తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో జాప్యాన్ని నిరసిస్తూ మరో యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా తుఫ్రాన్ మండలం ఇమాంపూర్ వద్ద ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రంగారెడ్డి జిల్లా మేడ్చెల్ మండలం రాయలపూర్‌కు చెందిన యాదగిరిగా పోలీసులు గుర్తించారు.
తాను తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు యాదగిరి సెల్‌ఫోన్‌లో వాయిస్ రికార్డు చేసి చనిపోయాడు. దీంతో పాటు ఫోన్ లో తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మెసేజ్ టైప్ చేశాడు. విషయం తెలుసుకున్న తెలంగాణ వాదులు పెద్దఎత్తున్న సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.
Balidanalu Vaddu, brathiki Sadiddam Telangana
రిప్లయితొలగించండిపోరాడి పోలీస్ కాల్పుల్లో చనిపోవడం వేరు, ఆత్మహత్య చేసుకోవడం వేరు. వీరుడు యుద్ధ భూమిలో నేలకొరుగుతాడు కానీ ఆత్మహత్య చేసుకోడు.
రిప్లయితొలగించండి