6, జూన్ 2012, బుధవారం

ఓ నిజమయిన స్నేహితుడి కథ !



సైన్యంలో ఇద్దరు ప్రాణ స్నేహితు లున్నారు. యుద్ధం జరుగుతుండగా తూటా తగిలి వాళ్ళలో ఒకరు నేలకొరిగిపోయాడు. తన స్నేహితుణ్ణి ఆ స్థితిలో చూసేసరికి మరో సైనికుడికి గుండెను పిండేసే బాధ. అతను ఓ కందకంలో దాక్కున్నాడు. తలపై నుంచి దూసుకుపోతున్న తూటాలు. ఎటు చూసినా తుపాకీ చప్పుళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఆ సైనికుడు తన లెఫ్టినెంట్‌ని ఈ విధంగా అడిగాడు.
”సర్‌, నేను అక్కడికెళ్ళి మా మిత్రుణ్ణి తీసుకు వస్తాను.”
”వెళ్ళిరా. కాకపోతే నువ్వక్కడికి వెళ్లినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. మీ స్నేహితుడు ఇప్పటికే చనిపోయి ఉండవచ్చు. లేదా నీ ప్రాణాలే పోవచ్చు” అన్నాడా లెఫ్ట్‌నెంట్‌.
అతని సలహాను లక్ష్యపెట్టకుండా సైనికుడు ముందుకెళ్ళి పోయాడు. ఎలాగోలా మిత్రుని చేరుకోగలిగాడు. అతన్ని తన భుజం మీదకు ఎత్తుకుని వాళ్ళు దాక్కున్న కందకం వైపుకి తీసుకొచ్చాడు. ఇద్దరూ వచ్చి అక్కడ పడ ిపోగానే ఆ ఆఫీసరు దెబ్బతిని పడి ఉన్న సైనికుణ్ణి పరీక్షించాడు. అతను అప్పటికే చనిపోయి ఉన్నాడు. అతన్ని మోసుకు వచ్చిన మిత్రుడి వైపు జాలిగా చూశాడు.
”నేను ముందే చెప్పాను దీని వల్ల ఏమీ ప్రయోజనం లేదని. ఇప్పుడు చూడు నీ స్నేహితుడేమో చనిపోయాడు. నీకు తగిలిన గాయాలూ అలాంటివే” అన్నాడు.
”కానీ నాకు తృప్తిగా ఉంది సర్‌. అసలు మీ దృష్టిలో ప్రయోజనం అంటే అర్ధం ఏమిటి?
”మరి నీ స్నేహితుడు చనిపోయాడుగా”
”నే నక్కడికి వెళ్ళేటప్పుటికి బతికే ఉన్నాడు సర్‌. వాడు నోరు తెరిచి నువ్వు వస్తావని నాకు తెలుసురా! అన్న ఒక్క మాటచాలు నాకు,” అదే నా దృష్టిలో గొప్ప ప్రయోజనం!!

7 కామెంట్‌లు:

  1. నిజంగా ఆ ఒక్క మాటకే నా కళ్ళూ చెమరించాయి....

    నిజమైన స్నేహం అంటే అంతే.... చాలా బాగుంది..,..

    రిప్లయితొలగించండి
  2. anna exellent friendship ku chavu anedi undadu ani niroopinche.. story

    రిప్లయితొలగించండి
  3. anna exellent. friendship ku chavu anedi undadu ani niroopinche.. story
    nijamaina friendship....

    రిప్లయితొలగించండి