‘‘ప్రజా ఉద్యమాల మీద, ప్రజాస్వామిక మౌలిక విలువల మీద ప్రధానికి గౌరవం లేదు. తెలంగాణ ప్రజల
ఉద్యమ స్ఫూర్తిని కళ్లుండి కూడా చూడలేని కబోది ప్రధాని మన్మోహన్ సింగ్’’ అని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు విమర్శించారు. తెలంగాణపై ప్రధాని చేసిన వ్యాఖ్యలపై పై విధంగా ఆయన స్పందించారు.
తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ తెలంగాణ ప్రజల కోపాన్ని రుచిచూస్తుందని హెచ్చరించారు. అన్నిరకాలు పోరాటాలు చేద్దాం. దానికి నేను అండగా ఉంటా. తెలంగాణను సాధించుకుందామని కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రధాని వ్యాఖ్యలను తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం తప్పుపట్టారు. కాంగ్రెస్ కు ఖతం కరో అనే నినాదంతో తాము తెలంగాణ ప్రజల్లోకి వెళ్తామని, అసలు తెలంగాణ సమస్య నిన్న, మొన్నటిది అన్నట్లు ప్రధాని మాట్లాడుతున్నారని విమర్శించారు.
anna correct cheppindu...yes congress ko khatham karo....
రిప్లయితొలగించండిశత కోటి వీణల ...
రిప్లయితొలగించండిసహస్రకోటి వేణువుల ...
చతుర్కోటి ప్రాణుల ...
కన్నీటి ధారల ....
దుక్ఖ గానం...
అమర వీర పోరు తెలంగాణం....
మా ఆరో ప్రాణం ....ఆఖరి రణం !!!