కొత్తపల్లి జయశంకర కోటి దండాలు
వెలిగించారు ఊరూరా ఉద్యమ దీపాలు
సీమాంధ్ర పాలకులా దుర్మార్గాలు
తన్ని తరిమేసే మెదళ్లకు నేర్పారు ఓనమాలు "2"
పారేటి నీళ్లున్నా..పనిచేసే సత్తువున్నా
ఆరేటి బతుకులా ఆకలి చావులు చూసి
అరవై ఏండ్ల ఆంధ్రుల పాలన మాకొద్దంటూ
వారంలో ఒకరోజు ఉపవాసమున్నారూ "కొత్తపల్లి"
ఆనాడు శంకరుడు లోకమందకారమైతే
జడలో చంద్రుని దాల్చి లోకాన వెలుగునిచ్చే
ఈనాడు తెలంగాణ ఆగమై పోతుంటే
చంద్రశేఖరునితో పోరు నడిపిన గురునివి "కొత్తపల్లి"
ఆ జన్మ బ్రహ్మచర్యం అమ్మ తెలంగాణ కోసం
ఆగని కన్నీళ్ల ఒడవని ముచ్చట చేసి
ఆకాశానికేగినా ఆచార్య దేవరా
అర్పిస్తాం తెలంగాణ సాధించి జోహార్లు "కొత్తపల్లి"
జోహర్ ఆచార్య జయశంకర్ కు
మొదటి వర్ధంతి సంధర్భంగా
మిత్రుడు సింగమోళ్ల విజయ్ అనుమతితో
సందీప్ రెడ్డి కొత్తపల్లి
వెలిగించారు ఊరూరా ఉద్యమ దీపాలు
సీమాంధ్ర పాలకులా దుర్మార్గాలు
తన్ని తరిమేసే మెదళ్లకు నేర్పారు ఓనమాలు "2"
పారేటి నీళ్లున్నా..పనిచేసే సత్తువున్నా
ఆరేటి బతుకులా ఆకలి చావులు చూసి
అరవై ఏండ్ల ఆంధ్రుల పాలన మాకొద్దంటూ
వారంలో ఒకరోజు ఉపవాసమున్నారూ "కొత్తపల్లి"
ఆనాడు శంకరుడు లోకమందకారమైతే
జడలో చంద్రుని దాల్చి లోకాన వెలుగునిచ్చే
ఈనాడు తెలంగాణ ఆగమై పోతుంటే
చంద్రశేఖరునితో పోరు నడిపిన గురునివి "కొత్తపల్లి"
ఆ జన్మ బ్రహ్మచర్యం అమ్మ తెలంగాణ కోసం
ఆగని కన్నీళ్ల ఒడవని ముచ్చట చేసి
ఆకాశానికేగినా ఆచార్య దేవరా
అర్పిస్తాం తెలంగాణ సాధించి జోహార్లు "కొత్తపల్లి"
జోహర్ ఆచార్య జయశంకర్ కు
మొదటి వర్ధంతి సంధర్భంగా
మిత్రుడు సింగమోళ్ల విజయ్ అనుమతితో
సందీప్ రెడ్డి కొత్తపల్లి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి