2009 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ గురించి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎల్లారెడ్డి ఎన్నికల సభలో
ఓ ప్రశ్న వేశారు. "కామారెడ్డిల చెల్లని రూపాయి ఎల్లారెడ్డిల చెల్తదా ? అని జనాన్ని ప్రశ్నించారు. చెల్లని రూపాయి ఎక్కడయినా చెల్లదు" అని జనం సమాధానం ఇచ్చారు.
కేసీఆర్ చెప్పినదానికి జర్రంత ఎక్వ తక్వ కాకుంట ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నడు. తెలంగాణ ఓట్ల కోసం కేంద్రానికి లేఖ ఇచ్చి 2009ల టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ..ఈనాడు పేపరు రాసిన రాతలు జూసి ఆ పొత్తుకు పురిట్లనే సంధికొట్టిండు. వైఎస్ అధికారం వచ్చినంక టీఆర్ఎస్ పార్టీని గల్లంతు చేయాలని ప్రయత్నిస్తే..చంద్రబాబు అంతకుముందే ఆ పనికి ప్రయత్నించి విఫలమయ్యాడు. 46 స్థానాలలో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని 33 స్థానాలలో తన పార్టీ నేతలతో నామినేషన్లు వేయించి చివరి సమయంలో బీ ఫాంలు ఇచ్చి టీఆర్ఎస్ విజయాలను అడ్డుకున్నాడు. టీడీపీ అభ్యర్థులను టీఆర్ఎస్ గెలిపిస్తే..టీఆర్ఎస్ కు బాబు వెన్నుపోటు పొడిచి అధికారానికి దూరమయ్యాడు.
ఇక 2009లో కేసీఆర్ ఆమరణ దీక్ష సమయంలో అఖిలపక్షం పెడితే తెలంగాణ మీద వెంటనే అసేంబ్లీ ఏర్పాటు చేసి తీర్మానం చేస్తారా ? లేదా ? తీర్మానం మీరు పెడతారా ? లేక మమ్మల్ని పెట్టమంటారా ? అని బీరాలు పలికాడు. తీరా 2009 డిసెంబరు 9న తెలంగాణ ప్రకటన రాగానే 10 వ తేదీన అడ్డంతిరిగి అసలు తెలంగాణ ఎలా ఇస్తారు ? ఇంత పెద్ద నిర్ణయం రాత్రికి రాత్రే తీసుకుంటారా ? అని మొరాయించాడు. చంద్రబాబు పుణ్యం..సీమాంధ్ర నేతల మోసం ఫలితంగా వేలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాలు చేశారు.
ఇక ఆ తరువాత 2011 ఉప ఎన్నికలల్ల బాబ్లీ నాటకం ఆడి చంద్రబాబు మహారాష్ట్రల పోయి కూసున్న తెలంగాణ జనం ఎక్కడా కనీసం టీడీపీ డిపాజిట్ దక్కనివ్వలేదు. ఆ తరువాత గత ఏడాది పాదయాత్ర జేస్తున్న అని తెలంగాణ మీద కేంద్రం అఖిలపక్షం పెట్టాలని ప్రధానికి లేఖ రాసిండు. అఖిలపక్షంలో అడ్డదిడ్డంగ లేఖ ఇచ్చాడు. ఇన్నేళ్ల ఉద్యమం ఫలితంగా జులై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకున్న వెంటనే చంద్రబాబు నాయుడు సీమాంధ్ర రాజధానికి రూ.4.5 లక్షల కోట్లు నిధులడిగాడు. ఆ మరుసటి రోజు నుండి సమన్యాయం.. ఆ తరువాత ఇద్దరు కొడుకుల సిద్దాంతం.. ఆ తరువాత ఢిల్లీ దీక్ష..తాజాగా కొబ్బరికాయల సిద్దాంతం అని దిక్కు మాలిన వాదన చేస్తూ తెలంగాణ వ్యతిరేక వాదన చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు ఉన్న కాస్త సిగ్గునూ పక్కన పెట్టి అసలు రాజధాని ఉన్న ప్రాంతం ఎక్కడయినా రాష్ట్రంగా విడిపోయిందా ? అడ్డగోలు విభజనకు అంగీకరించాలా ? సీమాంధ్ర రాజధాని అడవిలో పెట్టుకోవాలా ? అని ప్రశ్నలు వేస్తున్నాడు.
పూటకో మాటతో తెలంగాణ - సీమాంధ్రలో ఎక్కడా మొహం చెల్లని చంద్రబాబు నాయుడు బీజేపీ అధిష్టానం అయినా కరుణిస్తే ఈ సారి గట్టుక్కుతానా ? అని ఆలోచనల్లో పడ్డాడు. అరవింద్ కేజ్రివాల్ విజయాన్ని అబ్బో అని పొగుడుతున్నాడు. ఢిల్లీల ఉన్న కేజ్రివాల్ కూడా తెలంగాణ ఉద్యమానికి నిజాయితీగా మద్దతు తెలిపాడు. కానీ ఈ రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించిన నీకు ఓ స్పష్టమయిన వైఖరి లేకపోవడం ఇక్కడి ప్రజలంతా చేసుకున్న దౌర్భాగ్యం.
please like & share this page
www.facebook.com/thovva

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి