14, జూన్ 2014, శనివారం

పచ్చకండ్లు ..పచ్చనోట్లు..పాపిష్టి మీడియా !!


పొద్దున లేస్తె వాడు ఫోర్త్ ఎస్టేట్ గురించి ఫోజులు గొడుతుంటడు. జర్నలిజం విలువల గురించి జనుకులు
విసురుతుంటడు. వాని మైకు నిండా మైకమే గనిపిస్తది. అధికారుల అవినీతి గురించి వాడు అంతెత్తున ఎగిరినట్లు గనిపిస్తడు. మీడియా స్వేచ్చ గురించి వాడు నిప్పులు గురిపిస్తుంటడు. కానీ వానిదంతా ఆధిపత్యపు అహంకార ధోరణే. వాని నిలువెల్ల విషమే. వాని దృష్టిలో మీడియా స్వేచ్చ అంటే వాని ప్రయోజనాలు ..వాని సామాజికవర్గ ప్రయోజనాలు. వాడు నందిని పట్టుకొని పంది అంటడు ..పందిని పట్టుకొని నంది అంటడు. అదే జర్నలిజం విలువ వాని దృష్టిల.

ర్యాగింగ్ జరిగి ఆ పిల్లల తల్లిదండ్రులు నెత్తీ నోరు బాదుకుంటుంటే అవే దృశ్యాలను పదే పదే తన టీవీలో ప్రదర్శించి ఆ కుటుంబానికి తీరని వేదన మిగిలిస్తాడు. ఫ్యాక్షనిస్టుల ఆస్తులు జాతీయం చేయాలని ప్రచారం చేస్తాడు. తనకు అన్ని కోట్లు ఎలా వచ్చాయో మాత్రం చెప్పడు. పచ్చళ్లు అమ్ముకునెటాయిన ప్రపంచాన్ని ఆకర్షించే స్థాయికి వెళ్తాడు.ఆయన కష్టపడి వెళ్లినట్లు. మిగతావాళ్లు ఆయన కనుసన్నలలో పనిచేయాలంటాడు. అసలు జర్నలిజాన్ని ఓ పరిశ్రమలా చేసింది ఈ దుర్మార్గులె. నలుగురికి ఉపయోగపడాల్సిన మీడియాను అంగట్లో సరుకులా మార్చింది ఈ ఆంధ్రా వలస దోపిడీ దారులె. తెలంగాణ సంపదను తేరగా దోచుకుని అది బయట పడకుండా ఉండేందుకు తమ మైకులను అడ్డుగా పెట్టుకున్నారు.

ప్రశ్నించలేని వ్యక్తులను పంచన జేర్చుకుని ..నిలదీయలేని నేతలను తమ గుమ్మాలకు కాపలాగా చేసుకుని మీడియా మొఘల్లుగా చెలామణి అవుతున్నారంటే జర్నలిజం విలువలు ఏ స్థాయికి దిగజారి పోయాయో అర్ధం చేసుకోవచ్చు. సీమాంధ్ర పెట్టుబడిదారులను తమ చుట్టూ చేర్చుకుని ..వారి అండతో తెలంగాణ నేతలను ఇన్నాళ్లు వాడుకున్నారు. ఇప్పటికి తెలంగాణ వచ్చినా ఆంధ్రా పార్టీలకు వంతపాడుతున్నారంటే ఇప్పటిదాకా తయారయిన ఇలాంటి వంధిమాగదులే కారణం. దేశంలోనే ఎక్కడా లేనన్ని పత్రికలు ..ఛానళ్లు రాష్ట్రంలో ఉన్నాయి. నిజంగా మీడియా ఇంత పటిష్టంగా ఉంటే ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలి. రాజకీయ నాయకులు ప్రజల ఆకాంక్షలే ధ్యేయంగా పనిచేయాలి. కానీ ఈ మీడియా వెనుక ఉన్నదే పెత్తందారి వ్యవస్థ. ఇక్కడ వారి ప్రయోజనాలను ప్రజల ప్రయోజనాలను చేసి పరిశ్రమలు, భూములు కొల్లగొట్టారు. ప్రతి వ్యవస్థలోనూ వీరు వేళ్లూనుకున్నారు. వీరిది మీడియా అంటే ..జర్నలిస్టులు సిగ్గుతో తలవంచుకోవాలి. ప్రజల ప్రయోజనాలే జర్నలిస్టు ప్రయోజనాలు తప్పితే ..పెత్తందారి ప్రయోజనాలు ..అవసరాలు ఎన్నటికీ ప్రయోజనాలు కావు. మీడియా స్వేచ్చ కాదు ..కా జాలదు. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి మీడియా వ్యవస్థని బొందపెట్టాలి. ఫోర్త్ ఎస్టేట్ మీద ప్రజల నమ్మకాన్ని పెంచాలి.

జై తెలంగాణ

కొత్తపల్లి సందీప్ రెడ్డి 

1 కామెంట్‌:

  1. క.చ.రా. దొరా, నీకొక్కటి చెప్పనా, మీడియా అతే చేస్తుంది, దరిద్రం గానే చాలా ప్రోగ్రాములు ఉంటున్నాయి, అందులో అనుమానం లేదు, కాకపోతే రోత గురించి, నోటి దూల గురించి నువ్వు, నీ కుటుంబం మాట్లాడటమే అన్నిటికంటే అత్యంత దరిద్రం!!

    తమరు ప్రధాన మంత్రిని ని 'చప్రాసీ' అనొచ్చు,
    కాంగీ మంత్రులను 'బూట్ పాలిష్ గాళ్లూ' అని అనవచ్చు, TDP, MLA లను 'చవటలు, సన్నాసులు, దద్దమలు, లంగాలు, లుచ్హాలూ లాంటి హుందా పదాలతో సంబోధించి, మళ్ళీ వాటికి నానార్ధాలు తాత్పర్యాలు చెప్పి సమర్ధించుకోవచ్చు,

    మిమ్ములను మించిన మీ కొడుకు, అల్లుడు పొలీసు లను, వాళ్ల మొకాన 'లం... కొడాక, మా కి ల...' లాంటి గౌరువ పదజాలం ఉచ్చరిచవచ్చు!!

    కానీ మీడియా మాత్రం బుద్ది గా ఉండాలా!! లేకపోతే supress చేస్తావా?

    నోటి దూల నీ కుటుంబం ఒక్కరి హక్కే అని మరి ఓ #G.O.# కూడా పాస్ చేసేయ్ దొరా!!

    పనిలో పని ఎటూ మీడియా నియంత్రణ అంటున్నావు కాబట్ట, ఈ బ్లాగులు, ముఖ పుస్తకాలు లాంటి వాటి నియంత్రణ మీద కూడా ఓ పాలి కన్నేసెయ్ దొరా!! ఓ పని అయిపోతుంది :-)

    సివరాఖరుగా, ఎంతయినా, నీ పంఖా గా నీకో ముక్క దొర, ఆంధ్రోళ్లను "ఆంధ్రా అహంకారం ,ఆంధ్రా పార్టీలు ,ఆంధ్రా కతలు ఆంధ్ర వాళ్ళు " అంటూ తిట్లు, ఏడుపులు నువ్వో, నీ కుటుంబం మో ఏడవాలి దొరా, నీకంటే ఎక్కువ తిట్టేసి నీ image కి దెబ్బకొట్టేస్తున్న నిత్య దుఖిత బ్లాగులను బ్యాన్ చెసే పని కాస్త చూడు దొర,

    అలాగే ఈనాడు నో, ఆంధ్రజ్యోతి నో తిడితే నువ్వే తిట్టాలి గాని, అక్కడ కూడా నీకు పెద్ద కాంపిటీసన్ అయిపోతున్న ఈనాడు, జ్యోతి మాజీ మీడియా గాళ్ల ఏడుపు బ్లాగులను కూడా బ్యాన్ చేసేయ్ దొరా, ఓ పని అయిపోద్ది :-)

    రిప్లయితొలగించండి