3, జులై 2014, గురువారం

అమ్మ కరుణించింది ..అన్న కల నెరవేరింది


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నేళ్ల ఉద్యమం ? ఎంతమంది బలిదానాలు ? ఎన్ని కోట్ల మంది ఎదురుచూపులు ? ఎంతమంది ముడుపులు కట్టారు ? ఎంత మంది దేవుళ్లను వేడుకున్నారు. 14 ఏళ్ల క్రితం తెలంగాణ రథసారధి కేసీఆర్ స్వయంగా మోతె గ్రామంలో తెలంగాణ రాష్ట్రం కోసం ముడుపుకట్టారు. మరో గ్రామంలో అఖండజ్యోతిని వెలిగించారు. తెలంగాణ వచ్చేదాకా అరగుండు ..అరమీసంతో ఓ ఉద్యమకారుడు. ఇలా ఎవరికి తోచినట్లు వారు కనిపించిన చెట్టుకు పుట్టకు ..నమ్మిన దైవాలకు మొక్కులు మొక్కుకున్నారు.

ఆ కోవలోనే మన తెలంగాణ ఎక్సయిజ్ శాఖా మంత్రి పద్మారావు గౌడ్ కూడా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మొక్కుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా గుడిలో అడుగుపెట్టనని ప్రతినబూనారు. ఆరేళ్లుగా అమ్మవారి బోనాలకు వెళ్లడం లేదు. ఈ సారి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడంతో పాటు ..తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం రావడం ..మంత్రికావడం జరిగిపోయింది. అందుకే ఎప్పుడు అమ్మవారి బోనాలు వస్తాయా ? తన నాయకుడు కేసీఆర్ తో కలిసి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుందామా ? అని ఎదురు చూస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి తరపున 2004లోనే ఎమ్మెల్యేగా ఎన్నికయిన పద్మారావు కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే పదవికి 2008 లో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు ..ఆ తరువాత 2009 ఎన్నికల్లో ఓడిపోయినా టీఆర్ఎస్ పార్టీని వీడకుండా ..తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడారు. హైదరాబాద్ నగరంలో తెలంగాణ ఉద్యమవ్యాప్తికి టీఆర్ఎస్ నగర్ అధ్యక్షుడిగా  ఎనలేని కృషిచేశారు. ఈ సారి ఎన్నికల్లో గెలిచి సగర్వంగా రాష్ట్ర మంత్రి పదవి చేపట్టారు. తెలంగాణ ఉద్యమంలో నిఖార్సుగా ..నిజాయితీగా పనిచేసిన వారిలో ఒకరు పద్మారావు గౌడ్. అమ్మవారి బోనాలకు కేసీఆర్ తో కలిసి వస్తున్న ఆయనకు ఇవే ఉద్యమాభివందనాలు

sandeepreddy kothapally

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి