10, డిసెంబర్ 2013, మంగళవారం

మోక మీద కొచ్చినంక మొరాయిస్తున్న బాబు !

బాబు : ఆర్నెళ్లు ఫాంహౌజ్ లో పడుకునే కేసీఆర్ నన్ను విమర్శిస్తాడా ?

తెలంగాణ : నువ్వు గుడిసెలో పంతున్నవా ..గుడి ఎన్క పంతున్నవా..పండుకోనికె యాడైతె ఏంది పనికి మాలినోడ

 బాబు : నీళ్లొస్తాయని..ప్రతి కుటుంబానికి మూడు ఎకరాల భూమిస్తానని చెప్పడం తప్ప కేసీఆర్ ఏం చేశాడు ?

తెలంగాణ : తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి మీరేం పగలదీశారో.. 1999ల బీజేపీని పుణ్యాన అధికారం దక్కించుకున్నావ్..ఆనక ఎన్టీఆర్ కు పొడిసినట్లే బీజేపీకి వెన్నుపోటు పొడిచావ్. ఓ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఈ రాష్ట్రం విభజన జరగితే ఎలా ఉండాలి అన్న ఆలోచన లేకుండా తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చావా ? విజన్ 20-20 అని కారు కూతలు కూయడం కాదు. మాట్లాడే మాటలకు రీజన్ కూడా ఉండాలి

బాబు : నేను ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగువారిని కాపాడేందుకు వెళ్లా !

తెలంగాణ : పక్కనున్న తెలంగాణ వారిని కాపాడలేవు.. వారి ఆకాంక్షలను గౌరవించలేవు గానీ అక్కడికెళ్లి సొల్లు మాటలు చెబుతున్నావా

బాబు : బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసే కేసీఆర్ నన్ను బెదిరిస్తాడా ?

తెలంగాణ : వసూలు చేయడం చూశావా ? ఆధారాలుంటే బయటపెట్టు. నీ కారుకూతలు రాసే పేపర్లున్నాయని రెచ్చిపోకు ..అవి అచ్చయి చరిత్రలో నిలుస్తాయని గుర్తు పెట్టుకో

బాబు : తెలుగు ప్రజలను కలవకుండా విషబీజాలు నాటారు. రెండు వైపులా జనాలను రెచ్చగొట్టి విభజన చేస్తున్నారు

తెలంగాణ : మరి ఈ విష బీజాలను తొలగించడానికి నీవు చేసిన ప్రయత్నాలు ఏంటో ? చెప్పలేదు. విషబీజాలు వేసిన టీఆర్ఎస్ తో 2009లో ఎందుకు పొత్తు పెట్టుకున్నావ్ ? ఆ తరువాత తెలంగాణ తేల్చాలని కేంద్రానికి ఎందుకు లేఖ రాశావ్ ? అఖిలపక్షం పెట్టాలని ఎందుకు ప్రధానికి లేఖ రాశావ్ ?

ఈ ఆంధ్రబాబుల రుబాబులు మనకు కొత్తేం కాదు.. మోక మీదకు వచ్చినంక చంద్రబాబు మొరాయిస్తున్నడు. నిన్నటిదాంక నిమ్మలంగ ఉన్న చంద్రబాబు ఈ మూడు రోజుల నుండే ఎందుకు ఎగిరెగిరి పడ్తున్నడు.  1969 మాదిరే తెలంగాణను అడ్డుకుని తెరమరుగు చేయాలని కుట్రలకు తెరలేపారు. అన్ని పార్టీలు ఏకమయ్యి అడ్డుకోవాలని ఆరాటపడ్తుండ్రు. కానీ ఇది ఎడ్డి తెలంగాణ కాదు..ఇప్పుడు ఆగే ముచ్చట లేదు.

కుట్రలను చేధిద్దాం ... తెలంగాణ సాధిద్దాం

please like this page

www.facebook.com/thovva 

2 కామెంట్‌లు: