12, మార్చి 2014, బుధవారం

tommorow release 'JANAM SENA' live picture

TOMMOROW RELEASE

తెలుగు సినిమా చరిత్రలో రెండవ రూ.400 కోట్ల రూపాయల
భారీ బడ్జెట్ లైవ్ పిక్చర్ 'జనసేన' రేపే విడుదల

ట్యాగ్ లైన్ : now or never

హీరో - పవన్ కళ్యాణ్
దర్శకత్వం - త్రివిక్రమ్ శ్రీనివాస్
దర్శకత్వ పర్యవేక్షణ - చంద్రబాబు అండ్ కో

ఈ సారి కాకుంటే ఇక టీడీపీ అధికారంలోకి రాదు. అందుకే చంద్రబాబు నాయుడు అండ్ కో ఈ సారి సీమాంధ్రలో జగన్ పార్టీని నిలువరించేందుకు తమకు తోచిన ఎత్తుగడలన్నీ వేస్తున్నారు. పొరపాటున జగన్ అధికారంలోకి వస్తే తమకు మిగిలేది బూడిదేనని ఫిక్సయిన చంద్రబాబు కో పవన్ కళ్యాణ్ ను పార్టీ పేరుతో రంగంలోకి దించి ప్రజలను గందరగోళంలోకి నెట్టే ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీని బడ్జెట్ అంతా చంద్రబాబు అండ్ కో దే. మరీ విడ్డూరం ఏంటంటే ఈ జనసేన అభ్యర్థులు పరిమిత స్థానాలలో ..అదీ జగన్ పార్టీ కాస్త బలంగా ఉన్న స్థానాలలో పోటీకి దిగనున్నారని సమాచారం. ఇక ఇదే సమయంలో తమ బడ్జెట్ కు అదనపు లాభంగా తెలంగాణ ప్రజలను గందరగోళంలో పడేసి టీఆర్ఎస్ పార్టీ లాభపడకుండా చూసేందుకు తగిన మసాలా సిద్దం చేస్తున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం అనేది కల్ల. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలు 19. అందులో పది సినిమాలు ప్లాప్. ఏ లెక్కన చూసినా ఆయన మహా అయితే ఓ 200 కోట్లు సంపాదించి ఉంటాడు. ఆ మాత్రం రాజకీయ పార్టీ పెట్టడానికి ఏ మాత్రం సరిపోవు. మరి ఏ ధైర్యం ..వెనక ఎవరి అండా లేకుండా పవన్ కళ్యాణ్ ఎందుకు రాజకీయం చేస్తాడు. అన్న చిరంజీవికి రాజకీయాల్లో జరిగిన అనుభవం చూసిన పవన్ తెలిసి తెలిసి తన డబ్బులతో రాజకీయం చేస్తాడా ? అంటే అది కూడా జరగని పని. కేవలం చంద్రబాబుకు ఈ సారి ఖచ్చితంగా అధికారం దక్కించుకునేందుకు ఆయన వర్గం వేస్తున్న ఎత్తుగడల్లో భాగమే పవన్ పార్టీ. ఇక ముందు చంద్రబాబు అండ్ కో మరిన్ని విచిత్రాలకు కూడా తెర లేపుతుందని సమాచారం.

1 కామెంట్‌:

  1. అబ్బా అబ్బా అబ్బా , ఎం సేప్త్రి ఎం సేప్త్రి , ఏమన్న బ్రెయిన్ ఆ రెడ్డి మీది , సూపర్ రెడ్డి , భలే కనిపెట్టారే. మీరు ఎప్పుడు ఇంతేనా లేక అప్పుడు అప్పుడు ఇలా నిజాలు చెప్పేస్తూ ఉంటారా

    రిప్లయితొలగించండి