13, నవంబర్ 2011, ఆదివారం

పరకాల ఓ పిచ్చి కుక్క


పీఆర్పీలో ఉన్నప్పుడు సామాజిక తెలంగాణ.. బీజేపీలో ఉన్నప్పుడు ప్రత్యేక తెలంగాణ.. ఇప్పుడేమో విశాలాంధ్ర తిరుగుతూ పరకాల ప్రభాకర్ తెలంగాణపై ఓ పిచ్చి కుక్కలా మాట్లాడుతున్నారని జయశంకర్ సెంటర్ నేత, రాజకీయ విశ్లేషకులు వి. ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాలాంధ్ర కోసం ఇంట్లో కుటుంబ సభ్యులనే ఒప్పించలేని వ్యక్తి తెలంగాణ ప్రజలను ఒప్పిస్తాను అనడం సిగ్గు చేటని అన్నారు.  ప్రొ.జయశంకర్ చెప్పినవి అబద్ధాలు అని నిరూపించినా, తెలంగాణకు వనరుల దోపిడీ జరగలేదని చూపించినా ఉద్యమం నుంచి తప్పుకుంటామని తేల్చి చెప్పారు. ఒక వేళ పరకాల ప్రభాకర్ చెప్పినవి అబద్ధాలు అయితే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లగడపాటి, రాయపాటి లాంటి వాళ్ల డబ్బు సంచులకు ఆశపడి తెలంగాణపై విషం కక్కుతున్నారని విమర్శించారు.

2 కామెంట్‌లు:

  1. అతను పిచ్చికుక్క కాదు, విష నాగు. పిచ్చి కుక్క కరిస్తే మనిషి కొన్ని రోజులైనా బతుకుతాడు కానీ విష నాగు మనిషిని కొన్ని గంటలలోనే చంపగలదు. పరకాల ఇప్పటికే విశాలాంధ్ర మహాసభ పేరుతో తెలంగాణా వ్యతిరేక విషం బాగా ఇన్‌జెక్ట్ చేశాడు.

    రిప్లయితొలగించండి