‘గొంగడిలో కూర్చోని తింటూ వెంట్రుకలు వస్తున్నాయి’ అంటే ఎలా ?, ప్రస్తుతం మనం ఉన్నది
పెట్టుబడిదారి వ్యవస్థలోనే, ముందు తెలంగాణ రాష్ట్రం వస్తే సామాజిక తెలంగాణ అనే విషయం గురించి మాట్లాడవచ్చని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగకు సూచించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, ప్రజలు మమేకమై పోరాడుతుంటే మందకృష్ణ వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందని అన్నారు.
తెలంగాణ కోసం చారిత్రాత్మక ఉద్యమం చేస్తున్న ఉద్యోగులకు అండగా నిలవకుండా మంత్రి జానారెడ్డి సోనియాగాంధీ, ముఖ్యమంత్రి కిరణ్ లతో కుమ్మక్కయి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఉద్యమం చల్లారిందని సీమాంధ్ర నేతలు హేళన చేస్తుంటే, కేకే వంటి వారు సానుకూల సంకేతాలు అందాయని అవగాహన లేని వ్యాఖ్యలు చేయడంతో ఉద్యమంలో అలజడి నెలకొంటోందన్నారు.
సమయాన్ని బట్టి ఉద్యమ పంథా మార్చాలని పరిస్థితుల దృష్ట్యా ఎత్తుగడలు కూడా మార్చాలని సూచించారు. 2004, 2009లో టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.గ్రామస్థాయిలో ఉద్యమం జరుగుతోంటే రెండో ఎస్సార్సీ గురించి మాట్లాడమడడమంటే ‘పడుకున్న గాడిదను లేపి తన్నించుకోవడమే’ అని అన్నారు.వస్తున్నాయంటే ఎలా? ప్రస్తుతం పెట్టుబడిదారి వ్యవస్థలోనే ఉన్నామని, రాష్ట్రం సాధించుకున్న తర్వాత సామాజిక తెలంగాణపై చర్చించాలి.’ అని సూచించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి