తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు కోరుతూ వరంగల్ జిల్లాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ లోని ఆర్ట్ కళాశాల దగ్గర జై తెలంగాణ అంటూ బొజ్జా నాయక్ అనే విద్యార్థి వంటికి నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బొజ్జా నాయక్ న్యూసైన్స్ కళాశాలలో ఎంబీఎ చదువుతున్నాడు. రఘునాథపల్లి మండలం అశ్వారావు పల్లి పక్కన బీరానాయక్ తండా ఆయన స్వగ్రామం.
కాంగ్రెస్, టీడీపీ నాయకుల దొంగనాటకాల వల్లనే తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు ఆలస్య మవుతుందని బొజ్జానాయక్ విమర్శించాడు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కోర్టులో పోరాడుతామని, విద్యార్థి ఆత్మహత్య బాధాకరమని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సంఘటితంగా పోరాడి తెలంగాణ సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థుల ఆత్మహత్యలకు సోనియా సహా రాష్ట్ర మంత్రి డీకె అరుణ, గండ్ర వెంకటరమణా రెడ్డి తదితరులు బాధ్యత వహించాలని,చ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని న్యాయవాది అరుణ్ కుమార్ కోరారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి