారాలు చేసి శునకానందం పొందారు. తెలంగాణ బిడ్డల ఆత్మహత్యలకు కారకులు అయిన ఆంధ్రానేతలు తెలంగాణలో తిరుగుతుంటే వారి యాత్రకు వంధిమాగధులుగా పనిచేసి అమరుల ఆత్మలకు క్షోభ కలిగించారు. తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వచ్చిన తరువాత కూడా ఈ బురద చల్లడం ఆగలేదు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తరువాత కూడా కేసీఆర్ మీద విషకక్కారు.

తన పార్టీని తాను విలీనం చేయాలా ? వద్దా ? అన్నది కేసీఆర్ కు సంబంధించిన సమస్య. టీఆర్ఎస్ పార్టీ అంతర్గత సమస్య. కానీ సీమాంధ్ర మీడియా తెలంగాణ బిల్లు రాగానే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేశాయి. కాదు కూడదంటే కేసీఆర్ ను మోసం చేశాడని దుమ్మెత్తిపోశాయి. చివరకు ఒంటరిగా ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ ను, ఆయన పార్టీని కూడా ఈ మీడియా ...దాని వంధిమాగధులు వదిలిపెట్టలేదు. విషపురుగుల్లా వెంటాడారు. వేటాడారు. కానీ ప్రజాక్షేత్రంలో వాటి పప్పులు ఉడకలేదు. కేవలం హైదరాబాద్, దాని చుట్టుపక్కల సీమాంధ్ర కాలనీలలో తప్ప. ఈ మధ్యకాలంలోనే హైదరాబాద్ లో ఏకంగా ఆరులక్షల మంది కొత్త ఓటర్లను హైదరాబాద్ పరిసరాలలో కొత్తగా చేర్పించి అక్కడ తెలంగాణ ద్రోహుల పార్టీ గెలిచేందుకు ఎత్తులు వేశారంటే సీమాంధ్ర పార్టీలు..సీమాంధ్ర మీడియా ఎంత జిత్తులమారి నక్కలో అర్ధం చేసుకోవాలి.

ఇప్పుడు కేసీఆర్ అధికారం చిక్కినా ఈ సీమాంధ్ర మీడియా ..అవి తెలంగాణలో పెంచి పోషించిన నేతలు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం ఖాయం. తెలంగాణ పునర్నిర్మాణంలో కేంద్రం సహకారం లభించకుండా సీమాంధ్ర మీడియా నేతలు తమ వంతు ప్రయత్నాలు చేయడం ఖాయం. ఇక వాటికి తోడుగా నాయుడు ద్వయం కలిసి కేంద్రం మనసును కలుషితం చేస్తూనే ఉంటాయి. వీటన్నింటిని అధిగమించి తెలంగాణ పునర్నిర్మాణంలో కేసీఆర్ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మొత్తానికి ఏదీ ఏమయినా తెలంగాణను అర్ధం చేసుకున్నది ..తెలంగాణ అర్ధం చేసుకున్నది ఒక్క కేసీఆర్ ను మాత్రమే. ఆయనకు ఇక నుండి ఇప్పటివరకు అందించిన అండదండలకంటే రెట్టింపుగా ఇక నుండి అందించాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉంది.

sandeepreddy kothapally

27, మే 2014, మంగళవారం

కేసీఆర్ ఎందుకు గెలిచాడు ?


తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర తొలి తెలంగాణ ప్రభుత్వం మరో నాలుగు రోజుల్లో కొలువుదీరబోతుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. కొమ్ములు తిరిగిన సీమాంధ్ర మీడియా దుష్ర్పచారాన్ని ..పదేళ్లుగా అధికారం చేజిక్కించుకుని మందబలం..ఆర్థికబలం పెంచుకున్న కాంగ్రెస్ ను ఢీ కొని ఏకంగా టీఆర్ఎస్ పార్టీ అధికారపీఠం ఎలా దక్కించుకుంది ? ప్రజలు ఏం చూసి టీఆర్ఎస్ కు ఓట్లేశారు ? ఏం చేస్తారని టీఆర్ఎస్ కు ఓట్లేశారు ? ఐదేళ్లలో టీఆర్ఎస్ అద్భుతాలు చేస్తుందా ? లేక అరచేతిలో స్వర్గం చూపెడుతుందా ? కేసీఆర్ ను ప్రజలు ఎందుకు నమ్మారు ?

2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు, అప్పట్లో ఆయనకు అండగా ఉన్న తెలంగాణలోని ప్రముఖ నాయకగణం అంతా ఇది మఖలో పుట్టి పుబ్బలో పోతుంద
ని అన్నారు. అసలు తెలంగాణ అక్కర్లేదు అన్నారు. కేసీఆర్ వెంట నడిచిన వారి మీద దాడులు కూడా జరిగాయి. 2004 ఎన్నికల వరకు కేసీఆర్ కాంగ్రెస్ టీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకుంటే గానీ టీడీపీని ఓడించలేం అన్న స్థితికి తీసుకువచ్చారు. ఇక అప్పటి నుండే కేసీఆర్ తన వ్యూహానికి పదునుపెట్టాడు. దేశంలో ప్రధానపార్టీ అయిన కాంగ్రెస్ ను తెలంగాణకు ఒప్పించాడు.

2004 ఎన్నికల్లో అధికారం దక్కిన వెంటనే వైఎస్ తన నైజాన్ని బయటపెట్టుకున్నాడు. టీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని కుట్రలు పన్నాడు. ఎమ్మెల్యేలను చీల్చాడు. కేంద్రంలో కేసీఆర్ మంత్రిపదవి దక్కినా దానిమీద మక్కువ పెంచుకోలేదు.. తెలంగాణ డిమాండ్ ను యూపీఏ ఉమ్మడి ప్రణాళికలో చేర్పించడం మీదనే దృష్టిపెట్టాడు. కొన్నినెలలు శాఖలేని మంత్రిగానే కొనసాగాడు. మరో వైపు వైఎస్ తెలంగాణ నేతలతో రెచ్చగొట్టించి కేసీఆర్ ను రాజీనామా దిశగా పురిగొల్పుతున్నా కేసీఆర్ భయపడలేదు. మంత్రిపదవికి ..ఎంపీ పదవికి రాజీనామా చేసి తెలంగాణవాదానికి పరీక్ష పెట్టాడు. తాను పులిమీద స్వారీ చేస్తున్నానని తెలిసినా కేసీఆర్ వెనుకంజ వేయలేదు. రెండులక్షల పై చిలుకు ఓట్లతో గెలిచి సత్తాచాటారు.

2008లో తన మొత్తం ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి కేసీఆర్ మరోసారి ప్రజలను తెలంగాణ దిశగా ఆలోచించే ప్రయత్నం చేశారు. ఆ ఎన్నికల్లో ప్రాభవం కోల్పోయినా 2009 ఎన్నికలలో ఈసారి రాష్ట్రంలోని ప్రధాన పార్టీ టీడీపీని ముగ్గులోకి దింపి తెలంగాణకు అనుకూల లేఖ రాయించారు. మహాకూటమి అని పెట్టుకుని పురిట్లోని మిత్రధర్మానికి చంద్రబాబు గండికొట్టి టీఆర్ఎస్ కు కేటాయించిన 46 స్థానాలలో 33 చోట్ల బీ ఫాంలు ఇచ్చి మోసం చేశాడు. వైఎస్ అధికారం దక్కిన తరువాత టీఆర్ఎస్ ను అంతం చేయాలని చూస్తే చంద్రబాబు అధికారం రాకముందే టీఆర్ఎస్ ను నాశనం చేయాలని ప్రయత్నించాడు. టీడీపీ మోసం మూలంగా 10 శాసనసభ, 2 ఎంపీ స్థానాలకే పరిమితమయినా కేసీఆర్ నిరుత్సాహపడలేదు. అవకాశం కోసం కాచుక్కూర్చున్నాడు.

2009లో అధికారం దక్కిన నాలుగు నెలలకే వైఎస్ చనిపోవడంతో ఆ తరువాత రెండు నెలలకే రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ మలుపుతిప్పారు. ఫ్రీ జోన్ అంశం మీద నిరహారదీక్ష మొదలుపెట్టి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను ముందుకు తెచ్చారు. 11 రోజుల నిరహారదీక్షతో కేంద్రం తెలంగాణ ప్రకటన చేసే పరిస్థితిని కల్పించారు. దీంతో 2009 డిసెంబరు 9న తెలంగాణ ప్రకటన వచ్చింది. ఇక ఆ వెంటనే సీమాంధ్ర నేతల మోసం, కుట్రలు బయటపడ్డాయి. ప్రకటన వచ్చీరాగానే వారంతా సమైక్యాంధ్ర అంటూ నాటకాలు మొదలుపెట్టడం..చంద్రబాబు రెండు కళ్ల నైజం, చిరంజీవి సమైక్యవాదం ఎత్తుకోవడం మొదలయింది. ఈ పరిణామాలతో అప్పటి వరకు స్థబ్దుగా ..తెలంగాణ ఉద్యమానికి దూరంగా ఉన్న తెలంగాణ సమాజం తెలంగాణ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. డిసెంబరు 23 కేంద్రం తెలంగాణ నిర్ణయం మీద వ్యతిరేక ప్రకటన రావడంతో తెలంగాణ సమాజం ఒక్కతాటి మీదకు వచ్చింది. అసలు వచ్చిన తెలంగాణను ఎందుకు ఆపారు ? తెలంగాణ ఏర్పాటుకు ఎందుకు మోకాలడ్డుతున్నారు ? అన్న చర్చ మొదలయింది.

2009 మొదలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందేవరకు కేసీఆర్ తెలంగాణ సమాజం వెంట నడిచారు. సకలజనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం ఏ కార్యక్రమం జరిగినా ..ఏ ఆందోళన చేసినా జేఏసీ వెంటనడిచింది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీని జేఏసీ వెంట నడిపించిన ఘనత కేసీఆర్ ది. తెలంగాణ ఉద్యమంలో లాఠీదెబ్బలు తిన్నవారికి ..అనాలోచితంగా ఆత్మహత్యలు చేసుకున్న అమరులకు, కేసుల పాలయిన విద్యార్థులకు అండగా ఉండి ఆదుకున్నది టీఆర్ఎస్ ..టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ. తెలంగాణ అంటేనే టీఆర్ఎస్. ఇక్కడ పోలీసుల నుండి గానీ, కాంగ్రెస్ నుండి గానీ, టీడీపీ నుండి గానీ ఇబ్బందులు ఎదుర్కొన్నది ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ నేతలే.
 ఈ నాలుగేళ్ల కాలంలో తెలంగాణ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లలేని పరిస్థితులను కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి కల్పించాడు. తెలంగాణ బిల్లు శాసనసభలో పెట్టినప్పుడు టీడీపీ, కాంగ్రెస్ నాటకాలను ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ ఎండగట్టింది. ఈ మధ్యకాలంలో జరిగిన ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులనే కాదు తెలంగాణ కోసం రాజీనామా చేసిన అందరు అభ్యర్థులకు టీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచి గెలిపించింది. 2010లో నిజామాబాద్ లో బీజేపీ అభ్యర్థి యెండెల లక్ష్మీనారాయణ, ఆ తరువాత నాగర్ కర్నూలులో నాగం జనార్ధన్ రెడ్డి గెలుపులే దీనికి నిదర్శనం.

తెలంగాణ బిల్లు శాసనసభ నుండి పార్లమెంటుకు వెళ్లాక ఢిల్లీకి వెళ్తూ కేసీఆర్ "ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి వెళ్తున్నా ..తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెడ్తా" అని చెప్పడం ఆయనలోని ఆత్మవిశ్వాసానికి అద్దంపడుతుంది. పార్లమెంటులో బిల్లు సంధర్బంగా బీజేపీ నేతల వ్యవహారం, టీడీపీ నేతల వ్యవహారం, చివరివరకూ చంద్రబాబు, జగన్ నాటకాలు అన్నీ కేసీఆర్ మీద తెలంగాణ ప్రజలకు విశ్వాసాన్ని పెంచాయి. నాలుగేళ్లగా ప్రజా ఉద్యమానికి దూరంగా, తెలంగాణ ఉద్యమం మీద ఉక్కుపాదం మోపిన కాంగ్రెస్ నేతలు తీరా కేంద్రం తెలంగాణ ఇచ్చాక ఇచ్చింది తామేనని తెలంగాణ హీరోలం తామేనని చెప్పుకోవడం జనాలకు కాంగ్రెస్ నేతల మీద అసహ్యం పెంచింది. అసలు గ్రామస్థాయిలో నిర్మాణమే లేదన్న టీఆర్ఎస్ పార్టీకి ప్రజలే పునాదులుగా నిలిచి పట్టంకట్టారు.

ఇంతకుముందు ఏ పార్టీకి లేనంతంగా టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఒక్కొక్కరు 10 వేల నుండి 93 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ స్థాయి మెజార్టీలు 1994 ఎన్నికల్లో గానీ, 2004 ఎన్నికల్లో గానీ ఏ పార్టీకి రాలేదు. శాసనసభతో పాటు లోక్ సభ సభ్యుల విషయంలో కూడా ప్రజలు కేసీఆర్ మీదనే విశ్వాసం ఉంచారు. కేసీఆర్ కేవలం 10 రోజుల్లో 110 సభల్లో పాల్గొని తన లక్ష్యాన్ని, తన ప్రణాళికను తెలంగాణ ప్రజల దగ్గరకు తీసుకువెళ్లారు. అరవైఏళ్ల వయసులోనూ ఆయన అత్యంత ఉత్సాహంగా రోజుకు పది సభల్లో అలుపెరగకుండా ఆత్మవిశ్వాసంతో పాల్గొన్నారు. ఆయన పోరాటమే ఈ రోజు ఆయనను నిలబెట్టింది. తెలంగాణ ప్రజలు నమ్మింది ఒక్క కేసీఆర్ ను ..తెలంగాణ విషయంలో ఆయన నిబద్దతను..మొండి పట్టుదలను. అయిదేళ్లలో కేసీఆర్ అద్భుతాలు చేస్తాడని ప్రజలు ఆశించడం లేదు. కేవలం తెలంగాణకు అవసరం అయిన పని కేసీఆర్ చేస్తాడన్న నమ్మకమే ప్రజలను కేసీఆర్ వెంట నడిపించింది. కేసీఆర్ ప్రజల మనసును గెలిచాడు. అందుకే ఆయన ఈ రోజు సగర్వంగా నిలిచాడు.

sandeepreddy kothapally

18, మే 2014, ఆదివారం

కోట్లకొక్కడు ..కేసీఆర్నూటికో ..కోటికో ..ఒక్కడు కాదు ..కోట్లాది మందికి ఒక్కడు కేసీఆర్. అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నిజం చేసిన ఒకే ఒక్కడు కేసీఆర్. ఇప్పుడు విజయానందంలో ఉండవచ్చు కానీ గత 14 ఏళ్లుగా ఆయన పడ్డ వేదన ..అవహేళనలు ..అవమానాలు అన్నీ ఇన్నీ కావు. ఈ రోజు ఆయనకు పూలందిస్తున్న చేతులే ఆయన కాళ్లసందున కట్టెలు పెట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఒక వ్యక్తి వక్తిత్వం మీద.. అలవాట్ల మీద ..ఈ మధ్య కాలంలో ఎన్నడూ రాజకీయాల్లో ఏ నేత మీదా జరగలేదు. కేసీఆర్ మొండితనమే ఆయనను నిలబెట్టింది. కేసీఆర్ పట్టుదలనే ఈ రోజు తెలంగాణను సాధించిపెట్టింది. సహకరించామన్నవారు ..సాధించామన్నవారు చాలా మంది ఉండొచ్చు ...కానీ వారందరికన్నా ముందున్నది కేసీఆర్ మాత్రమే ..

సీమాంధ్ర మీడియా ..సీమాంధ్ర పెట్టుబడిదారులు..సీమాంధ్ర రాజకీయ నేతలు ముప్పేట దాడిచేస్తున్నా వెరవకుండా కేసీఆర్ అత్యంత వ్యూహాత్మకంగా గత 14 ఏళ్లుగా తెలంగాణ సాధనకు తన ప్రణాళికను అమలు చేశారు. మొదటిసారి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీని తెలంగాణకు ఒప్పించిన కేసీఆర్ .. ఆ తరువాత 2009లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని దానిని ముగ్గులోకి దింపి తెలంగాణ అంశం నుండి ఆ పార్టీలు వెనక్కి పోయే అవకాశం లేకుండా చేశాడు కేసీఆర్. ఈ మధ్యకాలంలో నిజంగా కేసీఆర్ పదవికో ..పైసలకో అశించినట్లయితే ఈ రోజు తెలంగాణ అంశం అనేదే మనం మరిచిపోయే వాళ్లం. కానీ కేసీఆర్ లక్ష్యం మీద గురిపెట్టి వ్యూహాత్మకంగా ముందుకు సాగారు.

అవకాశం కోసం పొంచిఉన్న వేటగాడిలా 2009 ఎన్నికల్లో ఓడిపోయి ఆ వెంటనే వైఎస్ మరణించగానే మూడు నెలల్లో రాష్ట్ర ముఖచిత్రాన్నే మార్చేశారు. సీమాంధ్ర రాజకీయ నాయకుల డొల్లతనాన్ని బట్టబయలు చేసి తెలంగాణ ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ పరిస్థితులలో సీమాంధ్ర మీడియా ధాటికి ఏ రాజకీయ నాయకుడు అయినా చేతులెత్తేసేవారే కానీ కేసీఆర్ కాబట్టి మాత్రమే వాళ్లందరినీ తట్టుకుని పోరాడగలిగారు. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయనను గేలిచేసినవారు ..అసలు తెలంగాణ రాష్ట్రం అవసరం ఇప్పుడు ఏముందని ప్రశ్నించిన వారు...ఆ తరువాత చచ్చినట్లు కేసీఆర్ వెంటనడిచారు. అయితే సీమాంధ్ర మీడియా కేసీఆర్ మీద తెలంగాణ సమాజానికి అనుమానాలను పెంచింది. ఈ రోజు తెలంగాణ సాధించిన వ్యక్తిగా కేసీఆర్ పూర్థి స్థాయి క్రెడిట్ దక్కకపోవడానికి కారణమూ ఈ సీమాంధ్ర మీడియానే.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు కేంద్రం ఆమోదించిన తరువాత,.రాష్ట్రపతి దానికి ఆమోదముద్ర వేసి అపాయింటెడ్ డేట్ వచ్చిన తరువాత కూడా కేసీఆర్ ను తెరమరుగు చేసేందుకు ..తెలంగాణ వచ్చిన తరువాత ఇక ఆయనతో పనేంటి ..అసలు ఆయన చేసింది ఏంటి తెలంగాణ కోసం ..అన్న ప్రచారం పెద్ద ఎత్తున చేసి ఆయన గొప్పతనాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. తెలంగాణను అభివృద్ది చేసేందుకు గానీ ..భవిష్యత్ లో తెలంగాణ భద్రతకు గానీ కేసీఆర్  ఏ మాత్రం ఉపయోగపడడని ..కేసీఆర్ ను ఎన్నుకుంటే తెలంగాణకు నష్టం అని భారీ ఎత్తున ప్రచారం చేశారు. తెలంగాణ సమాజంలో కేసీఆర్ మీద నమ్మకం సన్నగిల్లేలా చేసేందుకు ప్రయత్నం చేశారు.

ఈ ప్రచారంలో ప్రత్యర్ధులు కొంతవరకు సఫలమయినట్లే భావించాలి. ఎందుకంటే 119 స్థానాలలో వాస్తవంగా టీఆర్ఎస్ కు 90కి పైగా స్థానాలు సాధించాలి. కానీ టీఆర్ఎస్ 63 స్థానాల వద్దనే ఆగిపోవడానికి కారణం అదే. కేసీఆర్ మీద ఎంత బురదజల్లినా ..తెలంగాణ సమాజం కీలకసమయంలో విజ్ఞతతో వ్యవహరించింది. ఇక ముందుకాలంలో కూడా తెలంగాణ కేసీఆర్ అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.

11, మే 2014, ఆదివారం

అనంగ అనంగ ఓ దోస్తు..

అనంగ అనంగ ఓ దోస్తు ఉండెటోడు ..ఆనికి ఊరంటె మస్తు పానం.

ఆడు దోస్తు అంటె మామూలు దోస్తు గాదు. ఆడు ఊరికే దోస్తు..

వాడు ఊళ్ల ఉంటె ఊళ్ల ఆని దోస్తులకు ..ఆనికన్న చిన్నోళ్లకు ..పెద్దోళ్లకు పండుగనే పండుగ
ఆనికి మస్తు పొలం ఉంది. ఆడుత పాడుత పొలం జేసెటోడు. పదో తర్గతి కాడనే సదువు సాలిచ్చుకున్నడు వాడు. ఆనికి అది అంత వంటవట్టలే ..30 ఎకరాల పొలం ..చేతినిండ పైసలు.
ఆనికి ఈడు ..వాడు అని లేదు. ఆడు చెల్క జెయ్యాలె.  దోస్తులతోని తిర్గాలె..కిర్ కెట్ ఆడాలె. ఆని ఊళ్ల ..సుట్టుపక్కల ఊళ్ల యాడ కిర్ కెట్ పోటీలు జర్గినా ఈనికి మతులావు వచ్చేది. ఎంట్రి పీజు ఈడె గట్టాలె ..ఊరి పోరగాళ్లను జమజేస్కోని పొయ్యి ఆట ఆడి వచ్చెటోడు. గెల్సుడు ..ఓడుడు తర్వాత సంగతి ..ఆళ్ల ఊరినుంచి వొయ్యి మాత్రం కిర్ కెట్ ఆడాలె. ఆడుత పాడుత.. ఆని జీవితం సాపీగ సాగుతున్నది. ఇంతలనే బజాజ్ పల్సర్ బండ్లొచ్చినయ్యి..ఆని కాయిసు బండి మీదికి మళ్లింది. బండి దెచ్చుకున్నడు ..ఇంగ వాని తిర్గుడు తిర్గుడ గాదు ...ఓ రోజు అచ్చంపేటకు వొయ్యిండు ..అనుకోకుండ ఆటో ఎదురొచ్చింది. ఆని బండికి గుద్దింది. ఆడు ఆడనే పానం ఇడ్సిండు. పాపం ఆని దోస్తులంత బాధవడ్డరు. ఏ తీర్గ జూసినా ఆడు లేడన్న బాధ మాత్రం తీరుత లేదు. ఆని గుర్తుగ ఏదో ఒకటి వెట్టుకోవాలె అనుకున్నరు. కానీ ఏం బెట్టుకోవాలె ? శానా దినాలు ఆలోచించిండ్రు. ఆనికి కిర్ కెట్ అంటె పానం గావట్టి వాటినే ఆని గుర్తుగ స్థూపం గట్టుకోవాలె అనుకున్నరు. అంతే ఊరి గేటుకాడ స్థూపం గట్టిండ్రు. దాని మీద మూడు వికెట్లు ..పైన రెండు బెల్స్ వెట్టిండ్రు. మధ్యల ఓ బాల్ వెట్టిండ్రు. అందులనే ఆని రూపాన్ని సూసుకోని ముర్సిపోతుండ్రు. యాడాదికోసారి ఆడు సచ్చిపొయ్యిన దినం గుర్తు వెట్టుకోని ఆని పేరు మీద కిర్ కెట్ పోటీలు వెడ్తున్నరు. ఆడులేడన్న బాధను ఆ విధంగ మర్సి పొయ్యేందుకు ప్రయత్నం జేస్తున్నరు. మంచి దోస్తులు గద..

(మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట తాలూకా బల్మూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కీ.శే భాస్కర్ రెడ్డి అనే యువకుడు ..ఆయిన దోస్తుల కథ ఇది. బహూశా గత నెలలో అతని వర్ధంతి అనుకుంటా ఎప్పుడో 2006లో ఈనాడుకు ఈ వార్త రాశా ..ఇయ్యాల మల్ల ఎందుకో యాదికొచ్చిండు)

అమ్మ గురించి ...

అమ్మ గురించి ఇంత హృద్యంగా చెప్పిన Prakash Chimmala సార్ కు వందనాలు


15, మార్చి 2014, శనివారం

కోపం వచ్చింది పార్టీ పెట్టా..నవ్వొస్తే జెండా ఎత్తేస్తావా ?

పార్టీ అంటే వీధి భాగోతమా ..
బాధ గురించి తెలిసినోనికే బాధ్యత తెలుస్తుంది
మెదడులేని ఎధవలంతా పార్టీలు పెడితే
ప్రజల భవిష్యత్ కు పంగనామాలే


14, మార్చి 2014, శుక్రవారం

బిడ్డా పవన్ కళ్యాణ్ బిజినేపల్లి గుర్తుందా ?

బిడ్డా పవన్ కళ్యాణ్ బిజినేపల్లి గుర్తుందా ?

పోయినాసారి ఎలచ్చన్లల్ల మీ అన్న పార్టీ కోసం పనిజేసిన మనిషికి కాకుండా వేరోళ్లకు టికెట్ అమ్ముకుంటే ప్రచారానికి వచ్చిన నిన్ను నడిరోడ్డు మీద నిలబెట్టిన జనం గుర్తున్నరా ? అందరికీ దండాలు వెట్టి ఆడి నుంచి బతుకు జీవుడా అని పారిపోయిన సంగతి యాదున్నదా ?

అలాంటి నువ్వు రాజకీయాల గురించి వారసత్వాల గురించి వసూళ్ల లెక్కల గురించి మాట్లాడ్తవా ? మీ అన్న పార్టీ వెడితే నీది యువరాజ్యం ..వాన్ధి ప్రజారాజ్యం..మీ బావ అల్లు అరవింద్ ది వసూళ్ల రాజ్యం

మీ అన్న సినిమాలల్లకొస్తె .. ఆయిన తరువాత నాగబాబు
ఆయిన ఎన్కనే నువ్వు ..నీ ఎన్కనే అల్లు అర్జున్
ఆ తర్వాత చిరంజీవి కొడుకు చిన్న మెగాస్టార్
ఇంగ ఆ తరువాత అల్లు శిరీష్, ఇంగ మీ మేనల్లుడు సాయిధరంతేజ్
ఇప్పుడు మీ అన్న నాగబాబు కొడుకు వరుణ్ తేజ్
ఇది వారసత్వం గాక..మీరేమన్న ఆస్కార్ నటులా ?
అంతర్జాతీయ అందగాళ్లా ?

చిన్న సినిమాలను సంకనాకిచ్చి ..ప్రతిభ గల కళాకారులకు అవకాశాలు లేకుండ జేసి
సినిమా టాకీసులు మీ గుప్పిట్ల వెట్టుకుని ..జీవితాలతో ఆడుకుంటున్నది మీరు గాదా ?

బిడ్డా ..
మీసాలు మెలేసి తిర్గనీకే ఇది కొమరం పులి సిన్మ గాదు
రూల్స్ ను బ్రేక్ జేసి నడ్పనీకే ఇది గబ్బర్ సింగ్ స్టేషన్ గాదు
పైసలిచ్చే ఆకట్టుకోనికే ఇది అత్తారింటికి దారేది గాదు

ఇది ప్రజాజీవితం ..ఇక్కడ అన్నింటికి సమాధానం జెప్పాలె
ఇక్కడ వ్యక్తిగత జీవితం ఉండదు ..పూటకో మనిషెమ్మటి కాపిరం జేస్తంటే
జనాలు నీకు ఆరతి పల్లాలు వట్టరు..ఓట్ల కోసం వస్తవేమో

నీ భాషను ..
నీ ఎకిలి ఏశాలను..
నీ ఎర్రి సకిలింపులను ..
నీ తిర్రి ఈసడింపులను ..

మార్చుకుని మందిలకు రా ..లేకుంటే
ఓట్ల సంగతి ఏమోగానీ ..ఏట్లు మాత్రం గ్యారంటీ

నీ పవనిజం ..శాడిజం మాతాన పనిజెయ్యదు
మాకు ''తెలంగాణ'' తర్వాతనే ఎవడయినా

13, మార్చి 2014, గురువారం

చిరంజీవి వర్సెస్ పవన్


అన్నయ్య : నాకు గంజి తెలుసు …బెంజి తెలుసు ..
తమ్ముడు : నాకు బీరు తెలుసు … కారు తెలుసు
అన్నయ్య : సామాజిక న్యాయం ప్రజారాజ్యం తోనే సాధ్యం …
తమ్ముడు : సహజీవన న్యాయం జనసేన తోనే సాధ్యం
అన్నయ్య : ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ..మార్పంటే పార్టీ మార్పే అని నా ఉద్దేశం ..
తమ్ముడు : ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ..మార్పంటే పెళ్ళాల మార్పే అని నా ఉద్దేశం …
అన్నయ్య : నేను పక్కా సమైఖ్య వాదిని…
తమ్ముడు : నేను పక్కా సహజీవన వాదిని …
అన్నయ్య : ఒక శక్తి కి మరో శక్తి తోడైతే చాలా అధ్బుతాలు స్రుష్టించవచ్చు …
తమ్ముడు : ఒక పెళ్ళానికి మరో పెళ్ళాం తోడైతే చాలా మంది పిల్లల్ని స్రుష్టించవచ్చు.

12, మార్చి 2014, బుధవారం

tommorow release 'JANAM SENA' live picture

TOMMOROW RELEASE

తెలుగు సినిమా చరిత్రలో రెండవ రూ.400 కోట్ల రూపాయల
భారీ బడ్జెట్ లైవ్ పిక్చర్ 'జనసేన' రేపే విడుదల

ట్యాగ్ లైన్ : now or never

హీరో - పవన్ కళ్యాణ్
దర్శకత్వం - త్రివిక్రమ్ శ్రీనివాస్
దర్శకత్వ పర్యవేక్షణ - చంద్రబాబు అండ్ కో

ఈ సారి కాకుంటే ఇక టీడీపీ అధికారంలోకి రాదు. అందుకే చంద్రబాబు నాయుడు అండ్ కో ఈ సారి సీమాంధ్రలో జగన్ పార్టీని నిలువరించేందుకు తమకు తోచిన ఎత్తుగడలన్నీ వేస్తున్నారు. పొరపాటున జగన్ అధికారంలోకి వస్తే తమకు మిగిలేది బూడిదేనని ఫిక్సయిన చంద్రబాబు కో పవన్ కళ్యాణ్ ను పార్టీ పేరుతో రంగంలోకి దించి ప్రజలను గందరగోళంలోకి నెట్టే ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీని బడ్జెట్ అంతా చంద్రబాబు అండ్ కో దే. మరీ విడ్డూరం ఏంటంటే ఈ జనసేన అభ్యర్థులు పరిమిత స్థానాలలో ..అదీ జగన్ పార్టీ కాస్త బలంగా ఉన్న స్థానాలలో పోటీకి దిగనున్నారని సమాచారం. ఇక ఇదే సమయంలో తమ బడ్జెట్ కు అదనపు లాభంగా తెలంగాణ ప్రజలను గందరగోళంలో పడేసి టీఆర్ఎస్ పార్టీ లాభపడకుండా చూసేందుకు తగిన మసాలా సిద్దం చేస్తున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం అనేది కల్ల. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలు 19. అందులో పది సినిమాలు ప్లాప్. ఏ లెక్కన చూసినా ఆయన మహా అయితే ఓ 200 కోట్లు సంపాదించి ఉంటాడు. ఆ మాత్రం రాజకీయ పార్టీ పెట్టడానికి ఏ మాత్రం సరిపోవు. మరి ఏ ధైర్యం ..వెనక ఎవరి అండా లేకుండా పవన్ కళ్యాణ్ ఎందుకు రాజకీయం చేస్తాడు. అన్న చిరంజీవికి రాజకీయాల్లో జరిగిన అనుభవం చూసిన పవన్ తెలిసి తెలిసి తన డబ్బులతో రాజకీయం చేస్తాడా ? అంటే అది కూడా జరగని పని. కేవలం చంద్రబాబుకు ఈ సారి ఖచ్చితంగా అధికారం దక్కించుకునేందుకు ఆయన వర్గం వేస్తున్న ఎత్తుగడల్లో భాగమే పవన్ పార్టీ. ఇక ముందు చంద్రబాబు అండ్ కో మరిన్ని విచిత్రాలకు కూడా తెర లేపుతుందని సమాచారం.

30, జనవరి 2014, గురువారం

ఏపి నుండి పోతున్న..తిరిగి తెలంగాణల అడుగువెడ్త


నేను రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఢిల్లీకి వెళ్తున్నా

తెలంగాణ రాష్ట్రంలో తిరిగి అడుగుపెట్టబోతున్నా..

ఈ రోజుతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ చిట్టచివరి సమావేశం ముగిసిపోయింది
సభలో ఏదో జరిగిపోయింది అన్నట్లు సీమాంధ్ర మీడియా అవాకులు చెవాకులు పేలుతోంది
ఢిల్లీకి చెందిన వారితో మాట్లాడా ..ఇక్కడ జరిగిన దేనిగురించి భయపడొద్దని చెప్పారు
లంకల పుట్టినోళ్లంతా రాక్షసులే అని నేను అన్నమాటలు సీమాంధ్ర నేతలు నిజం చేశారు
ఈ రోజు వారు సభలో వ్యవహరించిన తీరే అందుకు కారణం
రాష్ట్రపతి అనుకుంటే శాసనసభనే రద్దు చేసే అధికారం ఉంది
కానీ చంద్రబాబు రాష్ట్రపతిని తేలిగ్గా తీసుకున్నారు.

సీమాంధ్ర నేతలంతా తమ రాజకీయ ప్రయోజనాల గురించి మాత్రమే చూశారు
ఒక్కరు కూడా సీమాంధ్ర ప్రయోజనాల గురించి పట్టుబట్టలేదు..ఇది దారుణం
మేధావులం అని చెప్పుకునే చంద్రబాబు, జయప్రకాష్ నారాయణలకు
కూడా సీమాంధ్ర ప్రయోజనాలు పట్టలేదు

తెలంగాణ ప్రజలు అధైర్యపడాల్సిన అవసరం లేదు
తెలంగాణ రాష్ట్రం వచ్చేస్తుంది..అందులో బ్రహ్మాండంగా సంబరాలు చేసుకుందాం
మెజార్టీ వారి అభిప్రాయంతోనే రాష్ట్రం ఏర్పాటు చేయాలి అని ఎవరయినా అంటే
ఈ దేశంలో అసలు రాష్ట్రాలే ఏర్పడవు..అలా ఎవరన్నా అంటే
వాళ్లంత మూర్ఖులు ఇంకొకరు ఉండరు

ఇప్పటికయినా సీమాంధ్ర మీడియా తన పద్దతి మార్చుకోవాలి
ఇంత మూర్ఖంగా మీడియా ఉండడం ఎక్కడా జరగదు
రేపు తెలంగాణ వచ్చిన తరువాత మీరు ఏ మొహం 
పెట్టుకుని వార్తలు రాస్తారు.. ఓ సమస్య పరిష్కారం అవుతోంది..సంతోషించండి
ఇద్దరు రాజ్యసభకు పోటీలో ఉంటే అదేదో పెద్ది విచిత్రంగా చూస్తున్నారు

తెలంగాణ విభజన గెలుపు ..ఓటమికి సంబంధించిన అంశంగా చూస్తున్నారు
ఇది తప్పు ..ఇది కోట్లాది మంది ప్రజల మనసులతో ముడిపడి ఉన్నది
ఇప్పటికయినా విజ్ఞులు అర్ధం చేసుకోవాలి ..ఎవరూ వెయ్యేళ్లు బతకడానికి ఈ భూమ్మీదకు రాలేదు... రేపటి తరాలకు మనం మార్గదర్శకంగా నిలవాలి 
సీమాంధ్ర పెద్దలు ప్రజల మనసుల్లో విషబీజాలు నాటుతున్నారు
ఈ రోజు కూడా మీరు తెలంగాణ ప్రజల మనసులలో భయం సృష్టిస్తున్నారు
రేపు మనం అంతా ఒక దేశంలో కలిసి ఉండాలి
రేపు ఏదయినా ఉపద్రవం వస్తే ఒకరికి ఒకరం సహకరించుకోవాలి
మీడియా న్యూస్ రాస్తుందా ? వ్యూస్ రాస్తుందా ?

బిల్లు ఒక్కటే ఉంటుంది..అది చివరి వరకూ అనేక మార్పులు చేర్పులకు గురవుతుంది
చివరకు పార్లమెంటులో తీర్మానం చేసిన తరువాత వచ్చిందే ఫైనల్ బిల్లు 
అంతేగానీ అసలు బిల్లు ..నకిలీ బిల్లు అని ఉండవు..
15 రోజులలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఖాయం ..ఇది రాసిపెట్టుకోండి
ఢిల్లీ ఈ విషయంలో స్పష్టంగా ఉంది... ఏ సభలో ఏ రోజు చర్చ అనేది కూడా నిర్ణయించారు
తెలంగాణ - అంధ్ర ప్రత్యేక రాష్ట్రాలలోనే ఎన్నికలు జరుగుతాయి

తెలంగాణలో శాసనసభ స్థానాలు పెరగబోతున్నాయి.. అవి వచ్చేసారి అమలులోకి వస్తాయి
శాసనసభను ఎక్కువకాలం పొడిగించే అవకాశం లేనందున ఈ సారికి శాసనసభ స్థానాలు పెంచుతున్నట్లు మాత్రమే బిల్లులో పేర్కొననున్నారు ..
ఢిల్లీకి వెళ్లిన నేను అన్ని పార్టీల నేతలను కలుస్తా..సోనియాను కూడా కలుస్తా 
ఈ రోజు తెలంగాణ ఏర్పడడానికి కారణం సోనియాగాంధీనే 

నేను ఈ రోజు నా జీవితంలో గొప్ప సాఫల్యం పొందుతున్న
నేను ఎక్కడా ఓడిపోలే..ఎమ్మెల్యే కావాలనుకున్న అయిన
ఎంపీ కావాలనుకున్న అయిన ..తెలంగాణ రావాలనుకున్న వస్తుంది
ఇక బంగారు తెలంగాణను ఏర్పాటు చేసుకోవడం మిగిలింది
నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీకు తెలుసు
నన్ను తెలంగాణ ప్రజలు చివరకు అర్ధం చేసుకున్నారు

ఈ విజయం తెలంగాణ అమరులకు అంకితం
వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతోంది
అమరుల కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం అందిస్తాం
ప్రతి కుటుంబానికి ఓ ఉద్యోగం అందిస్తాం 
వారికి తెలంగాణ రాష్ట్రంలో అండగా నిలుస్తాం 

జై తెలంగాణ జైజై తెలంగాణ

sandeepreddy kothapally

please like this page

www.facebook.com/thovva

https://www.facebook.com/pages/We-support-kcr/179026928974415?ref=hl

1, జనవరి 2014, బుధవారం

ఆడు ఒక్క పూట ఏశానికి మీసాలు తీసుకుంటున్నడు

ఆడు ఒక్క పూట ఏశానికి మీసాలు తీసుకుంటున్నడు
పగటి ఏశగాని లెక్కన పరేషాన్ అయితున్నడు
తెలంగాణను జీర్ణం జేసుకోలేక ఆగమయితున్నడు
అందుకే ఆని అసలు వికృత రూపాన్ని బయట వెట్టుకుంటున్నడు
మూణ్ణెళ్ల ముఖ్యమంత్రి గిరి జూసుకొని
నాయంత మొనగాడు లేడనుకుంటున్నడు

అబ్బే ..హవులే..బెవకూఫ్
కలిసుందామనేటోనికి ఇన్ని కుట్రలుంటాయిరా !
నీ ఒక్క శాడిస్టు మనస్తత్వాన్ని సంతృప్తి పరచుకోనికె
ప్రజల మధ్య సంబంధాలు శాశ్వతంగా దెబ్బతీస్తావురా ?!


మీ రెంత లేకి ఎధవలో ఇప్పుడు బయటవడ్తుంది
మేమెందుకు విడిపోతున్నమో ..సీమాంధ్ర
ప్రజలకు ఇప్పుడు అర్ధమవుతుంది..
కానీ వాళ్లు మొదట చేయాల్సింది
మీ రాజకీయ భవిష్యత్ కు సమాధికట్టడం

నమ్ముకుని మిమ్మల్ని ఎన్నుకున్నరా ..
ఇంగ వాళ్లను దేవుడు గుడ కాపాడలేడు

https://www.facebook.com/sandeepreddy.kothapally

www.facebook.com/thovva