25, మార్చి 2012, ఆదివారం

ఓరుగల్లులో మరో ఆత్మహత్య


తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లాలో మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లాకు చెందిన భోజ్యానాయక్ ఆత్మహత్య చేసుకుని అంత్యక్రియలు పూర్తయి 24 గంటలు గడువక ముందే మరో ఆత్మహత్య సంఘటన జరగడం సంచలనం రేపుతోంది. వరంగల్ లోని హన్మకొండలో కొద్దిసేపటి క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది.
హన్మకొండ సమీపంలోని పబ్లిక్ గార్డెన్ వద్ద రాజమొగిలి అనే యువకుడు వంటిపై పెట్రోలు పోసుకుని జై తెలంగాణ నినాదాలు చేస్తూ నిప్పంటించుకున్నాడు. స్థానికులు గమనించి స్పందించేలోపే ఎక్కువభాగం కాలిపోయాడు. రాజమొగిలి జఫర్ ఘడ్ మండలం తిమ్మంపల్లికి  చెందిన వ్యక్తి. ఆయన భౌతికఖాయాన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యలు జరుగుతున్నా ప్రభుత్వంలో స్పందనలేదని నిరసన వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ శాసనసభ్యలు సభ వాయిదా పడినా సభలోనే నిరసన తెలుపుతున్నారు. తెలంగాణ గురించి తెల్చేవరకు సభను విడిచిపెట్టమని వారు తేల్చిచెప్పారు.

2 కామెంట్‌లు:

  1. Hi Brother ,
    నాది ఒక ప్రశ్నా...ఇన్ని రోజుల నుంచి ఆగి పోయిన ఆత్మహత్యలు మళ్లీ ఎందుకు మొదలు అయ్యాయి ? 6 నెలల నుంచి ఇదే పరస్థితి ఉంది కదా ..మళ్లీ ఇప్పుడే ఎందుకు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు ? ఇలా ఆత్మహత్యలు చేసుకోవటం వలన ఏమి అన్న ఉపయోగం ఉందా ? అని యువకులకి ఎందుకు చెప్పటం లేదు ..ప్లీజ్ మనిషి ప్రాణం చాల విలువైనది దానిని తెసుకోవద్దు అని చెప్పండి ...
    ఇలా ఆత్మహత్య చేసుకొన్నా వాళ్ళని హీరో లు చెయ్యకండి అది వేరే వాళ్ళకి ఉదాహరణ అవుతుంది ..so please don't encourage suicides .... ప్రత్యెక రాష్ట్రము అనేది ప్రాణం కంటే విలువైనది కాదు అది ఏర్పడటం వలన , ఏర్పడక పోవటం వలన మన జీవితాలలో ఒక్క సారిగా వచ్చే మార్పు ఏమి ఉండదు ..So please don't encourage suicides..మనం ప్రత్యెక రాష్ట్రాన్ని చూస్తాము అని చెప్పండి చూడటానికి బ్రతికి ఉందాము అని చెప్పండి .ప్రత్యేక రాష్ట్రము లో బాగు పడదాము అని చెప్పండి కాని చచ్చి పోయిన వాళ్ళని హీరో లల్లగా చెప్పటం వలన ఇంకో కళ్ళని చావనికండి ...
    థాంక్స్ .
    సాయి కృష్ణ ఆలపాటి
    alapatisai1984@gmail.com

    రిప్లయితొలగించండి
  2. అసలివి నిజమైన ఆత్మహత్యలేనా ? లేక ఉప-ఎన్నికల ఫలితాలు చూసి కళ్ళు తిరిగిన తె.కాంగ్రెస్ నాయకులు అదనుచూసి కేంద్రం బలహీనత మీద దెబ్బకొట్టి దాని మెడలు వంచడం కోసం ఆడుతున్న/ ఆడిస్తున్న డ్రామానా ?

    రిప్లయితొలగించండి