25, ఆగస్టు 2011, గురువారం

తెలంగాణ ప్రెస్ క్లబ్ ప్రారంభం

తెలంగాణ జిల్లాలలో మొదటి సారిగా మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ తాలూకా  తెలకపల్లి మండలంలో  పత్రికా విలేకరులం అందరం  తమ ప్రెస్ క్లబ్ కు ‘తెలంగాణ ప్రెస్ క్లబ్’ అని నామకరణం చేసి ప్రారంభించాం. బుధవారం దీనిని జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ప్రారంభించారు. స్థానిక ఆర్డీఓ మధుసూధన్ నాయక్, డీ ఎస్ పీ జోగు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బాబయ్య, పత్రికా మిత్రులు భరత్, విజయ్, శ్రీరాములు ,బాలరాజు, శంకర్, చిలుక శేఖర్ రెడ్డి, రమేష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.    జై తెలంగాణ జై జై తెలంగాణ 



21, ఆగస్టు 2011, ఆదివారం

తెలంగాణ ఎమ్మెల్యేలు సిగ్గు తెచ్చుకోవాలి


ఒక వ్యక్తి కోసం రాజీనామా చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చూసి తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు సిగ్గు తెచ్చుకోవాలని తెలంగాణ ఉద్యోగుల సంఘాల నేతలు విఠల్, పాపారావులు అన్నారు. తెలంగాణ కోసం చనిపోయిన 600 మంది అమరవీరుల ఆశయ సాధన కోసం తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్లీ రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.
ఒక వ్యక్తి కోసం 27 మంది రాజీనామాలు చేస్తుంటే, నాలుగున్నర కోట్ల ప్రజల కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎందుకు రాజీనామా చేయటం లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ బిడ్డలైతే సెప్టెంబర్ 17న తెలంగాణ జెండాలు ఎగురవేయాలని సవాల్ చేశారు. చంద్రబాబు నాయుడు అత్యంత అవినీతి పరుడని, ధనవంతుడని తెహల్కా ఏనాడో చెప్పిందని గుర్తు చేశారు.
జగన్‌పై సీబీఐ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆయన కోసం 27 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తుంటే, తెలంగాణ కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయకపోవడం సిగ్గుచేటని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్ మండిపడ్డారు.

సీమాంధ్ర పత్రికల విష ప్రచారం షురూ

తెలంగాణ ఉద్యమం చల్లబడిందని సీమాంధ్ర పత్రికలు తమ విష ప్రచారాన్ని మళ్లీ ప్రారంభించాయి. ఆదివారం సాక్షి దినపత్రిక ఈ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కొద్ది సేపటికే అదే వార్తను కాపీ చేసిన సూర్య దినపత్రిక తన నెట్ ఎడిషన్ లో ఉన్నది ఉన్నట్లుగా అచ్చుకొట్టింది. 
                     తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా రాజీనామా చేయాలని తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలను నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు బతిమాలుతుంటే కాంగ్రెస్, టీడీపీ నేతలు సిగ్గుతప్పి జారుకుంటున్నారు. 15౧౫ రోజులు పదవులకు దూరంగా ఉన్న మంత్రులు అదేదో జీవిత సర్వస్వం కోల్పోయినట్లు 14౧౪ఎఫ్ రద్దు చేయగానే చంకలు గుద్దుకుంటూ విధుల్లో చేరిపోయారు. తెలంగాణ ప్రజలరా తిరగబడండి. నేతలను తరిమికొడితేనే సిగ్గొస్తుంది. ఇంటి దొంగలతోనే మనకు ఇక్కట్లు తస్మాత్ జాగ్రత్త.



16, ఆగస్టు 2011, మంగళవారం

పదవి లేకుండా బతకలేo

పదవి లేకుండా బతకలేమని  తెలంగాణ మంత్రులు నిరూపించారు. ప్రజల ఆకాంక్షలకన్నా తమకు పదవులే ముఖ్యమని చాటుకున్నారు. లగడపాటి, కావూరి చెప్పిన మాటలను తెలంగాణ మంత్రులు  నిజం చేసి చూపించారు. కాంగ్రెస్  స్టీరింగ్ కమిటీలో తాము తీసుకున్న నిర్ణయాన్ని తామే అతిక్రమించారు.
తెలంగాణ ప్రాంత మంత్రులు.. మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు.  ఒక కోమటిడ్డి వెంకట్‌ రెడ్డి మినహా మిగతా అందరూ హాజరయ్యారు.  మరో మంత్రి శంకర్‌రావు తాను అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నానంటూ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అనుమతి తీసుకున్నారు. మొత్తంగా ముఖ్యమంత్రి సూచన మేరకు మంత్త్రులు పదవులు అనుభవించేందుకే కట్టుబడ్డారు.  తెలంగాణ కోసం పదవులు త్యాగం చేస్తామని బీరాలు పలికిన మంత్రులు ఉద్యమం తీవ్ర దశలో ఉన్న తరుణంలో మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేశారని తెలంగాణ వాదులు భగ్గుమంటున్నారు.
మరోవైపు   స్టీరింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న మంత్రి  జానాడ్డి కూడా కేబినెట్ సమావేశంలో ఉత్సాహంగా పాల్గొనటం తెలంగాణవాదుల్లో ఆగ్రహాం కలిగిస్తోంది. తెలంగాణ విషయంలో మంత్రులకు మొదటి నుంచి చిత్తశుద్ధి లేదు. ప్రజలు గ్రామాలలో తిరగనిచ్చే పరిస్థతిలేకనే పదవులకు దూరమని ప్రకటించినా  ఇళ్లకు ఫైళ్లు తెప్పించుకుని విధులు నిర్వహించారు. ప్రస్తుతం సోనియా అనారోగ్య కారణాలను చూపి తిరిగి విధుల్లో చేరారు. దీనిపై భగ్గుమంటున్న తెలంగాణ వాదులు కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా ఓట్లు వేసేది తెలంగాణ ప్రజలు అన్నది గుర్తుంచుకోవాలని తెలంగాణకు ద్రోహం చేసిన మంత్రులకు భవిష్యత్ లో మిగిలేది రాజకీయ సన్యాసమేనని అన్నారు.

12, ఆగస్టు 2011, శుక్రవారం

14ఎఫ్‌ను తొలగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు


14ఎఫ్‌ను తొలగిస్తూ శుక్రవారం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా  విడుదలైంది. 14 ఎఫ్ రద్దుతో ఇక హైదరాబాద్ ఫ్రీజోన్ కాకుండా ఆరో జోన్ పరిధిలోకి రానుంది. ఆరో జోన్‌లో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఎస్‌ఐ రాతపరీక్షలకు ముందు రోజే కేంద్రం 14ఎఫ్‌పై కీలక నిర్ణయం తీసుకుంది.  సీఎం కార్యాలయంకు సమాచారం అందినట్లు అధికారులు ప్రకటించారు.
14ఎఫ్‌ రద్దుకోసం గత కొన్నేళ్లుగా తెలంగాణలో  ఆందోళనలు సాగుతున్నాయి. గత కొంతకాలంగా అవి తీవ్ర రూపం దాల్చాయి. దీంతో కేంద్రం దీన్ని సీరియస్ గా తీసుకుంది.  ఈ నెల 13, 14న రాష్ట్రంలో ఎస్సై రాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే  14ఎఫ్‌ రద్దు చేయనిదే పరీక్షలు  రాసేది లేదని తెలంగాణ వాదులు పట్టుబట్టారు.  ఈ నేపథ్యంలో కేంద్రం తొందరగా స్పందించి పరీక్షలకు ముందే ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనే అసేంబ్లీ తీర్మానం చేయడంతో నిర్ణయం తొందరగా వెలువడింది.
తెలంగాణ ప్రజల చారిత్రక విజయం
14ఎఫ్ తొలగింపు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదల చేయటం తెలంగాణ ప్రజలు సాధించిన చారిత్రక విజయం అని తెలంగాణ విద్యార్థి, రాజకీయ, ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది. ఇదే స్ఫూర్తితో తెలంగాణను కూడా సాధించుకుంటామని టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు, రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం తెలిపారు. ఇది తెలంగాణ ప్రజల, నాయకుల ఐక్యతకు నిదర్శనమని అని నాగం జనార్ధనరెడ్డి అన్నారు.  తెలంగాణ సాధించేవరకు ఈపోరాటం కొనసాగుతుందని తెలిపారు.

6, ఆగస్టు 2011, శనివారం

వురి కొయ్యకు వేలాడిన వీరుడా
వుద్యఃమం సంగతి మరిచావా ?
చావే సమస్యకు పరిష్కారమనుకుంటే
నాలుగున్నర కోట్ల వురితాళ్ళు వొకే చోట పెనవేద్దాం
నేతలు చస్తే తెలంగాణ వస్తుందనుకుంటే
తెలంగాణ నేతలందర్ని పాతరేద్దాం
కానీ యిది సమస్యకు పరిష్కారం కాదని నీకు తెలుసు
m tech చదివిన నీవే చావు పరిష్కారమనుకుంటే
తెలంగాణ ప్రజలు యేమై పోవాలి
నిన్ను నమ్ముకున్న తల్లిదండ్రులు యేం కావాలి
తెలంగాణ తల్లికి గర్భశోకం మిగిలిస్తావా
తెలంగాణ సాయుధ పోరాటంలో
ఖాశీం రజ్వీలు వున్నారు
షోయబుల్లాఖాన్ లు వున్నారు
పోరాటం మన పుట్టుక..పోరాటం మన వూపిరి
జైపాల్ రెడ్డిని తరమడానికి
దానం, ముఖేష్ లాంటి ద్రోహులను గెంటడానికి
దామోదర రాజనర్సింహ, యెర్రబెల్లి, దేవేందర్ గౌడ్ లను దునుమాడేందుకు,
తెలంగాణను యెచ్చిడి చేస్తున్న చిదంబరంలను దించేందుకు
వోటు అనే వజ్రాయుధం మనకు వుంది
తెలంగాణ పోరులో నువ్వు కోరుకున్నట్లు
aaKhari అమరుడివి నువ్వేకావాలి
మరే వీరుడు నేలకు వొరగొద్దు

మిత్రులరా తెలంగాణ మన జన్మహక్కు
దాన్ని పోరాడి సాధించుకుందాం జై తెలంగాణ జై జై తెలంగాణ
.....సందీప్ రెడ్డి కొత్తపల్లి @telangana jai www.thovva.blogspot.com