6, డిసెంబర్ 2013, శుక్రవారం

ఎవరి అమ్మ ? ఎక్కడి అమ్మ ? ఎందుకు అమ్మ ?

ఎవరి అమ్మ ? ఎక్కడి అమ్మ ? ఎందుకు అమ్మ ?

తెలంగాణ ఇచ్చినంతట్లనే పొయ్యిన పిల్లలు తిరిగొస్తరా ?
సచ్చిన పానాలు లేచొస్తయా ? తల్లుల కడుపుకోత సల్లార్తదా ?
1300 మంది అమరుల ఉసురు కొట్టుకుపోతదా ?

ఇచ్చిన తెలంగాణను ఎన్కకు తీసుకోని
ఇగురం లేని కొడుకుల మాటలు వట్టుకోని
నాలుగేండ్ల సంది పిల్లల పానాలతోని ఆడుకోని

తెలంగాణ ఉద్యమాన్ని అన్గదొక్కనీకే
అవసరమయిన అన్ని ప్రయోగాలు జేసి
ఆఖర్కి ఇక ఇయ్యక తప్పదని తెల్సుకోని
ఇయ్యాల తెలంగాణ ఇచ్చింది

లేని పంచాయితి పెట్టొద్దు
అమ్మ మన అమ్మ కానే కాదు
అమ్మ మనకు ఎప్పటికీ సవతి తల్లె
సీమాంధ్ర పెట్టుబడిదారుల నుండి ఓట్లు రాలవన్న
పరిస్థితి తెలుసుకున్న తరువాతనే
తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని అందరూ గుర్తవెట్టుకోవాలె

తెలంగాణ
నిఖార్సయిన
నిజాయితీ గల ఉద్యమం

ఇలాంటి ఉద్యమాలకు ఏ అమ్మయినా సలాం కొట్టాల్సిందే
అమరుల తల్లులకు తప్ప ఏ అమ్మకు తెలంగాణ సలాం కొట్టదు..కొట్టకూడదు

please like & share

www.facebook.com/thovva 

2 కామెంట్‌లు:

  1. బాగా చెప్పారు! అయినా సోనియమ్మ అమ్మే! మరిన్ని ప్రాణాలు పోకముందే ఇప్పటికైనా ప్రకటన చేసింది. లేకుంటే మన పిల్లగాళ్ళు ఇంకెంత ఆగమయ్యేటోళ్ళో?

    రిప్లయితొలగించండి