చింత చచ్చినా పులుపు చావలేదు. ఎకిలి రాతలతోని తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే కుట్రపూరిత కథనం.
తెలంగాణ ప్రభుత్వం మీద ప్రజలలో అనుమానాలను పెంచే కుతంత్రం. తెలంగాణ ప్రభుత్వ చర్యలు తెలంగాణ ప్రజలకు నష్టం అని చెప్పాలని పించే విద్రోహపూరిత యత్నం. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆదివారం కొత్తపలుకు శీర్షికలో అద్యంతం తెలంగాణ మీద విషంకక్కారు.
కేసీఆర్ మీద వ్యతిరేకతను ప్రదర్శించే ప్రయత్నంలో తెలంగాణ మీద ఉన్న వ్యతిరేకతను కూడా బయటపెట్టుకున్నాడు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఉన్న స్వామిభక్తిని చాటుకున్నాడు. 'ఉల్టా చోర్ కొత్వాల్ కు డాంటే' అన్నట్లు తెలంగాణ విద్యుత్ కోటాను అడ్డుకుంటూ తెలంగాణలో విద్యుత్ కష్టాలకు కారణం అవుతున్న చంద్రబాబును పొగిడేసి కేసీఆర్ ను దోషిగా నిలబెట్టే సాహసం చేశాడు.
కేసీఆర్ కు వివిధ అంశాల మీద ఉన్న అవగాహన చూసి సమీక్షా సమావేశాలలో ఐఎఎస్ అధికారులు ఆశ్చర్యపోతుంటే వారు ఆయన తీరు మీద గుర్రుగా ఉన్నారని, సమావేశాలలో ఆయన మాట్లాడనివ్వడం లేదని వాపోతున్నారని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఇటీవల కేసీఆర్ ను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కలిశారు. ఆయనతో పాటు ఓ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా ఉన్నారు. ఎంపీ నిధులను విడుదల చేయొద్దని, తెలంగాణ ఎంపీలం అందరం కలిసి ఓ ప్రణాళికి సిద్దం చేసుకుంటామని, ఆ తరువాత దాని ప్రకారం వాటిని వినియోగించుకుంటామని కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారట. ఎందుకు నిధులు ఆపమని లేఖ రాశారు అన్నవిషయం తెలుసుకునేందుకు వెళ్లిన ఎంపీ, కాంగ్రెస్ నేతలు చిన్న అంశం మీద కూడా కేసీఆర్ కు ఉన్న అవగాహన చూసి అచ్చెరువొందారు. కానీ రాధాకృష్ణ లాంటి వ్యక్తులు మాత్రం కేసీఆర్ ను బద్ నాం చేసే ప్రయత్నంలో ఉన్నారు.
కేసీఆర్ ఒకరి వద్దకు నేను వెళ్లడం ఏంటి ? అందరూ నా వద్దకే రావాలి అన్న ధీమాతో ఉన్నారని కేసీఆర్ ఉన్నారని ఆయన నడతను తప్పుపట్టే ప్రయత్నం చేశారు రాధాకృష్ణ. తెలంగాణ ఉద్యమం జరిగినన్ని రోజులు కేసీఆర్ ను తాగుబోతుగా చిత్రించే ప్రయత్నం చేసి తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు. ఫాంహౌజ్ లో వ్యవసాయం చేస్తుంటే తప్పుడు ప్రచారం చేసి సంకలు గుద్దుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆయన వ్యక్తిత్వాన్ని, హుందాతనాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఈ కథనంలో కనిపించింది.
బురదలో పొర్లే పంది తనతోడిదే లోకం అనుకుంటుందట. రాధాకృష్ణ కూడా ఇప్పుడు అదే స్థానంలో ఉన్నట్లు కనిపిస్తోంది. తప్పులను వెనకేసుకు రావడం, దోపిడీ దారులకు కొమ్ముకాయడం, అప్పనంగా భూములు కొట్టేయడానికి మద్దతుగా నిలుస్తూ వచ్చిన వ్యక్తికి ఎదుటి వారి ఒప్పులు కూడా తప్పులుగానే కనిపిస్తాయి. కేసీఆర్ అంటే ..తెలంగాణ అంటే నరనరాన వ్యతిరేక భావన నింపుకున్న రాధాకృష్ణకు తెలంగాణ వారి భక్తిపాటలు కూడా బూతుపురాణం లాగే వినిపిస్తుంది. ఇప్పటికి ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి మాత్రమే తెలంగాణలో ఆగిపోయింది. భవిష్యత్ లో ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా అవశేషంగా మిగిలిపోవడం ఖాయం.
sandeepreddy kothapally
good information blog
రిప్లయితొలగించండి