ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ కు మద్దతు ఉపసంహరణ వెనుక అసలు లక్ష్యం ఏంటి ? తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు ఎంఐఎం - జగన్ పార్టీలు చేతులు కలుపుతున్నాయా ? తెలంగాణకు మద్దతు ఇవ్వకుండా అధికారం దక్కించుకునేందుకు మజ్లిస్ ను జగన్ వాడుకుంటున్నాడా ? తెలంగాణ రావడం ఇష్టం లేని ఎంఐఎం జగన్ కు వంత పాడుతుందా ? ఇరువురి లక్ష్యం తెలంగాణను అడ్డుకోవడమే కాబట్టి ముందస్తు వ్యూహం ప్రకారం ఒక్కటవుతున్నారా ?
అవును. మజ్లిస్ భుజం మీద తుపాకి పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు జగన్ పన్నాగం పన్నాడు. ఉద్యమంలో గందరగోళం రేపి, రాష్టంలో శాంతి భద్రతలు దెబ్బతీసి, అధికారం చేజిక్కించుకుని తెలంగాణ ఉద్యమాన్ని తండ్రి వైఎస్ లా అణగదొక్కేందుకు జగన్ రంగం సిద్దం చేశాడు. ఎంఐఎం - జగన్ ల ఇద్దరి లక్ష్యం తెలంగాణ రాకుండా అడ్డుకోవడమే కాబట్టి ఇద్దరూ ఒక్కటయ్యారు.
తెలంగాణ మీద ఎలాంటి వైఖరి చెప్పకుండా జగన్ పార్టీ నాన్చుతోంది. తెలంగాణకు అనుకూలమంటే సీమాంధ్రలో ఓట్లు పడవు. అందుకే తెలంగాణ గురించి ఏమీ చెప్పకుండా ఉద్యమాన్ని అణచాలి. అన్న జైల్లో ఉంటే తియ్యని మాటలతో తల్లి విజయమ్మ తెలంగాణలో తిరుగుతుంటే ఇప్పుడు చెల్లెలు షర్మిల కూడ తెలంగాణ గడ్డమీద పాదయాత్రకు వచ్చి సానుభూతి కూడగట్టుకునేందుకు వస్తోంది. తెలంగాణలో ఎంఐఎం అండతో ఓ మోస్తరు స్థానాలు గెలుచుకుంటే సీమాంధ్రలో గెలిచే స్థానాలతో అధికారం అందుకోవచ్చన్నది జగన్ వ్యూహం.
జగన్ జైలు నుండి బయటకు వస్తే తెలంగాణ మీద ఏదో ఓ వైఖరి చెప్పాలి. జైలులోనే ఉండి కథ నడిపిస్తే కొరకరాని కొయ్యగా ఉన్న తెలంగాణ మీద ఎలాంటి వైఖరి చెప్పకుండా ఎన్నికలకు వెళ్లొచ్చు. ఇక ఓటర్లలోనూ సానుభూతికి సానుభూతి కలిసి వస్తుంది. అందుకే జగన్ జైలులో ఉండే రాష్ట్రంలో ఎన్నికలు వచ్చే పరిస్థితిని ఏర్పరుస్తున్నాడు. కాంగ్రెస్ నుండి ఓ 10 మందిని లాగితే రాష్ట్రంలో ఎన్నికలు ఖాయం. తెలంగాణ వాదులూ తస్మాత్ జాగ్రత్త...బాప్ ఏక్ నంబరి...బేటా దస్ నంబరి..జై తెలంగాణ జై జై తెలంగాణ
విశ్లేషణ బాగానే ఉంది. ఇప్పుడింక తెలంగాణ వాదులు ప్రజలలొ తెలంగాణ వాదం ఇంకా బలంగా తీసుకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. జై తెలంగాణ నినాదం ప్రజల ఉఛ్వాస నిశ్వాసలలో మారుమ్రోగాలి. జై తెలంగాణ.
రిప్లయితొలగించండిఅశోక్ కుమార్ మునికుంట్ల.