1, జనవరి 2014, బుధవారం

ఆడు ఒక్క పూట ఏశానికి మీసాలు తీసుకుంటున్నడు

ఆడు ఒక్క పూట ఏశానికి మీసాలు తీసుకుంటున్నడు
పగటి ఏశగాని లెక్కన పరేషాన్ అయితున్నడు
తెలంగాణను జీర్ణం జేసుకోలేక ఆగమయితున్నడు
అందుకే ఆని అసలు వికృత రూపాన్ని బయట వెట్టుకుంటున్నడు
మూణ్ణెళ్ల ముఖ్యమంత్రి గిరి జూసుకొని
నాయంత మొనగాడు లేడనుకుంటున్నడు

అబ్బే ..హవులే..బెవకూఫ్
కలిసుందామనేటోనికి ఇన్ని కుట్రలుంటాయిరా !
నీ ఒక్క శాడిస్టు మనస్తత్వాన్ని సంతృప్తి పరచుకోనికె
ప్రజల మధ్య సంబంధాలు శాశ్వతంగా దెబ్బతీస్తావురా ?!


మీ రెంత లేకి ఎధవలో ఇప్పుడు బయటవడ్తుంది
మేమెందుకు విడిపోతున్నమో ..సీమాంధ్ర
ప్రజలకు ఇప్పుడు అర్ధమవుతుంది..
కానీ వాళ్లు మొదట చేయాల్సింది
మీ రాజకీయ భవిష్యత్ కు సమాధికట్టడం

నమ్ముకుని మిమ్మల్ని ఎన్నుకున్నరా ..
ఇంగ వాళ్లను దేవుడు గుడ కాపాడలేడు

https://www.facebook.com/sandeepreddy.kothapally

www.facebook.com/thovva 

1 కామెంట్‌:

  1. అన్నయ్యా,
    ప్రజల మధ్య సంబంధాలు అలెడ్రీ ఎప్పుడో విడగొట్టేసారు మీ తెలంగాణ నాయకులు, మా నాయకులు కలసి....
    నాయకుల కుట్రపూరిత ప్రసంగాలకు లేక యితర విషయాలకి లొంగిపోయి మీరు సీమాంధ్రుల మీద ద్వేషం పెంచుకున్నారు. ఆ ద్వేషం మీదే రాష్ట్ర విభజన జరుగుతుందన్నది వాస్తవం....
    ఆయితే ఈ విభజన సమయంలో అవతలి వాడు ఏమై పోయినా పర్లేదు మేము మాత్రం బాగుండలే అన్న రీతిలో సాగుతున్న ప్రస్తుత విభజన ఏ విధంగా అర్ద్రవంతమో చదువుకున్న మనం, మీరు అర్ద్రం చేసుకోవాలి....
    ఈ సమయంలో (ప్రజలయితేనేమి, రాజకీయ నాయకులవల్లనైతేనేమి) కలిసి ఉండడానికి మీరు మాత్రమే కాదు.. మేము కూడా ఏ మాత్రం సుముఖంగా లేము....
    ముందుగా ఇరువైపులా న్యాయం చేయాలన్నా ఆలోచన మీ ప్రాంత నాయకులుకు ఉంటే విభజన చాలా సాఫీగా జరిగిపోయిఉండేది..... కానీ మీరు మీ వైపు మాత్రమే ఆలోచించడం వల్ల ఈ సమస్య వచ్చిందన్న సత్యాన్ని అర్దం చేసుకోగలిగితే చాలు....
    ఇందులో మిమ్మల్ని నొప్పించి ఉంటే మన్నించగలరు....
    కానీ వాస్తవంను అర్ద్రం చేసుకోగలరు అని అనుకుంటున్నాను...

    రిప్లయితొలగించండి