విశాలాంధ్ర మహాసభ పేరుతో గత కొన్నాళ్లుగా సదస్సులు నిర్వహిస్తున్న మాజీ ప్రజారాజ్యం పార్టీ నేత, జర్నలిస్టు పరకాల ప్రభాకర్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. హైదరాబాద్ లోని జర్నలిస్ట్ కాలనీలో ఈ సంఘటన జరిగింది. దీంతో పోలీసులు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్, పరకాల ప్రభాకర్ ను అరెస్టు చేసిన పోలీసులు చంద్రశేఖర్‌ను గోల్కోండ పోలీస్ స్టేషన్‌కు, పరకాలను బంజారాహిల్స్ పీఎస్‌కు తరలించారు. శుక్రవారం బషీర్ బాగ్ లో, అంతకుముందు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో పరకాల నిర్వహించిన సదస్సులు వివాదాస్పదం అయ్యాయి.
తెలంగాణలో సమైక్యాంధ్ర వాదన వినిపించి ప్రజలను ఒప్పిస్తానని, దానికి సహకరించే దమ్ము తెలంగాణ నేతలకు ఉందా ? అని పరకాల ప్రభాకర్ సవాల్ విసిరారు. దీనికి స్పందించిన చంద్రశేఖర్ తన నియోజక వర్గం అయిన వికారాబాద్‌కు వచ్చి తెలంగాణ వాదం లేదని ఒక్కరితో అనిపించినా తాము ఉద్యమం చేయడం మానేస్తామని సవాల్ విసిరారు. ఏబీఎన్ ఆంద్రజ్యోతి చానల్‌లో జరిగిన చర్చల్లో వీరి మధ్య ఈ చర్చ చోటు చేసుకుంది. దీంతో ఏకీభవించిన పరకాల ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నుంచి బయలుదేరుదామని ఒప్పందం చేసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఏబీఎన్ కార్యాలయానికి చేరుకున్న ఇద్దరు వికారాబాద్ బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. బయట ఉన్న తెలంగాణవాదులు అనూహ్యంగా పరకాల ప్రభాకర్ పై దాడి చేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
కొద్దిరోజుల క్రితం ప్రొఫెసర్ జయశంకర్ అబద్దాల కోరు అని పరకాల వాదించారు. దీంతో తెలంగాణ వాదులు దాడికి సిద్దపడినట్లు తెలుస్తోంది. తెలంగాణలో తెలంగాణ వారు సమావేశాలు, సభలు పెట్టుకుట్టామంటే అనుమతులు ఇవ్వని పోలీసులు, ప్రభుత్వం పరకాలకు అనుమతులు ఎందుకు ఇస్తున్నారని టీఆర్ఎస్ నేత శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు. రెండు ప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టేలా చర్చలు పెడుతున్న పరకాలకు అనుమతులు ఇప్పించి ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తుందని విమర్శించారు.
మీకు తప్ప ఎవరికీ భావ ప్రకటనా స్వేచ్చ వద్ద్లు
రిప్లయితొలగించండితన్నడం మా హక్కు...తెలంగాణ మా జన్మహక్కు మేం పెంచిన కుక్కలు మా మాట వినకుంటే కుక్కల మందు పెట్టి చంపుతాం
రిప్లయితొలగించండిshuddi sari poledu...inka penchavalasindi!
రిప్లయితొలగించండివిశాలాంధ్ర మహా సభ అనే ఒక సంస్థ లేదు. వాళ్ళు వైజాగ్‌లోనో, విజయవాడలోనో కూడా మీటింగ్‌లు పెట్టకుండా కేవలం ఆన్‌లైన్‌లో ప్రకటనలు ఇస్తున్నారు. ఆ సంస్థ ఒక ఆన్‌లైన్ జోక్ తప్ప ఇంకొకటి కాదు.
రిప్లయితొలగించండి