15, మార్చి 2012, గురువారం

కృష్ణవేణి...తెలంగాణ విరిబోణి

‘కంఠమే తెగుతున్నా కంట నీరు వద్దని ఓరుగల్లు కోటకే పోరు పాఠం నేర్పినట్టి..కత్తులకు పదును బెట్టి కదనరంగమున దూకిన సమక్క సారలమ్మ రణభూమికి వందనం’

                 సీమాంధ్ర నేతల గుండెలదిరేటట్లు..సమైక్య వాదుల చెంప పగిలేటట్టు..ఇంటి దొంగ వీపు వాచేటట్లు తెలంగాణ ముద్దు బిడ్డ, పాలమూరు ఆడబిడ్డ కృష్ణవేణి ఇచ్చిన షాక్ ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డలకు గొప్ప ఊపిరినిచ్చింది. రెండు కళ్ల చంద్రబాబు పార్టీ తరపున నాగర్ కర్నూలు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న మర్రి జనార్ధన్ రెడ్డికి కృష్ణవేణి ఇచ్చిన షాక్, చెప్పిన మాటలు ఆయన తల ఎక్కడ పెట్టుకోవాలో తెలీకుండా చేసింది.

సీమాంధ్ర డబ్బు సంచులను ఎర వేసి తెలంగాణ ఓట్లు కొల్లగొట్టాలను కున్న మర్రికి తిక్క తిరిగేలా మొహం మీదే సమాధానం చెప్పింది కృష్ణవేణి. నాగర్ కర్నూలు తాలూకా తెలకపల్లికి చెందిన కృష్ణవేణి టీఆర్ఎస్ కార్యకర్త సూర్య వెంకటేష్ గౌడ్ కుమార్తె. గత 11 తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తగా పనిచేస్తున్న వెంకటేష్ నిఖార్సయిన తెలంగాణ వాది. ప్లంబర్ పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో అన్ని కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నాడు. ఈ ఉప ఎన్నికలో తన సహచరులంతా మర్రి డబ్బులకు లొంగినా  తాను మాత్రం తెలంగాణ జెండా విడవలేదు.


                        దీంతో బిడ్డ పెళ్లిని సాకుగా చూపి తెలుగుదేశం పార్టీలోకి రావాలని, డబ్బులిస్తానని మర్రి జనార్ధన్ రెడ్డి ఏకంగా ఇంటికే ఫోన్ చేశాడు. ’’ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా‘‘ వెంకటేష్ కుమార్తె కృష్ణవేణి నీ డబ్బు వద్దు..నీ సోపతి వద్దు. అవసరమయితే పొలం అమ్మి పెళ్లి చేసుకుంటా..లేకపోతే ఇలాగే ఉంటా...నాయినా నీవు పార్టీ మారొద్దని తేల్చి చెప్పింది. దీంతో సీమాంధ్రుల సంక చేరిన మర్రికి తిక్క కుదిరింది. చావులకు, పెళ్లిళ్లకు డబ్బులని, వాటర్ ప్లాంట్లు అని ఓ ట్రస్టు పేరుతో రాజకీయాలకు దిగిన మర్రికి బుర్ర తిరిగేలా చెప్పిన సమాధానం మామూలుది కాదు. అది తెలంగాణ గుండె చప్పుడు. అందుకే కృష్ణవేణిని అభినందిద్దాం...ఆయన తండ్రికి అండగా నిలుద్దాం. కాల్ 9948698519

1 కామెంట్‌: