26, డిసెంబర్ 2013, గురువారం

ఒకే ఒక్కడు..కేసీఆర్

మొదట వారు ఆయన ఉనికిని నిరాకరించారు. ఆ తర్వాత ఆయనను ఎగతాళి చేశారు. ఆయన వేషభాషలను గేలి చేశారు. వ్యక్తిత్వంపై దాడి చేశారు. ఆరోపణల వర్షం కురిపించారు. ఆయనను రాజకీయంగా అంతంమొందించడానికి యుద్ధం చేశారు. ఎన్ని కుట్రలు, ఎన్ని దెబ్బలు, ఎన్ని గాయాలు, ఎన్ని ఉద్విగ్న క్షణాలు… అయినా ఆయన ప్రజాస్వామిక పంథాను వీడలేదు. ఒక లక్ష్యంకోసం ఇన్ని అవమానాలను, ఇన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్న నేత సమకాలీన చరిత్రలో మరొకరు లేరు. వందలాది మంది పిల్లలు మృత్యుపాశాన్ని కౌగిలించుకుంటుంటే ఆయన దుఃఖంతో చలించిపోయారే తప్ప హింసామార్గం ఎంచుకోలేదు. పోలీసులు తన కాళ్లూ చేతులూ పట్టుకుని బస్తాలా విసిరేసినప్పుడూ, మృత్యువు చివరి మెట్టుపై నిలబడినప్పుడూ కూడా సంయమనం కోల్పోలేదు. రాజకీయ సమీకరణే ఎప్పటికయినా తెలంగాణా సాధిస్తుందని ఆయన నమ్మాడు. ఉద్యమాలకు బెదరనివాడు అధికారం పోతుందంటే భయపడతాడని ఆయన బలంగా విశ్వసించాడు. చాలాసార్లు ఇటు తెలంగాణవాదులూ, అటు తెలంగాణ ద్రోహులూ ఇద్దరూ ఒకే గొంతుకతో ఆయనపై విరుచుకుపడ్డారు. కిందపడిన ప్రతిసారీ వెయ్యి ఏనుగల బలంతో లేచాడు. జారిపోతున్న శక్తులను కూడదీసుకుని మళ్లీ మళ్లీ పోరాడాడు. అందరినీ తెలంగాణ చక్రబంధంలోకి తీసుకొచ్చి నిలిపాడు. చివరకు ఆయనే గెలిచాడు. ఆ ఒక్కడు కేసీఆర్! పన్నెండేళ్ల క్రితం ఆయన ఒక సాధారణ నాయకుడు. మెదక్ జిల్లా తప్ప బయట పెద్దగా సంబంధాలు లేని నాయకుడు. వెనుక బలమైన సామాజిక వర్గంలేదు. తరగని ఆస్తులు లేవు. గట్టిగా గాలొస్తే కొట్టుకుపోయేంత బక్కపల్చటి మనిషి. మరోవైపు చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి, డి.శ్రీనివాస్, జానారెడ్డి, దేవేందర్‌గౌడ్ వంటి బడాబడా నేతలు రాజకీయాలను ఏలుతున్నకాలం. అన్నింటా పాతుకుపోయిన బలమైన సీమాంధ్ర పారిశ్రామిక వర్గం. పగబట్టిన చానెళ్లు, పత్రికలు. బుసలు కొట్టే సామాజిక వర్గాలు. అందుకే తెలంగాణ సాధన ‘చెన్నారెడ్డి వల్లనే కాలేదు, ఈయన వల్ల ఏమవుతుంది?’ అందరూ తీసిపారేసిన రోజులవి. నిజమే చెన్నారెడ్డి, జానారెడ్డి, ఇంద్రారెడ్డి, నరేంద్ర…ఇలా చాలా మంది తెలంగాణ పతాకాన్ని అర్ధంతరంగా వదిలేసి పోయారు. ఇన్ని భుజంగాలను దాటుకుని, ఏరులాగా మొదలైన ఉద్యమాన్ని నదిలాగా మార్చి తీర్చి, తెలంగాణ పతాకాన్ని ఢిల్లీ పురవీధుల్లో ఊరేగించిన ఘనత కేసీఆర్‌ది. భావజాల వ్యాప్తి, ఉద్యమవ్యాప్తి, రాజకీయ అస్తిత్వ కాంక్షలను కలబోసి, కలనేసి ఒక దివ్యాస్త్రంగా మలిచిన నాయకుడు కేసీఆర్. సీమాంధ్ర ఆధిపత్య శక్తులు ఐదున్నర దశాబ్దాలుగా తెలంగాణపై రుద్దిన అనేక మిథ్యలను బద్దలు కొట్టి, ప్రత్యామ్నాయ సాంస్కృతిక చిహ్నంగా తెలంగాణ తల్లిని ఆవిష్కరించి అందరినోళ్లూ మూయించారాయన. తెలంగాణవాద శక్తులన్నీ సంఘటితమై కాంగ్రెస్, టీడీపీ, తదితర రాజకీయ పక్షాల పునాదులను బద్దలు కొట్టకపోయి ఉంటే ఇవ్వాళ తెలంగాణ సాధ్యమయ్యేది కాదు. సాయుధ పోరాటాలకు గద్దె దిగనివాడు ఓటు ఆయుధంతో గద్దె దిగుతాడన్న ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలంగా నమ్మినవారు కేసీఆర్. సరిగ్గా ఈ సూత్రం ఆధారంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయ గరిమనాభిపై నిలబడి అన్ని రాజకీయ పక్షాలనూ తెలంగాణ నినాదానికి ఒప్పించారు. రాజకీయ విస్తృతాంగీకారాన్ని సాధించారు. తెలంగాణ సమాజంలో మునుపెన్నడూ లేని ప్రత్యేక రాష్ట్ర చైతన్యాన్ని నాటగలిగారు. స్వీయ రాజకీయ అస్తిత్వం లేకపోతే ఏమవుతుందో, సీమాంధ్ర నేతల నాయకత్వంలోని పార్టీలు ఎప్పుడు ఎలా ఎందుకు వ్యవహరిస్తాయో ప్రజలకు అర్థమయ్యేలా చాటిచెప్పగలిగారు. తెలంగాణ ఎవరు ఇచ్చినా ఎవరు తెచ్చినా ఇవ్వడానికి, తేవడానికి భూమికను రూపుదిద్దినవారు కేసీఆర్. తెలంగాణలో అన్ని పార్టీలూ, నాయకుల రాజకీయ భవిష్యత్తును తెలంగాణ రాష్ట్ర డిమాండుతో ముడివేసి, ఎవరూ ఇటూ అటూ కదలలేని స్థితిని తీసుకువచ్చారు. రాజకీయాలు, ఉద్యమాల మధ్య తులాదండం ఏదో ఒకవైపు జారిపోకుండా చెయ్యిపట్టుకుని నడిపించారాయన. వేయిపడగల శత్రు సర్పానికి చిక్కకుండా ప్రత్యేక రాష్ట్ర డిమాండును ఆశయాల తీరానికి చేర్చారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్రను చెప్పడమంటే ఇతరుల పాత్రను గుర్తించకపోవడం కాదు. మహాభారత యుద్ధం అర్జునుడొక్కడే గెలవలేదు. శ్రీకృష్ణుడు, భీముడు, అభిమన్యుడు, ద్రుష్టద్యుమ్నుడు…వీరంతా లేరా? యుధిష్ఠిర, నకుల, సహదేవులు లేరా? అందరూ పోరాడినవారే. కానీ అర్జునుడే ప్రధాన పాత్రధారి, శ్రీకృష్ణుడు సూత్రధారి. యుద్ధాన్ని అనేక మలుపులు తిప్పి, విజయానికి బాటలు వేసింది వారే. తెలంగాణ సాధన పోరాటంలో వీరంతా ఉన్నారు. కానీ ఎక్కడ మొదలయ్యామో, ఏయే మలుపులు తిరిగామో గుర్తుచేసుకోకపోతే అది చరిత్రకాదు. తెలంగాణ రాజకీయ, విద్యార్థి, ఉద్యోగ, కుల సంఘాల జేయేసీలు నిర్వహించిన పాత్ర శ్లాఘనీయమైనది. కొన్ని కారక శక్తులు, కొన్ని ప్రేరక శక్తులు. కొన్ని చోదక శక్తులు, మరికొన్ని సాధక శక్తులు- ఈ విజయం అందరిదీ.

Naresh Gadagani కథనం ఇది..

www.facebook.com/thovva

21, డిసెంబర్ 2013, శనివారం

కేసీఆర్ పార్టీని ఎందుకు విలీనం చేయడం లేదు ?

సమైక్యాంధ్ర అనకుండా తెలంగాణను అడ్డుకునేందుకు అన్ని రకాల విఫలయత్నాలు చేస్తున్న టీడీపీ అధినేత
చంద్రబాబు నాయుడు ఇప్పటి దాకా ఆ ఒక్క సమైక్యాంధ్ర అనే పదం ఎందుకు అనలేదు ? అంటే దాని వెనక పెద్ద లాజిక్కే ఉంది. కేసీఆర్ తీసుకునే నిర్ణయం మీద తన రాజకీయ పునాదులు నిలబెట్టుకునేందుకు చంద్రబాబు ఆరాటపడుతున్నాడు.

తెలంగాణ ఇస్తే బొంతపురుగును ముద్దాడుతాం..టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తాం అని కేసీఆర్ ఇది వరకే ప్రకటించాడు. అయితే కాంగ్రెస్ మీద అనుమానంతో ఆ విషయంలో కేసీఆర్ ఇప్పుడు తొందరపడడం లేదు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత మోత్కుపల్లి చేత కేసీఆర్ టీఆర్ఎస్ ను విలీనం చేయనందుకే తెలంగాణ ఆగిందని కొత్త రాగం అందుకున్నాడు. శాసనసభలో సీమాంధ్ర టీడీపీ నేతల చేత చర్చకు అడ్డుపడకుండా చేయించలేని తెలంగాణ టీడీపీ దద్దమ్మలు..కేసీఆర్ ను కాంగ్రెస్ లో పార్టీ విలీనం చేయాలని చచ్చు ..ఉచిత సలహాలు ఇచ్చారు. ఇదంతా బాబు సూచనల మేరకే అన్నది అందరికీ తెలిసిందే అనుకోండి.

అయితే అసలు బాబుకెందుకు కేసీఆర్ చింత అని అంటే..కేసీఆర్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే తెలంగాణలో బీజేపీతో పాటు మిగిలే పార్టీ టీడీపీ. ఈ పార్టీకి ఖమ్మంలో కొంచెం పట్టుంది. హైదరాబాద్ లో మహా అయితే ఈ సారి కొన్నిఓట్లు సాధిస్తుంది. మిగిలిన జిల్లాలలో మొండిచేయే మిగిలింది. అయితే కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం ప్రజలు చూడదలుచుకుంటే బీజేపీ - టీడీపీలు మిగులుతాయి. అందుకే బీజేపీతొ పొత్తు పెట్టుకుని తెలంగాణలో పోటీ చేయాలని బాబు ఆశ. టీఆర్ఎస్ అడ్డు తొలిగితే ఇప్పటికి కాకపోయినా భవిష్యత్ లో అయినా జనాలు అన్నీ మరిచిపోయి ఓటేస్తారని బాబు ఆశతో ఉన్నారు.

ఈ వ్యవహారం గమనించే తెలంగాణ పునర్నిర్మాణంలో టీఆర్ఎస్ పాత్ర ఎంతో మిగిలి ఉందని, ఇప్పటికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఏ మాత్రం పార్టీని విలీనం చేస్తే మూడేళ్లు తిరిగే సరికి కాంగ్రెస్ - టీడీపీ రెండూ కలిసి తెలంగాణను నాశనం చేస్తాయని అనుమానంగా ఉన్నాడు కేసీఆర్. పదేళ్లు తిరగకముందే తెలంగాణ విభజనతో ప్రయోజనం లేదని సీమాంధ్ర మీడియాతో కొత్త నాటకం ఆడించి తిరిగి విలీనం చేసినా ఆశ్చర్యం లేదు. కేసీఆర్ తన స్వప్రయోజనాల కొరకు తెలంగాణ డిమాండ్ తెచ్చాడని తప్పుడు ప్రచారం చేసేందుకు సీమాంధ్ర మీడియా మాఫియా ఎప్పుడూ సిద్దంగానే ఉంటుంది.

 అందుకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో నీళ్లు - నిధులు - ఉద్యోగాలు వంటి విషయంలో కీలక పాత్ర పోషించాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు. నవ తెలంగాణలో తెలంగాణ ప్రయోజనాల కొరకు టీఆర్ఎస్ పాత్ర లేకుంటే తెలంగాణ వచ్చినా కూడా ఉపయోగం ఉండదన్న అభిప్రాయంతోనే ఆయన విలీనం ఊసెత్తడం లేదు. అందుకే అవకాశవాద టీడీపీని బొందపెట్టి నవ తెలంగాణలో టీఆర్ఎస్ వెంట నడుద్దాం. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకుందాం.

జై తెలంగాణ ..జైజై తెలంగాణ

please like & share
www.facebook.com/thovva

14, డిసెంబర్ 2013, శనివారం

ఎందుకు రా కలిసుండాలె ..?

ఎందుకు రా కలిసుండాలె ..?

అన్యాయం జరుగుతుందని .. 60 ఏండ్ల సంది మొత్తుకుంటుంటె
ఒక్క నాయకుడన్న అయ్యో పాపం అన్నోడున్నడ ..అవహేళన చేసెటోడు తప్ప
మేమూ తోటి తెలుగోళ్లమే గదరా..మరి మమ్మల్నెందుకు తెలంగాణోళ్లను జేసిండ్రు


ఎందుకు రా కలిసుండాలె ...?

నీళ్లు లేక పొలాల బీళ్లు వెట్టి బతుకుదెరువుకు దేశంబొయ్యి బతుకుతుంటె
గంజి నీళ్లకు గతిలేక ఆకలి చావులతో అల్లాడుతుంటే ..ఒక్కడన్న ఓదార్చిండా ..సేదదీర్చిండా
మేమూ తోటి తెలుగోళ్లమే గదరా..మరి మమ్మల్నెందుకు తెలంగాణోళ్లను జేసిండ్రు

ఎందుకు రా కలిసుండాలె...?

12 ఏండ్ల సంది కేసీఆర్ తెలంగాణ కొరకు ఉద్యమిస్తుంటె
పదవి కోసమని పరాచికాలాడిండ్రు..తాగుబోతని తప్పుడు ప్రచారం జేసిండ్రు
దోచుకుంటున్నడని దొంగ ఆరోపణలు చేసిండ్రు ..కుటుంబం కొరకని కుట్రలు చేసిండ్రు

మీరు జేస్తె సంసారం ..మేము జేస్తే వ్యభిచారమా
చంద్రబాబు కుటుంబం అంత రాజకీయం జేస్తది
వైఎస్ కుటుంబం మొత్తం రాజకీయం జేస్తది
అదే తెలంగాణోడు జేస్తే కుటుంబ రాజకీయం
థూ... మీ బతుకులు జెడ..మీ కండ్లల్ల నిప్పులు వడ

ఆత్మగౌరవ జెండా ఎత్తుకున్న మా విధ్యార్థులు మీకు తాలిబన్లయినప్పుడు
ఆత్మబలిదానాలు జేసుకున్న మా పిల్లలు మీకు తోటి మనుషులుగా కనిపియ్యనప్పుడు
మా అస్థిత్వ పోరాటాన్ని మీరు అవహేళన చేసినప్పుడు ..ఎందుకు రా కలిసుండాలె ?

తెలంగాణ నిచ్చెన మీది నుండి అధికారం అందుకున్నోడు
ఎక్కిన నిచ్చెనను ఎన్కకు తన్నిండు..అయిదేండ్ల అధికారంతో ఆగం జెయ్య జూసిండు
నది దాటి నంధ్యాల కాడ ..ఆడి కోవాల్నంటే పాస్ పోర్ట్ గావాలె..వీసా గావాలె అని ఇషం గక్కిండు
అందుకే పాపం పండి యాడాది తిర్గక ముందే పాస్ పోర్ట్ లేకుంట పావురాల గుట్టకాడ పానమిడ్సిండు

నాలుగేండ్ల సంది వెయ్యి మంది మా పిల్లలు మంటల్ల గాలుతుంటె
మా జనం రోడ్ల మీదకు వచ్చి ఉద్యమాలు జేస్తుంటె
తెలుగువారం కలిసుందా అని కథలు జెప్తున్న ఒక్కడన్న
మాకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం జేసిండా
మా తరపున సర్కారుతోని లడాయికి దిగి ఇది తప్పు అని ప్రశ్నించిండా ..
నా అన్యాయాన్నే నువ్వు గుర్తించనప్పుడు నాకు అన్నవెట్లయితవు

కడుపుల లేనిది కావులించుకుంటె రాదు
ఇడుదల కాయితం సిద్దమయింది
ఇప్పటికయిన ఒప్పుకుని ఇజ్జత్ నిలవెట్టుకో

sandeepreddy kothapally

www.facebook.com/thovva

10, డిసెంబర్ 2013, మంగళవారం

మోక మీద కొచ్చినంక మొరాయిస్తున్న బాబు !

బాబు : ఆర్నెళ్లు ఫాంహౌజ్ లో పడుకునే కేసీఆర్ నన్ను విమర్శిస్తాడా ?

తెలంగాణ : నువ్వు గుడిసెలో పంతున్నవా ..గుడి ఎన్క పంతున్నవా..పండుకోనికె యాడైతె ఏంది పనికి మాలినోడ

 బాబు : నీళ్లొస్తాయని..ప్రతి కుటుంబానికి మూడు ఎకరాల భూమిస్తానని చెప్పడం తప్ప కేసీఆర్ ఏం చేశాడు ?

తెలంగాణ : తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి మీరేం పగలదీశారో.. 1999ల బీజేపీని పుణ్యాన అధికారం దక్కించుకున్నావ్..ఆనక ఎన్టీఆర్ కు పొడిసినట్లే బీజేపీకి వెన్నుపోటు పొడిచావ్. ఓ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఈ రాష్ట్రం విభజన జరగితే ఎలా ఉండాలి అన్న ఆలోచన లేకుండా తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చావా ? విజన్ 20-20 అని కారు కూతలు కూయడం కాదు. మాట్లాడే మాటలకు రీజన్ కూడా ఉండాలి

బాబు : నేను ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగువారిని కాపాడేందుకు వెళ్లా !

తెలంగాణ : పక్కనున్న తెలంగాణ వారిని కాపాడలేవు.. వారి ఆకాంక్షలను గౌరవించలేవు గానీ అక్కడికెళ్లి సొల్లు మాటలు చెబుతున్నావా

బాబు : బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసే కేసీఆర్ నన్ను బెదిరిస్తాడా ?

తెలంగాణ : వసూలు చేయడం చూశావా ? ఆధారాలుంటే బయటపెట్టు. నీ కారుకూతలు రాసే పేపర్లున్నాయని రెచ్చిపోకు ..అవి అచ్చయి చరిత్రలో నిలుస్తాయని గుర్తు పెట్టుకో

బాబు : తెలుగు ప్రజలను కలవకుండా విషబీజాలు నాటారు. రెండు వైపులా జనాలను రెచ్చగొట్టి విభజన చేస్తున్నారు

తెలంగాణ : మరి ఈ విష బీజాలను తొలగించడానికి నీవు చేసిన ప్రయత్నాలు ఏంటో ? చెప్పలేదు. విషబీజాలు వేసిన టీఆర్ఎస్ తో 2009లో ఎందుకు పొత్తు పెట్టుకున్నావ్ ? ఆ తరువాత తెలంగాణ తేల్చాలని కేంద్రానికి ఎందుకు లేఖ రాశావ్ ? అఖిలపక్షం పెట్టాలని ఎందుకు ప్రధానికి లేఖ రాశావ్ ?

ఈ ఆంధ్రబాబుల రుబాబులు మనకు కొత్తేం కాదు.. మోక మీదకు వచ్చినంక చంద్రబాబు మొరాయిస్తున్నడు. నిన్నటిదాంక నిమ్మలంగ ఉన్న చంద్రబాబు ఈ మూడు రోజుల నుండే ఎందుకు ఎగిరెగిరి పడ్తున్నడు.  1969 మాదిరే తెలంగాణను అడ్డుకుని తెరమరుగు చేయాలని కుట్రలకు తెరలేపారు. అన్ని పార్టీలు ఏకమయ్యి అడ్డుకోవాలని ఆరాటపడ్తుండ్రు. కానీ ఇది ఎడ్డి తెలంగాణ కాదు..ఇప్పుడు ఆగే ముచ్చట లేదు.

కుట్రలను చేధిద్దాం ... తెలంగాణ సాధిద్దాం

please like this page

www.facebook.com/thovva 

బాబు లత్కోరు..జగన్ శకం అంతం : కేసీఆర్

కేసీఆర్ కు ప్రధాని పదవి ఇచ్చినా సరే.. నాకు కావాల్సింది తెలంగాణ రాష్ట్రం 

తెలంగాణ బిల్లు చాలా సులభమయింది
55 మంది పార్లమెంటుకు హాజరై 
28 మంది మద్దతు పలికినా తెలంగాణ బిల్లు పాసవుతుంది

చంద్రబాబు ఓ లత్కోరు మనిషి
సీమాంధ్ర పాలకులు చేసిన తప్పుల మూలంగానే
తెలంగాణ ఈ రోజు విడిపోతుంది
విడిపోయినా కలిసుందాం
ప్రజల మధ్య విద్వేషాలు పెంచొద్దు


సన్నాసుల్లారా ..టీడీపీ,జగన్ పార్టీల లో కొనసాగడం అనైతికం
ఇప్పటికన్నా బానిస ..భాంచగిరి చేయడం మాని రోషముంటే బయటకు రండి
తెలంగాణ ఆపడం ఎవరి తరం కూడా కాదు
తెలంగాణ ప్రజలు విడిపోవాలంటే కలిసుందామనడం అవివేకం
తెలంగాణ జగన్ పార్టీ శకం ముగిసింది
ఇప్పుడు సీమాంధ్ర నేతలు చేస్తున్న ఇలాంటి పనులు
అప్పట్లో చేసినందుకే రాజాజీ మద్రాసు నుండి వెళ్లగొట్టారు
జగన్ పార్టీల ఇంకా ఉన్నోళ్లు కన్నతల్లికి కొరివి పెట్టినట్లే
చంద్రబాబు ఇంకా విషం కక్కుతూనే ఉన్నాడు
తెలంగాణ ప్రజల మనసెరిగి మెలగాలి

please like page

www.facebook.com/thovva

9, డిసెంబర్ 2013, సోమవారం

చంద్రబాబు చెల్లని నోటు !

2009 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ గురించి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎల్లారెడ్డి ఎన్నికల సభలో
ఓ ప్రశ్న వేశారు. "కామారెడ్డిల చెల్లని రూపాయి ఎల్లారెడ్డిల చెల్తదా ? అని జనాన్ని ప్రశ్నించారు. చెల్లని రూపాయి ఎక్కడయినా చెల్లదు" అని జనం సమాధానం ఇచ్చారు.

కేసీఆర్ చెప్పినదానికి జర్రంత ఎక్వ తక్వ కాకుంట ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నడు. తెలంగాణ ఓట్ల కోసం కేంద్రానికి లేఖ ఇచ్చి 2009ల టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ..ఈనాడు పేపరు రాసిన రాతలు జూసి ఆ పొత్తుకు పురిట్లనే సంధికొట్టిండు. వైఎస్ అధికారం వచ్చినంక టీఆర్ఎస్ పార్టీని గల్లంతు చేయాలని ప్రయత్నిస్తే..చంద్రబాబు అంతకుముందే ఆ పనికి ప్రయత్నించి విఫలమయ్యాడు. 46 స్థానాలలో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని 33 స్థానాలలో తన పార్టీ నేతలతో నామినేషన్లు వేయించి చివరి సమయంలో బీ ఫాంలు ఇచ్చి టీఆర్ఎస్ విజయాలను అడ్డుకున్నాడు. టీడీపీ అభ్యర్థులను టీఆర్ఎస్ గెలిపిస్తే..టీఆర్ఎస్ కు బాబు వెన్నుపోటు పొడిచి అధికారానికి దూరమయ్యాడు.

ఇక 2009లో కేసీఆర్ ఆమరణ దీక్ష సమయంలో అఖిలపక్షం పెడితే తెలంగాణ మీద వెంటనే అసేంబ్లీ ఏర్పాటు చేసి తీర్మానం చేస్తారా ? లేదా ? తీర్మానం మీరు పెడతారా ? లేక మమ్మల్ని పెట్టమంటారా ? అని బీరాలు పలికాడు. తీరా 2009 డిసెంబరు 9న తెలంగాణ ప్రకటన రాగానే 10 వ తేదీన అడ్డంతిరిగి అసలు తెలంగాణ ఎలా ఇస్తారు ? ఇంత పెద్ద నిర్ణయం రాత్రికి రాత్రే తీసుకుంటారా ? అని మొరాయించాడు. చంద్రబాబు పుణ్యం..సీమాంధ్ర నేతల మోసం ఫలితంగా  వేలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాలు చేశారు.

ఇక ఆ తరువాత 2011 ఉప ఎన్నికలల్ల బాబ్లీ నాటకం ఆడి చంద్రబాబు మహారాష్ట్రల పోయి కూసున్న తెలంగాణ జనం ఎక్కడా కనీసం టీడీపీ డిపాజిట్ దక్కనివ్వలేదు. ఆ తరువాత గత ఏడాది పాదయాత్ర జేస్తున్న అని తెలంగాణ మీద కేంద్రం అఖిలపక్షం పెట్టాలని ప్రధానికి లేఖ రాసిండు. అఖిలపక్షంలో అడ్డదిడ్డంగ లేఖ ఇచ్చాడు. ఇన్నేళ్ల ఉద్యమం ఫలితంగా జులై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకున్న వెంటనే చంద్రబాబు నాయుడు సీమాంధ్ర రాజధానికి రూ.4.5 లక్షల కోట్లు నిధులడిగాడు. ఆ మరుసటి రోజు నుండి సమన్యాయం.. ఆ తరువాత ఇద్దరు కొడుకుల సిద్దాంతం.. ఆ తరువాత ఢిల్లీ దీక్ష..తాజాగా కొబ్బరికాయల సిద్దాంతం అని దిక్కు మాలిన వాదన చేస్తూ తెలంగాణ వ్యతిరేక వాదన చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు ఉన్న కాస్త సిగ్గునూ పక్కన పెట్టి అసలు రాజధాని ఉన్న ప్రాంతం ఎక్కడయినా రాష్ట్రంగా విడిపోయిందా ? అడ్డగోలు విభజనకు అంగీకరించాలా ? సీమాంధ్ర రాజధాని అడవిలో పెట్టుకోవాలా ? అని ప్రశ్నలు వేస్తున్నాడు.

పూటకో మాటతో తెలంగాణ - సీమాంధ్రలో ఎక్కడా మొహం చెల్లని చంద్రబాబు నాయుడు బీజేపీ అధిష్టానం అయినా కరుణిస్తే ఈ సారి గట్టుక్కుతానా ? అని ఆలోచనల్లో పడ్డాడు. అరవింద్ కేజ్రివాల్ విజయాన్ని అబ్బో అని పొగుడుతున్నాడు. ఢిల్లీల ఉన్న కేజ్రివాల్ కూడా తెలంగాణ ఉద్యమానికి నిజాయితీగా మద్దతు తెలిపాడు. కానీ ఈ రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించిన నీకు ఓ స్పష్టమయిన వైఖరి లేకపోవడం ఇక్కడి ప్రజలంతా చేసుకున్న దౌర్భాగ్యం.

please like & share this page

www.facebook.com/thovva

8, డిసెంబర్ 2013, ఆదివారం

నిండుకుండ తొణకదు..ఎంగిలిస్తరాకులు ఎగిరెగిరి పడ్తయి

నిండు కుండ తొణకదు (KCR).. ఎంగిలి ఇస్తరాకులు ఎగిరెగిరి పడుతున్నయి (ఎవ్వలో నేం జెప్ప)


కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ మీద నిర్ణయం తీసుకున్నప్పటి నుండి 13 ఏండ్ల సంది ఉద్యమం చేస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. ఇన్నేండ్ల ఉద్య మంల ఎన్నో రాజీనామాలు..అవమానాలు, ఆరోపణలు, అణచివేసే కుట్రలు, టీఆర్ఎస్ ను తెరమరుగు చేసే ప్రయత్నాలు..తెలంగాణోడు..ఆంధ్రోడు అందరు గలిసి కేసీఆర్ ను ఎన్ని తిప్పలు వెట్టాల్నో అన్ని వెట్టిండ్రు. ఒక రాజకీయ పార్టీ నేత మీద ఎన్ని విధాల దాడులు జరగకూడదో అన్ని విధాల దాడి కేసీఆర్ మీద జరిగింది. సీమాంధ్ర మీడియా కేసీఆర్ వ్యక్తిగత జీవితం మీద కూడా దాడి చేసింది. విలువల గురించి మాట్లాడే మేధావులు కేసీఆర్ విషయంలో వలువలు విడిచి రాస్తున్న మీడియా రాతలను ఖండించిన పాపాన పోలేదు. తెలంగాణ, టీఆర్ఎస్, కేసీఆర్ విషయంలో ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా ఓ మాఫియాలా వ్యతిరేకంగా పనిచేసింది. పని చేస్తూనే ఉంది. తెలంగాణకు అనుకూల సంకేతాలు వచ్చిన ప్రతిసారి ఈ మాఫియా రెచ్చిపోయి అడ్డుకునే, గందరగోళంలోకి నెట్టే ప్రయత్నాలు చేస్తుంది. ఇన్నేళ్లు అన్నింటినీ తట్టుకుని ముందుకు సాగిన కేసీఆర్ గత మూడు నెలలుగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తున్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేదాకా అప్రమత్తంగా ఉందాం అని తెలంగాణ సమాజాన్ని జాగృతం చేస్తున్నారు. సంబరాలైనా..సమావేశాలయినా ఆ తరువాతనే అని చెబుతున్నారు.

ఎంగిలి ఇస్తరాకులు ఎగిరెగిరి పడుతున్నయి

తెలంగాణ గురించి నిన్నటి మాట్లాడనోడు.. పొయ్యిల వన్పోడు..ఎగతాళి జేసినోడు..ఎక్కిరించినోడు..అడిగిన విద్యార్థులను అడ్డంబడి తన్నినోడు.. తెలంగాణ ఎందుకని మీడియా సాక్షిగా ప్రశ్నించినోడు..అసలు కేసీఆర్ ఎవరు ? అన్నోడు ..ఆయన బలమెంత అని బీరాలు వొయ్యినోడు..ఇచ్చేటోళ్లు..తెచ్చెటోళ్లు ..మద్దతిచ్చె టోళ్లు అందరు ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. మేమే ముందట్కి వడి తెచ్చినవని తెగ ఫీలయితున్నరు. తెలంగాణ వచ్చిందా...అది ఇవ్వక తప్పని పరిస్థితి కేసీఆర్, తెలంగాణ సమాజం ఈ పార్టీలకు సృష్టించిండ్రా అన్నది అందర్కి ఎర్కనే..ఇక ఎంగిలిస్తారాకులు ఎవరో గుడ్క మీకే తెల్సు నేం జెప్పాల్సిన పనిలేదు.

please like & share this page

www.facebook.com/thovva


సందీప్ రెడ్డి కొత్తపల్లి

7, డిసెంబర్ 2013, శనివారం

మారనంటున్న కిరణ్ ..మారాం చేస్తున్న చంద్రబాబు..జగన్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిన తరువాత కూడా సీల్డ్ కవర్ సీఎం కిరణ్, మాజీ ముఖ్యమంత్రి, రెండు కళ్ల చంద్రబాబులు మారడం లేదు. ఇంకా చెల్లిపోయిన సమైక్య సొల్లును కిరణ్ సొల్లుతూనే ఉన్నాడు. అసేంబ్లీలో తెలంగాణ బిల్లును ఓడిస్తానని రంకెలు వేస్తున్నడు. అసలు అసేంబ్లీల తెలంగాణ బిల్లు గురించి చర్చ జరుగుతుంది గానీ ఓటింగ్ ఏమీ జరగదు. జరిగినా దానిని పరిగణనలోకి తీసుకోరు. ఈ విషయం తెలిసి గుడ్క వాగుతున్న కిరణ్ సీమాంధ్ర జనం చెవిల పువ్వులు పెడుతుంటే ఎంపీ లగడపాటి పక్కనుండి చప్పట్లు కొడ్తున్నడు. కూట్ల రాయి తియ్యలేనోడు ఏట్ల రాయి తీస్తడా అని రాజీనామా జెయ్యనీకే ధైర్యంలేని ముఖ్యమంత్రి తెలంగాణను అడ్డుకుంటా అని పోజులు గొడ్తుండు. తాన్దూరనే సందులేని కిరణ్ మెడకో డోలు లగడపాటిని తగిలిచ్చుకున్నడు. సన్నాసి సన్నాసి రాసుకుంటె బూడిద రాలిందని ..ఈల్లు ఈసారి మళ్ల గెల్చె మొఖాలె గావు గానీ లేని సమైక్యాంధ్ర గురించి తెగ పీలయితున్నరు.

ఇక తెలంగాణనా ? సమైక్యాంధ్రనా ఏ సంగతి ఇంగా తెల్సుకోలేక తిప్పలు వడుతున్న చంద్రబాబు ఆరునెలలు అధికారం ఇస్తే ఏందనేది తేల్చుకోని ఆ తరువాత సమన్యాయం ఎట్ల చేయాలెనో ఆలోచించి.. ఆ తరువాత కొబ్బరికాయ సమంగ పల్గదీసి.. ఉన్నది ఒక్కడే కొడుకు గావట్క ఇద్దరు పిల్లలున్నోళ్ల ఇండ్ల సుట్టు తిర్గి. ఆళ్లకు ఏ పిల్ల ఇష్టమో తెల్సుకోని .. ఆ తరువాత చిత్తూరు నుంచి ఆదిలవాద్ కు .... రంగారెడ్డి నుండి శ్రీకాకుళానికి పాదయాత్ర జేసి ఆంధ్ర ప్రదేశ్ ఎంత పొడుగు ..ఎంత ఎడెల్పు ఉందో తన అడుగులతోనే లెక్క గట్కోని అప్పుడు ఓ దినం మేస్త్రీలను పిల్సుకోనొచ్చి దారం పట్టించి తెలంగాణ - ఆంధ్ర ఇబజిస్తడట. మనిషికో మాట ..గొడ్డుకో దెబ్బ అని అంటరు. చంద్రబాబు కు మాటలు, దెబ్బలు ఏవి గుడ్క పనిజేసెటట్లు లేదు.

ఇగ అయ్యకు అధికార మొచ్చిన తర్వాత ఎల్గుల కొచ్చిన కడప చిన్రాయుడు జగన్ బాబు సమైక్యాంధ్ర సమైక్యాంధ్ర అని దేశవంత తిరిగి చెప్తున్నడు. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ, అధికార పక్షం యూపీఏ రెండు గుడ తెలంగాణ బిల్లుకు సై అన్నంక తెలంగాణ ఎట్ల ఆగుతదో ఈ చిన్రాయునికె తెల్వాలె. తండ్రి అధికారంల ఉంటెనే కోట్లు ముల్లె గట్టినోడు ..చేతికి అధికార దొరికితె చెరబట్టుడు ఖాయం. మొన్న తుపాను వచ్చిందని రైతులను కల్వనీకె వొయ్యి మైకుల మాట్లాడనీకె మడికెట్లల్ల సెక్యూరిటీ కానిస్టేబుల్ ను వంగవెట్టిండు జగన్. ఇసోంటోనికి గిట్ల సీమాంధ్ర జనం ఓట్లేస్తె జనం అందరినీ ఒంగవెట్టుడు ఖాయం.

ఇసవంటి నేతలతోని సీమాంధ్ర జనం ఎట్ల ముందలవడ్తరో .. ఏమో ..ఈళ్లను దేవుడే కాపాడాలె

sandeepreddy kothapally

please like & share

www.facebook.com/thovva 

6, డిసెంబర్ 2013, శుక్రవారం

ఎవరి అమ్మ ? ఎక్కడి అమ్మ ? ఎందుకు అమ్మ ?

ఎవరి అమ్మ ? ఎక్కడి అమ్మ ? ఎందుకు అమ్మ ?

తెలంగాణ ఇచ్చినంతట్లనే పొయ్యిన పిల్లలు తిరిగొస్తరా ?
సచ్చిన పానాలు లేచొస్తయా ? తల్లుల కడుపుకోత సల్లార్తదా ?
1300 మంది అమరుల ఉసురు కొట్టుకుపోతదా ?

ఇచ్చిన తెలంగాణను ఎన్కకు తీసుకోని
ఇగురం లేని కొడుకుల మాటలు వట్టుకోని
నాలుగేండ్ల సంది పిల్లల పానాలతోని ఆడుకోని

తెలంగాణ ఉద్యమాన్ని అన్గదొక్కనీకే
అవసరమయిన అన్ని ప్రయోగాలు జేసి
ఆఖర్కి ఇక ఇయ్యక తప్పదని తెల్సుకోని
ఇయ్యాల తెలంగాణ ఇచ్చింది

లేని పంచాయితి పెట్టొద్దు
అమ్మ మన అమ్మ కానే కాదు
అమ్మ మనకు ఎప్పటికీ సవతి తల్లె
సీమాంధ్ర పెట్టుబడిదారుల నుండి ఓట్లు రాలవన్న
పరిస్థితి తెలుసుకున్న తరువాతనే
తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని అందరూ గుర్తవెట్టుకోవాలె

తెలంగాణ
నిఖార్సయిన
నిజాయితీ గల ఉద్యమం

ఇలాంటి ఉద్యమాలకు ఏ అమ్మయినా సలాం కొట్టాల్సిందే
అమరుల తల్లులకు తప్ప ఏ అమ్మకు తెలంగాణ సలాం కొట్టదు..కొట్టకూడదు

please like & share

www.facebook.com/thovva 

5, డిసెంబర్ 2013, గురువారం

తెలంగాణకు ఇక రెండడుగుల దూరంలో ..!

అమరుల త్యాగాలు..విద్యార్థులు, ఉద్యోగుల పోరాటం..సమస్త తెలంగాణ ప్రజల సహకారం. మొత్తానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంకంలో ఒక కీలకఘట్టం పూర్తి చేసుకుంది. సీమాంధ్ర పెట్టుబడిదారుల కుట్రలను ఛేధించుకుని కేంద్ర క్యాబినెట్ ఆమోదం దక్కించుకుంది. ఎన్నో బలిదానాలు.. ఎందరికో కడుపుకోత.. లాఠీఛార్జీలు, రబ్బరు బుల్లెట్లు..భాష్పవాయువు గోళాలు. తెలంగాణ అంతా పోలీసు పదఘట్టనల కింద నలిగిపోయింది. దెబ్బ తగిలిన ప్రతిసారి రెట్టింపు వేగంతో ఉద్యమంలోకి తెలంగాణ జనం వచ్చేశారు.

ప్రపంచ చరిత్రలో ఇంత సుధీర్ఘంగా సాగిన ఉద్యమం ఈ మధ్య కాలంలో ఏదీ లేదు. భవిష్యత్ లో ఏదీ ఉండదు కూడా. స్వాతంత్ర పోరాటం తరువాత అంత సుధీర్ఘంగా సాగింది. ఉద్యమాన్ని అణచివేసే క్రమంలో సీమాంధ్ర పెట్టుబడిదారులు, వారి అడుగులకు మడుగులొత్తే మీడియా వ్యవస్థ తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ ఉద్యమ నాయకత్వం, తెలంగాణ ఏర్పడితే వచ్చే సమస్యల మీద చేసిన యాగీ అంతా ఇంతా కాదు. తెలంగాణ ఉద్యమ నాయకత్వానికి తెలంగాణ ప్రజల అండలేకుండా చేసేందుకు వారి వ్యక్తిగత జీవితం మీద కూడా కావాల్సినంత బురద చల్లాయి. ఎన్ని నిందలు పడ్డా..ఎంత అణగదొక్కాలని చూసినా నిఖార్సయినా ..నిజాయితీ గల తెలంగాణ ఉద్యమం ఎక్కడా ఉలిక్కిపడలేదు.

2009 ప్రకటన వెనక్కి తీసుకున్న తరువాత నాలుగేళ్లుగా తెలంగాణ విరామం లేని పోరాటం చేసింది. ఎందరో బిడ్డలు బలిదానాలు చేశారు. శ్రీకాంత చారితో మొదలయిన బలిదానాలు ..నిన్న రాయల తెలంగాణ అన్న వార్తల వరకు కొనసాగాయి. ఎన్ని సార్లు విజ్ఞప్తులు చేసినా సీమాంధ్ర విషపు మీడియా వార్తలు చదివి తెలంగాణ బిడ్డలు ఆందోళనతో ఆత్మహత్యలు చేసుకోవడం మాత్రం ఆపలేదు. తెలంగాణకు క్యాబినెట్ ఆమోదం వచ్చిన ఇప్పటి నుండి అయినా తెలంగాణ బిడ్డలు గుండెదిటవు చేసుకుని వచ్చే తెలంగాణలో బంగారు భవిష్యత్ ను చూసుకోవాలని కోరుకుందాం. ఇక బిల్లు రాష్ట్రపతికి వెళ్లిన నేపథ్యంలో అది అక్కడి నుండి అసేంబ్లీకి రావడం..తిరిగి పార్లమెంటుకు వెళ్లి ఆమోదం పొందడం అనే రెండు అడుగులు మిగిలి ఉన్నాయి. అప్పటి వరకు అప్రమత్తంగా ఉందాం. తెలంగాణ సాధించుకుందాం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో అమరుల ఆశయాలను సాధిద్దాం..జయశంకర్ సార్ లక్ష్యాలను చేరుకుందాం

జై తెలంగాణ

మీ సందీప్ రెడ్డి కొత్తపల్లి