మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై నల్లగొండ పోలీసులు 309 సెక్షన్‌కింద ఆత్మహత్యయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసు నల్లగొండ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదయ్యింది. అయితే తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ప్రభుత్వం ఆత్మహత్యాయత్నం కేసుపెట్టడాన్ని టీఆర్‌ఎస్ శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు ఖండించాడు.
ఇంత దుర్మార్గపు చర్యకు పాల్పడిన ప్రభుత్వంలో హోంమంత్రిగా తెలంగాణ ఆడబిడ్డ సబితా ఇంద్రారెడ్డి పని చేయడం తగదన్నారు. ఉద్యమంలో ఉన్నామనే తెలంగాణ మంత్రులు జానారెడ్డి, తదితరులు ఈ కేసు విషయమై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రులకు తెలియకుండా నిర్ణయాలు తిసుకునే ప్రభుత్వంలో పనిచేయడం సిగ్గు చేటని ఎద్దేవా చేశారు. ప్రజాసామ్యాన్ని ఈ ప్రభుత్వం పోలీసు రాజ్యంగా మార్చిందని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహారదీక్ష ఏడోరోజుకు చేరుకుంది. కోమటిరెడ్డి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుంది. ఉపిరితిత్తులలో ఇన్‌ఫెక్షన్ సోకడంతో పరిస్థితి విషమంగా ఉంది. మూత్ర పిండాల నొప్పితో బాధ పడుతున్నారు. పొటాషియం లెవల్స్ దారుణంగా పడిపోయాయి.
కోమటిరెడ్డి వెంకటరెడ్డిని జగిత్యాల మాజీ శాసన సభ్యుడు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి నిమ్స్ ఆసుపత్రిలో పరామర్శంచారు. కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణ వల్లే కోమటిరెడ్డి దీక్ష చేపట్టారని అన్నారు. తెగించి కొట్లడితేనే తెలంగాణ వస్తుందని జీవన్‌రెడ్డి అన్నారు. నిమ్స్‌లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పరామర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్ 9 ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి మేనేజ్‌మెంట్‌లో తెలంగాణ కాంగ్రేస్ నేతలు పడవద్దని సూచించారు
నిరాహార దీక్ష నాటకం ఆడినందుకు లగడపాటిపై కేస్ ఎందుకు పెట్టలేదు? అది నాటకం అని తెలుసుకోవడానికి అతను హాస్పిటల్‌లో చేసిన జాగింగ్ దృశ్యాలు చూడక్కరలేదు. చికిత్స చేసే ముందు తీసిన రక్తంలోని సుగర్ పరీక్ష యొక్క రిపోర్ట్‌లు చూసినా తెలిసిపోతుంది. రక్తంలో సుగర్ ఎంతుందో తెలియకుండా నిరాహార దీక్ష చేసిన వ్యక్తికి చికిత్స చెయ్యరు కదా. ఆ సమైక్యవాద డాక్టర్లకి అది నాటకం అని తెలిసినా బయటపెట్టలేదు. తెలిసిన తరువాత పోలీసులు అరెస్ట్ చెయ్యలేదు. ఇది సమైక్యవాదుల నిజాయితీ.
రిప్లయితొలగించండి