14, డిసెంబర్ 2013, శనివారం

ఎందుకు రా కలిసుండాలె ..?

ఎందుకు రా కలిసుండాలె ..?

అన్యాయం జరుగుతుందని .. 60 ఏండ్ల సంది మొత్తుకుంటుంటె
ఒక్క నాయకుడన్న అయ్యో పాపం అన్నోడున్నడ ..అవహేళన చేసెటోడు తప్ప
మేమూ తోటి తెలుగోళ్లమే గదరా..మరి మమ్మల్నెందుకు తెలంగాణోళ్లను జేసిండ్రు


ఎందుకు రా కలిసుండాలె ...?

నీళ్లు లేక పొలాల బీళ్లు వెట్టి బతుకుదెరువుకు దేశంబొయ్యి బతుకుతుంటె
గంజి నీళ్లకు గతిలేక ఆకలి చావులతో అల్లాడుతుంటే ..ఒక్కడన్న ఓదార్చిండా ..సేదదీర్చిండా
మేమూ తోటి తెలుగోళ్లమే గదరా..మరి మమ్మల్నెందుకు తెలంగాణోళ్లను జేసిండ్రు

ఎందుకు రా కలిసుండాలె...?

12 ఏండ్ల సంది కేసీఆర్ తెలంగాణ కొరకు ఉద్యమిస్తుంటె
పదవి కోసమని పరాచికాలాడిండ్రు..తాగుబోతని తప్పుడు ప్రచారం జేసిండ్రు
దోచుకుంటున్నడని దొంగ ఆరోపణలు చేసిండ్రు ..కుటుంబం కొరకని కుట్రలు చేసిండ్రు

మీరు జేస్తె సంసారం ..మేము జేస్తే వ్యభిచారమా
చంద్రబాబు కుటుంబం అంత రాజకీయం జేస్తది
వైఎస్ కుటుంబం మొత్తం రాజకీయం జేస్తది
అదే తెలంగాణోడు జేస్తే కుటుంబ రాజకీయం
థూ... మీ బతుకులు జెడ..మీ కండ్లల్ల నిప్పులు వడ

ఆత్మగౌరవ జెండా ఎత్తుకున్న మా విధ్యార్థులు మీకు తాలిబన్లయినప్పుడు
ఆత్మబలిదానాలు జేసుకున్న మా పిల్లలు మీకు తోటి మనుషులుగా కనిపియ్యనప్పుడు
మా అస్థిత్వ పోరాటాన్ని మీరు అవహేళన చేసినప్పుడు ..ఎందుకు రా కలిసుండాలె ?

తెలంగాణ నిచ్చెన మీది నుండి అధికారం అందుకున్నోడు
ఎక్కిన నిచ్చెనను ఎన్కకు తన్నిండు..అయిదేండ్ల అధికారంతో ఆగం జెయ్య జూసిండు
నది దాటి నంధ్యాల కాడ ..ఆడి కోవాల్నంటే పాస్ పోర్ట్ గావాలె..వీసా గావాలె అని ఇషం గక్కిండు
అందుకే పాపం పండి యాడాది తిర్గక ముందే పాస్ పోర్ట్ లేకుంట పావురాల గుట్టకాడ పానమిడ్సిండు

నాలుగేండ్ల సంది వెయ్యి మంది మా పిల్లలు మంటల్ల గాలుతుంటె
మా జనం రోడ్ల మీదకు వచ్చి ఉద్యమాలు జేస్తుంటె
తెలుగువారం కలిసుందా అని కథలు జెప్తున్న ఒక్కడన్న
మాకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం జేసిండా
మా తరపున సర్కారుతోని లడాయికి దిగి ఇది తప్పు అని ప్రశ్నించిండా ..
నా అన్యాయాన్నే నువ్వు గుర్తించనప్పుడు నాకు అన్నవెట్లయితవు

కడుపుల లేనిది కావులించుకుంటె రాదు
ఇడుదల కాయితం సిద్దమయింది
ఇప్పటికయిన ఒప్పుకుని ఇజ్జత్ నిలవెట్టుకో

sandeepreddy kothapally

www.facebook.com/thovva

5 కామెంట్‌లు:

  1. అద్భుతం సందీప్. చాల బాగా రాశ్నవ్. నీ అసుంటి వాడు మన తెలంగాణకు చాన అవసరం. కడుపుల బాధను సక్కగ చెప్పినవ్ తమ్మీ. గర్విస్తున్నా.

    రిప్లయితొలగించండి
  2. సందీప్ భయ్యా! చాలా బాగా రాశావు. తెలంగాణను అడ్డుకొనే ఏ సీమాంధ్రునికైనా సిగ్గుంటే మన తెలంగాణ రాష్ట్రానికి అడ్డుచెప్పవద్దు. నీ ఆవేదన ఈ వ్యాసంలో ప్రతిబింబిస్తోంది. అభినందనలు.

    నా బ్లాగు రెగ్యులర్‍గా చూడగలవు. "నా తెలంగాణ కోటి రత్నాల వీణ" (ratnaalaveena.blogspot.in)

    రిప్లయితొలగించండి
  3. Hello brother this is vamsi from andra. mee matallo chala nijam undi poratam prajala madya kadu anna.. nayakula madya jaragali.. vallani niladiyali

    రిప్లయితొలగించండి