17, డిసెంబర్ 2012, సోమవారం

ఉరికొయ్యలు అమరులకు ఉయ్యాలలు



ఉరికొయ్యలు అమరులకు ఉయ్యాలలు
మీ చితి మంటలు నేతల చలిమంటలు
స్వార్ధపరుల సంపి మనం సాధిద్దం తెలంగాణ ''ఉరికొయ్యలు'' (2)

ఎల్బినగర్ చౌరస్తల శ్రీకాంతుని తొలి మరణం
ఎన్ సీసీ గేటు ముందు యాదన్న బలిదానం
ఉస్మానియ క్యాంపస్ ల ఇషాన్ రెడ్డి తొలిముడుపు
పార్లమెంటు చెట్టుకింద యాదన్న వాంగ్మూలం
ప్రజాస్వామ్య దేశానికి జరిగినట్టి అవమానం ''ఉరికొయ్యలు''

మండుతున్న గుండెలపై చంద్రబాబు పాదయాత్ర
ఎండుతున్న డొక్కలపై షర్మిలదే ప్రస్థానం
మన ఆస్తులు దోచుకున్న జగన్ బాబు జైలు యాత్ర
ఎవడొచ్చిన ఆగుతుంద తెలంగాణ జైత్రయాత్ర
జై తెలంగాణ జై జై తెలంగాణ ''ఉరికొయ్యలు"

మాతృభూమి విముక్తి పోరాటంలో అసువులు బాసిన
తెలంగాణ అమరులకు అశృతర్పణాలతో ఈ పాట అంకితం

సందీప్ రెడ్డి కొత్తపల్లి

1 కామెంట్‌: