తెలంగాణపై ఏకాభిప్రాయ సాధన కోసం కృషి చేస్తున్నామని, అంతకంటే ముందు తెలంగాణలో
శాంతియుత వాతావరణం ఏర్పడాలని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. శనివారం మాల్దీవుల నుండి తిరిగివస్తూ ఆయన ప్రత్యేక విమానంలో మీడియాతో మాట్లాడారు. ”తెలంగాణ చాలా సంక్లిష్టమైన సమస్య. ఏకాభిప్రాయం రావాలని మేం కోరుకుంటున్నాం. అన్ని ప్రాంతాల ప్రజలు ఈ పరిష్కారం అత్యుత్తమమని భావించేలా వుండాలనుకుంటున్నాం. కేవలం తెలంగాణ ఇస్తామని అంగీకరించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించలేం. ఎందుకంటే ఇతర ప్రాంతాల్లో కల్లోలానికి, అశాంతికి దారి తీస్తుంది.” అని ప్రధాని పేర్కొన్నారు.
తెలంగాణపై కేంద్రం ఏం ఆలోచిస్తున్నదని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. ఈ సమస్యకు తగిన పరిష్కారం కోసం, అన్ని ప్రాంతాల వారికి ఆమోదయోగ్యంగా వుండేలా ఆచరణాత్మక పద్ధతులు, మార్గాలను అన్వేషించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మొత్తానికి మన్మోహన్ మాటలు చూస్తే కాంగ్రెస్ తెలంగాణ సమస్యను నానబెట్టేందుకే సిద్దమయిందని, సీమాంధ్ర పెట్టుబడిదారులు కేంద్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ అధిష్టానాన్ని బాగానే మేనేజ్ చేస్తున్నారని తేలిపోయింది.
alaa cheste congress ku puttagatulundav...ika yuddame...
రిప్లయితొలగించండి