11, మార్చి 2012, ఆదివారం

చంద్రబాబు శకుని..కిరణ్ శని


‘దమ్ముంటే కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి రాజీనామా చేసి పోటీ చేయాలి’ అన్న టీడీపీ చంద్రబాబు నాయుడు సవాల్ ను టీఆర్ ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ స్వీకరించారు. రాజీనామా చేసి పోటీ చేసేందుకు సిద్దమని, దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేయించి తనతో పోటీకి రావాలని సవాల్ విసిరారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కొల్లాపూర్ లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు.

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు దక్కకుండా చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని ఏ నియోజకవర్గం నుండి అయినా పోటీ చేసి చంద్రబాబు డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ చేశారు.  తెలంగాణ ఇచ్చేది కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అని , తెలంగాణ రాకపోవడానికి నాకు ఏం సంబంధం అంటున్న చంద్ర బాబు, డిసెంబర్ 9 నాడు రాత్రి వచ్చిన తెలంగాణ ప్రకటనను అడ్డుకున్నది నీవు కాదా ? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ భవన్ నుండే దొంగ రాజీనామాలు చేసేలా సీమాంధ్ర ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారని విమర్శించారు. తెలంగాణకు చంద్రబాబునాయుడు శకుని అయితే, ముఖ్యమంత్రి  కిరణ్‌కుమార్‌రెడ్డి శని  అని అన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి