తెలంగాణ ప్రజలను సోనియా గాంధీ మోసం చేశారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను పాటియాలా కోర్టు విచారణకు స్వీకరించింది. హైదరాబాద్‌కు చెందిన అరుణ్‌కుమార్ అనే న్యాయవాది రెండు రోజుల క్రితం పాటియాల కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ రోజు పిటిషనర్ వాదిస్తూ సాక్ష్యాలను, అమరవీరుల కుటుంబాల తల్లిదండ్రులను కోర్టులో ప్రవేశపెడుతానని తెలిపారు. మొత్తం 14 అభియోగాలతో నమోదైన పిటిషన్‌ను కోర్టు విచారించింది. కేసును నవంబర్ 15కు వాయిదా వేసింది.
ఢిల్లీకి టీఎన్‌జీవో నేతలు ?
తెలంగాణలో జరుగుతున్న సకల జనుల సమ్మెను విరమింపజేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. సమ్మె విరమణ కోసం టీఎన్‌జీవో నేతలను చర్చలకు ఢిల్లీకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. . ప్రధాని, ముఖ్యనేతలతో చర్చలకు ఏర్పాటుచేయాలని యోచిస్తోంది. గతంలో ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీని నెరవేర్చుకునేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు తమతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని తెలంగాణ ఎన్జీవో నేతలు తెలిపారు. ఉద్యోగులపై రైల్వే యాక్ట్ కింద నమోదైన కేసుల వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించినట్లు వారు చెప్పారు. తమని ప్రభుత్వం ఢిల్లీకి తీసుకెళ్తుంది అని వస్తున్న వార్తల గురించి తెలియదు అని ఉద్యోగులు తెలిపారు.
సకల జనుల సమ్మె కొనసాగుతుందని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత స్వామిగౌడ్ తెలిపారు. సమ్మె సందర్భంగా తమ ప్రాంత ఉద్యోగులపై పెట్టిన కేసుల వివరాలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి అందజేశామని ఆయన తెలిపారు. ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదితో సమావేశం తర్వాత స్వామిగౌడ్ విలేకరులతో మాట్లాడారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి