26, జనవరి 2011, బుధవారం

మీ తెలుగు తల్లికి మా కన్నీళ దండ
మీ తెలుగు తల్లికి మా బతుకులే హారతులు
కడుపులో కుట్రలు
కనుచూపులో వివక్ష
చిరునవ్వుతో సిరులు దోచుకొని పోయెను...
గల గల గోదారి తరలి పోతున్న
బిర బిర కృష్ణమ్మా పరుగులెడుతున్న
మా పంటలు మాత్రము ఎందుతాయి
ఫ్లోరిన్ తో బొక్కలు వొంగుతాయి
బాష పేరును చెప్పి
మా బతుకులను ముంచిన
ఐదు దశాబ్దాల మీ
దోపిడి అంతం అయ్యేదాక
మా ఆటలే ఆడుతాం
మా పాటలే పాడుతాం.
నై తెలుగు తల్లి, జై తెలంగాణా
జై తెలంగాణా, జై జై తెలంగాణా.




narsimhareddy meda facebook mithrudu