మొత్తానికి కేసీఆర్ దుష్టతలంపు వచ్చిందే తడవు ఆంధ్రజ్యోతి మీద పడ్డాడు. మేం దేనికీ భయపడం. తప్పుంటే
చర్యలు తీసుకోండి. కేసీఆర్ స్వయంగా ఎంఎస్ఓలకు ఫోన్ చేసి బెదిరించాడు. అయితే తెలంగాణ టీఆర్ఎస్ మోనార్క్ ఏమీ కాదు. ఆ పార్టీకి వచ్చింది 38.5 శాతం ఓట్లే. మిగతా ప్రజల మనోభావాలకు అద్దంపట్టాల్సిన భాధ్యత మీడియాకు లేదా ? నిజామాబాద్ లో పుట్టిన నేను ఆంధ్రోడిని ఎలా అవుతాను. కానీ నన్ను ఆంధ్రోడిని చేయడంలో కేసీఆర్ విజయవంతం అయ్యాడు.
ఆంధ్రజ్యోతి ప్రసారాలను తెలంగాణ ఎంఎస్ఓలు బంద్ చేయడంతో ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ ఈ రోజు తన పత్రికలో రాసుకున్న పలుకులివి. పత్రిక నీది కాబట్టి పలుకులు ఎన్నయినా రాసుకోవచ్చు. నీవు చెప్పిందే నిజమని నీకు నువ్వే భావించుకోవచ్చు. కానీ తెలంగాణ సమాజం నీ కారుకూతలను ..పిచ్చిరాతలను చూసి భ్రమపడిపోదు. తెలంగాణలో 1200 మంది బిడ్డలు బలిదానాలు చేసుకుంటే వారికి అండగా నిలవలేని నీ పాపిష్టి మీడియా ..తెలంగాణ సమాజాన్ని అనుక్షణం గందరగోళంలోకి నెట్టి ..వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి ఆత్మహత్యల పాపాన్ని మూటగట్టుకున్న నీ సీమాంధ్రజ్యోతి ..తెలంగాణ విడిపోగానే సీమాంధ్ర రాజధానికి విరాళాలు సేకరిస్తుందంటే నీవు ముమ్మాటికీ ఆంధ్రోడివే అని చెప్పడానికి నీ మీద ఇంకొకరు బురద జల్లాలా ?
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడాన్ని జీర్ణించుకోలేని నీవు ప్రభుత్వం కొలువుదీరి పది దినాలు గడవక ముందే విషం కక్కుతూ నీ ఆలోచనలను ..అర్ధ సత్యాలను తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలుగా ప్రచురించి తెలంగాణ ప్రజల్లో కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం మీద అపనమ్మకం కలిగించే ప్రయత్నాలు చేయడం నిజం కాదా ? సీమాంధ్ర ప్రజలకు తెలంగాణ ప్రజల మీద విద్వేషం కలిగించేలా ''ఏపీనా వేసెయ్ పన్ను'' అని వార్తలు రాయడం నీ దుర్మార్గపు ఆలోచనలకు ప్రతీకనా ? కాదా ?
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం మోనార్క్ ఏమీ కాదు దానికి వచ్చింది 38.5 శాతం ఓట్లే అని అంటున్న నీకు సీమాంధ్రలో చంద్రబాబుకు వచ్చిన ఓట్ల శాతం ఎంతో తెలీదా ? మరి చంద్రబాబును ప్రశ్నిస్తూ నీవు రాసిన వార్తలెన్ని ? తెలంగాణ ప్రభుత్వం మీద విషం చిమ్ముతూ రాసిన వార్తలు ఎన్ని ? ఈ కొద్ది రోజుల వార్తలు లెక్క తీస్తె నీవు ఆంధ్రోడివా ? తెలంగాణోడివా ? అన్నది తేలిపోతుంది. పత్రిక చేతిలో ఉంది కాబట్టి అప్రజాస్వామిక వార్తలు రాసి ..నీకు పడని ప్రభుత్వం మీద విషం చిమ్మి ..నీవు రాదనుకున్న తెలంగాణ సమాజాన్ని ఆందోళనకు గురి చేసి ఆనందపడదాం అనుకుంటున్న నీ తిర్రి ఆలోచనలను చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటున్నది.
నీవు చంద్రబాబుతో కలిసి ఎన్ని నాటకాలయినా ఆడుకో ..నీ ఆంధ్రప్రదేశ్ మీద ఎంత ప్రేమయినా కురిపించుకో..కానీ తెలంగాణ మీద విషం చిమ్మడం మానుకో. వైఎస్ మూయించిన నీ పవర్ ప్లాంట్ ను కిరణ్ కుమార్ రెడ్డికి వార్తలు రాసి రాసి తెరిపించుకున్న నీవు ప్రజాస్వామ్యం గురించి ..అవినీతి గురించి అప్రజాస్వామిక ఆలోచనల గురించి మాట్లాడడం హస్యాస్పదం. తెలంగాణ సమాజం ఇప్పటికీ ..ఎప్పటికీ చైతన్యవంతమయినదే ..ఇక మలిదశ తెలంగాణ ఉద్యమం మాకు మీలాంటి ముసుగు మీడియా సంస్థలను ఎలా ఎదుర్కోవాలో గుణపాఠాలు నేర్పింది. ఇప్పటికయినా మీ ఆలోచనలు మానుకుని తెలంగాణ ఎదుగుదలకు సహకరించండి. తెలంగాణకు చేసిన పాపాన్ని కొంతయినా కడుక్కోండి.
కొత్తపల్లి సందీప్ రెడ్డి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅయ్యా, మీరు "తెలంగాణ ప్రజల మీద విద్వేషం కలిగించేలా ''ఏపీనా వేసెయ్ పన్ను'' అని వార్తలు రాయడం నీ దుర్మార్గపు ఆలోచనలకు ప్రతీకనా ? కాదా ?" అనటం బాగుంది.
రిప్లయితొలగించండిశ్రీమాన్ కేసీఆర్ మహాశయులే "సీమాంధ్రలోపుట్టిన వాళ్ళంతా తెలంగాణాద్రోహులే" అన్నారు గదా, చూడండి, అది కూడా తెలంగాణావారికి సీమాంధ్రులపట్ల విద్వేషం కలిగించే వ్యాఖ్యలేనని దయచేసి అంగీకరిస్తారా?
"సీమాంధ్రలోపుట్టిన వాళ్ళంతా తెలంగాణాద్రోహులే" ee vishyamulo ye telagana vadi rendo opinon vundahu ...nuvve cheppu enthaa mandhi andhraa vallu telangana rastanni swagathincharu ...andaru vyatthirenkinchina valle kada ante telangana drohule kada
తొలగించండిచందూ గారూ, వ్యతిరేకత ద్రోహం కాదు. తెలంగాణా సమర్తించాలా వద్దా అనేది ఎవరి ఇష్టం వారిది. ఉ. శ్యామలీయం గారు ముందరి నుండీ తెలంగాణా వ్యతిరేకి కానీ వారు ఎప్పుడూ ఎవరికీ ద్రోహం చేయరు. మీరు అనవసరంగా వారిపై నిందలు వేయడం సరి కాదు.
తొలగించండి