ఒక వ్యక్తి కోసం రాజీనామా చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చూసి తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు సిగ్గు తెచ్చుకోవాలని తెలంగాణ ఉద్యోగుల సంఘాల నేతలు విఠల్, పాపారావులు అన్నారు. తెలంగాణ కోసం చనిపోయిన 600 మంది అమరవీరుల ఆశయ సాధన కోసం తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్లీ రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.
ఒక వ్యక్తి కోసం 27 మంది రాజీనామాలు చేస్తుంటే, నాలుగున్నర కోట్ల ప్రజల కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎందుకు రాజీనామా చేయటం లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ బిడ్డలైతే సెప్టెంబర్ 17న తెలంగాణ జెండాలు ఎగురవేయాలని సవాల్ చేశారు. చంద్రబాబు నాయుడు అత్యంత అవినీతి పరుడని, ధనవంతుడని తెహల్కా ఏనాడో చెప్పిందని గుర్తు చేశారు.
జగన్‌పై సీబీఐ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆయన కోసం 27 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తుంటే, తెలంగాణ కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయకపోవడం సిగ్గుచేటని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్ మండిపడ్డారు.
జగన్ లేకపోతే వైయెస్సార్ కాంగ్రెస్ పార్టీ మూతపడిపోతుంది. అందుకే జగన్ అనుచరులు రాజీనామాలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉండకుండా జగన్ వెనుకాల ఉండడమే ఆ ఎమ్మెల్యేల భవిష్యత్‌ని ఆ స్థితిలోకి పడేసింది.
రిప్లయితొలగించండిఒక పాపిష్టి వాడి కోసం 20 మంది రాజీనామా చేస్తే ఒక పాపిష్టి ఉద్యమం కోసం 100 మంది చెయ్యలేరా అని అడుగుతున్నారా?
రిప్లయితొలగించండికేవలం హైదరాబాద్ కోసం చేస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమం పాపిష్టి ఉద్యమం అనిపించలేదా? జగన్ లేకపోతే వైయెస్సార్ కాంగ్రెస్ పార్టీ మూతపడిపోతుంది. అందుకే జగన్ అనుచరులు రాజీనామాలు చేశారు. అంతే కానీ వాళ్ళకి జగన్ మీద నిజంగా ప్రేమ ఉందనుకోను. ఇప్పుడు జగన్ చెరసాలకి వెళ్ళకపోయినా 2014 ఎన్నికలలో జగన్ పార్టీ ఓడిపోతే అప్పుడైనా వీళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోతారు. జగన్ పార్టీ ప్రజారాజ్యంలాగ వోట్లు చీలుస్తుంది అనే భయంతోనే తెలుగు దేశం నాయకులు జగన్ మీద కేస్ వేశారు కానీ జగన్ పార్టీ కూడా ఎన్నికలలో ఓడిపోతుందని వాళ్ళకి తెలుసు.
రిప్లయితొలగించండి