28, సెప్టెంబర్ 2011, బుధవారం

తెలంగాణతో కర్నూలు, అనంతపురం !


తెలంగాణ ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంతర్గతంగా చర్చలు జరుపుతోందా ? ముస్లింలు అధికంగా గల కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలని ఎంఐఎం పార్టీ పట్టుబడుతుందా ? ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తో మంగళవారం ఎఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్  ఓవైసీ భేటీ అయ్యారా ? అవును ఈ ప్రశ్నలన్నింటికీ కేసీఆర్ తో అసదుద్దీన్ ఓవైసీ భేటీ, బుధవారం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి.

గతం నుండి రాయలసీమ నేతలు టీజీ వెంకటేష్, జేసీ దివాకర్ రెడ్డిలు తెలంగాణతో కలిపే రాయలసీమను ఉంచాలని, తాము కోస్తాంధ్ర కలిసి ఉండే ప్రసక్తిలేదని అంటున్నారు. రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని ఎంఐఎం పార్టీ డిమాండ్ చేస్తోంది. దీంతో పాటు తెలంగాణలో కర్నూలు, అనంతపురం జిల్లాలను కలపడం మూలంగా తెలంగాణకు 147 అసేంబ్లీ స్థానాలు, 21 ఎంపీ స్థానాలు సమంగా ఉంటాయి. దీనినే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలుస్తోంది. అయితే ఆంధ్ర ప్రాంతంతో కలిసేందుకు మిగతా సీమ జిల్లాలయిన కడప, చిత్తూరులు సిద్దపడతాయా ? అన్నదే ప్రశ్నార్ధకంగా మారింది. దీంతో పాటు తెలంగాణ జిల్లాల ప్రజలు సీమ జిల్లాలను కలుపుకునేందుకు అంగీకరిస్తారా ? అన్నది ప్రశ్నార్ధకమే. అయితే రాష్ట్రం  ఇచ్చే ముందు కేంద్రం తనను చర్చలకు పిలుస్తుందని అన్నారు. తలకాయ తెగిపడినా హైదరాబాద్‌ లేని తెలంగాణను అంగీకరించబోమని కేసీఆర్‌ స్పష్టం చేశారు

4 కామెంట్‌లు:

  1. MIMకి మహారాష్ట్రలోనూ శాఖలు ఉన్నాయి కదా. కర్నూల్, అనంతపురం జిల్లాలు తెలంగాణాలో లేకపోతే MIMకి నష్టమా?

    రిప్లయితొలగించండి
  2. అసదుద్దీన్ సచార్ కమిటీకి మద్దతు ఇవ్వమని కెసి‌ఆర్‌ని కోరడానికి అతనితో మీటింగ్ పెట్టాడట. సచార్ కమిటీ ముస్లింల ఆర్థిక పరిస్థితులని సర్వే చెయ్యడానికి కానీ తెలంగాణా గురించి కాదు.

    రిప్లయితొలగించండి
  3. తాగుబోతులు,లంచగొండ్లు ఉద్యమాలకు నాయకత్వం వహిస్తే ఇటువంటి మాటలు మధ్యమధ్యలో రావడం సహజం

    రిప్లయితొలగించండి
  4. /1. ఆంధ్ర ప్రాంతంతో కలిసేందుకు మిగతా సీమ జిల్లాలయిన కడప, చిత్తూరులు సిద్దపడతాయా ?

    2. దీంతో పాటు తెలంగాణ జిల్లాల ప్రజలు సీమ జిల్లాలను కలుపుకునేందుకు అంగీకరిస్తారా ? /

    బాగనే వుంది.

    మరి తెలంగాణ తో కలిసేందుకు కర్నూలు, అనంతపురం సిద్దపడతాయా ?
    అంతా taken for granted మనకి ?

    రిప్లయితొలగించండి